PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/satire/129/ap-politics93ec20bc-c239-4945-885a-8ab630f49bf8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/satire/129/ap-politics93ec20bc-c239-4945-885a-8ab630f49bf8-415x250-IndiaHerald.jpg పైగా వీరికి ఎలాంటి రిజ‌ర్వేష‌న్లు, అవ‌కాశాలు రాక వెన‌క‌ప‌డిపోతున్నారు. అయితే వీరిలో త‌న‌పై ఉన్న వ్య‌తిరేక‌త త‌గ్గించుకునేందుకు జ‌గ‌న్‌కు మంచి అవ‌కాశం ఉన్నా కూడా .. జ‌గ‌న్ ఆ దిశ‌గా ఆలోచ‌న ఎందుకు చేయ‌డం లేదో అర్థం కావ‌డం లేదు. కేంద్ర ప్ర‌భుత్వం అగ్ర వ‌ర్ణాల్లో ఆర్థికంగా వెన‌క‌ప‌డ్డ పేద‌ల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్లు గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందే తీసుకు వ‌చ్చింది. చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు ముందే వీటిల్లో 5 శాతం రిజ‌ర్వేష‌న్లు కాపుల‌కు.. మిగిలిన‌వి మిగిలిన అగ్ర వ‌ర్ణ‌పేద‌ల‌కు ఇస్తూ కేబినెట్ తీర్మానం jagan;kcr;andhra pradesh;cabinet;letter;central governmentజ‌గ‌న్‌కు ఈ కులాల‌న్ని దూరం దూరం... దెబ్బ‌డిపోతోందిగా..!జ‌గ‌న్‌కు ఈ కులాల‌న్ని దూరం దూరం... దెబ్బ‌డిపోతోందిగా..!jagan;kcr;andhra pradesh;cabinet;letter;central governmentFri, 22 Jan 2021 11:42:00 GMTఏపీలో కొద్ది రోజులుగా కుల రాజ‌కీయం న‌డిచింది. పార్టీల వారీగా కులాలు విడిపోయాయి. చివ‌ర‌కు రాజ‌కీయ నేత‌లు కూడా కులాల పేర్లు పెట్టి విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం ప్రారంభించారు. కుల రాజ‌కీయం పోయాక‌.. ఇప్పుడు మ‌త రాజ‌కీయం న‌డుస్తోంది. ఇక సీఎం జ‌గ‌న్ సైతం ప్ర‌త్యేకంగా కొన్ని కులాల పేర్లు పెట్టి విమ‌ర్శ‌లు చేయ‌డం కామ‌న్‌గా పెట్టుకున్నారు. ఇక ఏపీలో కొద్ది రోజులుగా అగ్ర వ‌ర్ణాల‌కు చెందిన ప్ర‌జ‌లు అంద‌రూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై తీవ్ర గుస్సాతో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

అగ్ర‌వ‌ర్ణాల్లో రెడ్లు, కాపులు, క‌మ్మ‌లు, బ్రాహ్మ‌ణుల‌తో పాటు ఎంతో మంది గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు ఓ ఛాన్స్ ఇద్దామ‌ని ఓట్లేశారు. ఇప్పుడు ముఖ్య‌మంత్రి అయ్యాక ప‌థ‌కాల అమ‌ల్లో జ‌గ‌న్ త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆవేద‌న వారిలో గూడుక‌ట్టుకుపోయింది. అగ్ర‌వ‌ర్ణాల్లో చాలా మంది పేద‌లు ఉన్నారు. పైగా వీరికి ఎలాంటి రిజ‌ర్వేష‌న్లు, అవ‌కాశాలు రాక వెన‌క‌ప‌డిపోతున్నారు. అయితే వీరిలో త‌న‌పై ఉన్న వ్య‌తిరేక‌త త‌గ్గించుకునేందుకు జ‌గ‌న్‌కు మంచి అవ‌కాశం ఉన్నా కూడా .. జ‌గ‌న్ ఆ దిశ‌గా ఆలోచ‌న ఎందుకు చేయ‌డం లేదో అర్థం కావ‌డం లేదు.

కేంద్ర ప్ర‌భుత్వం అగ్ర వ‌ర్ణాల్లో ఆర్థికంగా వెన‌క‌ప‌డ్డ పేద‌ల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్లు గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందే తీసుకు వ‌చ్చింది. చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు ముందే వీటిల్లో 5 శాతం రిజ‌ర్వేష‌న్లు కాపుల‌కు.. మిగిలిన‌వి మిగిలిన అగ్ర వ‌ర్ణ‌పేద‌ల‌కు ఇస్తూ కేబినెట్ తీర్మానం చేశారు. అయితే జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వాటిని ర‌ద్దు చేసేశారు. అయితే ఇప్పుడు కేసీఆర్ వీటిని అమ‌లు చేస్తున్నారు. రెండు , మూడు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్త‌ర్వులు కూడా విడుద‌ల కానున్నాయి.

అయితే ఏపీలో జ‌గ‌న్ ఈ అవ‌కాశం ఇక్క‌డ అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు కూడా ఇవ్వొచ్చు.. కానీ ఎందుకు ఈ ఛాన్స్ వాడుకోవ‌డం లేదో ?  తెలియ‌డం లేదు. జ‌గ‌న్ అమ‌లు చేస్తోన్న సంక్షేమంతో పాటు ఇత‌ర‌త్రా ప‌థ‌కాలు చాలా మంది అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు అంద‌డం లేదు. ఇప్పుడు కేసీఆర్ అక్క‌డ అమ‌లు చేస్తోన్న 10 శాతం రిజ‌ర్వేష‌న్ల‌తో ఏపీ ప్ర‌భుత్వంపై కూడా ఒత్తిడి పెరిగే అవ‌కాశం ఉంది. జ‌గ‌న్ దీనిపై నిర్ణ‌యం తీసుకోక‌పోతే ఈ వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త కొని తెచ్చుకున్న‌ట్టే అవుతుంది.  


అమ్మాయిలూ.. ఈ ఆహారాన్ని మాత్రం కచ్చితంగా తీసుకోండి

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

కాపు వేద‌న‌: రెంటికీ చెడుతున్న ‌కాపులు.. ఏం జ‌రుగుతోంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>