PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/take-advantage-of-social-media87ca79f7-72d0-48a5-b4ef-6ab430b37c39-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/take-advantage-of-social-media87ca79f7-72d0-48a5-b4ef-6ab430b37c39-415x250-IndiaHerald.jpgగాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యానికి ఈ పంచాయితీ ఎన్నికలు నాంది కావాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోరారు. పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ రౌడీరాజ్యానికి ముకుతాడు వేయాలని తెలిపారు. రాష్ర్టంలోని 175 నియోజకవర్గాల టీడీపీ ఇన్ ఛార్జ్ లు, మండల పార్టీ బాధ్యులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. chandrababu naidu;kumaar;nagarjuna akkineni;ashok;naga chaitanya;praveen;praveen kumar reddy;raghu;sravan;jagan;andhra pradesh;mohandas karamchand gandhi;police;mla;tdp;central government;ycp;chaitanya 1;reddy;party;mantra;kothapalli samuel jawaharరాష్ట్రానికి పట్టిన శని జగన్ రెడ్డి: చంద్రబాబు నాయుడురాష్ట్రానికి పట్టిన శని జగన్ రెడ్డి: చంద్రబాబు నాయుడుchandrababu naidu;kumaar;nagarjuna akkineni;ashok;naga chaitanya;praveen;praveen kumar reddy;raghu;sravan;jagan;andhra pradesh;mohandas karamchand gandhi;police;mla;tdp;central government;ycp;chaitanya 1;reddy;party;mantra;kothapalli samuel jawaharFri, 22 Jan 2021 23:31:30 GMTగాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యానికి ఈ పంచాయితీ ఎన్నికలు నాంది కావాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోరారు. పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ రౌడీరాజ్యానికి ముకుతాడు వేయాలని తెలిపారు. రాష్ర్టంలోని 175 నియోజకవర్గాల టీడీపీ ఇన్ ఛార్జ్ లు, మండల పార్టీ బాధ్యులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘అన్ని పంచాయితీలలో అభ్యర్ధులు పోటీలో ఉండేలా చూడాలి. బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా చూడాలి. ఎక్కడ ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తినా అన్నింటినీ మొబైల్ ఫోన్లలో రికార్డింగ్ చేసి అధికారులకు, టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపాలి. వైసీపీ నాయకులు కొందరు పోలీసులతో కుమ్మక్కై గతంలో పెట్టిన అక్రమ కేసులు, దౌర్జన్యాలను దృష్టిలో ఉంచుకుని, ఆయా అభ్యర్ధులు, నాయకుల ఇళ్లలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాల’’ని చంద్రబాబు పేర్కొన్నారు.
                                          ప్రజల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయంతో ఉన్నారని చంద్రబాబు చెప్పారు. అందుకే ఎన్నికలు జరగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని, అవినీతి కుంభకోణాలు, వైఫల్యాలు, హింసా విధ్వంసాలపై ప్రజల్లో వ్యతిరేకత చూసే పంచాయితీ ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తున్నారని బాబు వివరించారు. రాష్ట్రానికి పట్టిన శనిగా జగన్ రెడ్డి మారాడని, ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడని, ప్రాజెక్టుల నిర్మాణ పనులన్నీ ఆపేశాడని, పరిశ్రమలను బెదిరించి తరిమేశాడంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘‘టీడీపీ చేసిన అభివృద్ధి తప్ప వైసిపి అధికారంలోకి వచ్చాక  ఒక్క రోడ్డు వేయలేదు, ఒక్క భవనం కట్టలేదు. టీడీపీ కట్టిన ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగులు వేసి రూ 2,600 కోట్ల ప్రజాధనం స్వాహా చేశారు.  టీడీపీ చేసిన అభివృద్ధి పనులను నాశనం చేయడానికే కంకణం కట్టుకున్నారు. పంచాయితీ ఎన్నికల సందర్భంగా వీటన్నింటిపై అన్నిగ్రామాల్లో ప్రచారం చేయాలి. వైసిపి దుర్మార్గాలు, టిడిపి అభివృద్ధి పనులపై ప్రజలను చైతన్యం పరచాల’’ని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బెందాలం అశోక్, మాజీ మంత్రులు జవహర్, రఘునాధ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, జయ నాగేశ్వర రెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కిమిడి నాగార్జున, అరవింద బాబు, ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు వైసీపీని ఓడించాలని కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ మాట్లాడారు.


'ఆచార్య' సాంగ్స్ పై ఆసక్తికర విషయాలు వెల్లడించిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ .....??

బొమ్మ సూపర్ హిట్టే.. పవన్ కరెక్ట్ డెసిషన్...?

బాయ్స్ సినిమాలో జెనీలియా క్యారెక్టర్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హారోయిన్ ఎవరో తెలుసా?

గ్రేటర్ కొత్త మేయర్ ఎవరో!

తన భార్య నమ్రత ను మహేష్ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా..??

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్... రీ సౌండే మరి...?

నిమ్మగడ్డ హీరో... ముప్పయ్యేళ్ళ తరువాత మళ్ళీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>