MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/reasons-behind-soundarya-sudden-demiseada055fd-0e0c-4167-8e47-3dbba595c89d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/reasons-behind-soundarya-sudden-demiseada055fd-0e0c-4167-8e47-3dbba595c89d-415x250-IndiaHerald.jpgఆ నటి యమలీల సినిమా మర్చిపోని ప్రేక్షకులు ఉండరు. ఎందుకంటే ఈ సినిమాలో అమ్మ గొప్పతనం, అమ్మ కోసం యముడితో సైతం పోరాడిన ఒక కొడుకు ఆవేదన స్పష్టంగా కనిపిస్తుంది. యమలీల సినిమా 1994 వ సంవత్సరంలో వచ్చింది. ఇన్నేళ్లు అయినా గాని ఇప్పుడు కూడా ఈ సినిమాని ఇష్టపడే అభిమానులు ఉన్నారు. soundarya;soundarya;ali;ali reza;indraja;krishna reddy;krishna river;roja;cinema;sv museum;media;interview;director;comedy;comedian;hero;heroine;reddy;v;aamaniసౌందర్య చెప్పిన మాట విని చలించిపోయా: ఎస్ వి కృష్ణా రెడ్డిసౌందర్య చెప్పిన మాట విని చలించిపోయా: ఎస్ వి కృష్ణా రెడ్డిsoundarya;soundarya;ali;ali reza;indraja;krishna reddy;krishna river;roja;cinema;sv museum;media;interview;director;comedy;comedian;hero;heroine;reddy;v;aamaniFri, 22 Jan 2021 13:00:00 GMTసినిమా మర్చిపోని ప్రేక్షకులు ఉండరు. ఎందుకంటే ఈ సినిమాలో అమ్మ గొప్పతనం, అమ్మ కోసం యముడితో సైతం పోరాడిన ఒక కొడుకు ఆవేదన స్పష్టంగా కనిపిస్తుంది. యమలీల సినిమా  1994 వ సంవత్సరంలో వచ్చింది. ఇన్నేళ్లు అయినా గాని ఇప్పుడు కూడా ఈ సినిమాని ఇష్టపడే అభిమానులు ఉన్నారు. అలాగే ఈ సినిమాలో సెంటిమెంట్,  కామెడీ, సోషియో ఫాంటసీ, పాటలు అన్నీ కలిసి సినిమాను హిట్ చేసాయి.  యమలీల సినిమాలో హీరోగా ఆలీ నటించారు. ఈ సినిమాలో హీరోగా నటించకముందు కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి  కమెడియన్ గా  చేసే ఆలీని  హీరోగా పరిచయం చేసి అందరికి షాక్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో ఆలీకి జోడిగా ఇంద్రజ నటించారు. అయితే ఇంద్రజ కంటే ముందు వేరే హీరోయిన్ ను ఈ సినిమాలో నటించమని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అడిగారట. కానీ హీరోగా ఆలీ చేస్తున్నాడు అని తెలిసి ఆ హీరోయిన్ యమలీల సినిమాను తిరస్కరించారట. అసలు ఆ హీరోయిన్ ఎవరు?  ఏంటో చూద్దాం. ! ఆమె మరెవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్, ఆల్మోస్ట్ అందరి హీరోల సరసన నటించి మంచి పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకున్న  దివంగత నటి సౌందర్య. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఒక మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమెడియన్ అలీ గురించి అలాగే యమలీల సినిమా గురించి కొన్ని  ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

యమలీల సినిమాలో హీరోయిన్ గా చేయమని సౌందర్యని అడిగే సమయానికి  ఆమె టాప్ పోసిషన్ లో ఉన్నది అని తెలిసిన అడిగారట. అయితే ముందు ఓకే చెప్పినది.కానీ ఆ  తరువాత హీరోగా  ఆలీ నటిస్తున్నాడు అని తెలిసి ఆలోచనలో పడిందట. అయితే అప్పటికే సౌందర్యకి పెద్ద హీరోల సరసన నటించే ఆఫర్లు వస్తున్నాయట. మళ్ళీ ఇప్పుడు అలీతో నటిస్తే తన కెరీర్ కు దెబ్బతినే అవకాశం ఉంది అని డైరెక్టర్ తో అన్నారట. మీరే చెప్పండి.. నేను ఈ సినిమా ఒప్పుకోవడం కరెక్టేనా అని అడిగారట కృష్ణా రెడ్డిని. ఆ సినిమాలో  మీరు హీరోగా నటిస్తే, మీ పక్కన నటిస్తాను అని అన్నారట.అయితే అప్పుడు  సౌందర్యకు ఆ సమయంలో ఒక్కటే మాట చెప్పారట డైరెక్టర్. "అలీ కోసం ఈ సినిమాలో ఎవరినైనా మార్చుకుంటాను కానీ అలీని మాత్రం మార్చలేను " ఈ సినిమాకు ఆలీ అయితేనే వంద శాతం న్యాయం చేస్తాడని అన్నారట. అంతేకాదు ఇంకోమాట కూడా సౌందర్యతో అన్నారట. ఒక వేళ అలీ ఇప్పుడు స్టార్ హీరో అయితే అప్పుడు నటిస్తావా అతని పక్కన అని అడిగారట కృష్ణారెడ్డి. ఆ మాటకు ఆమె షాకయ్యారట. అలా యమలీల సినిమాలో ఇంద్రజను హీరోయిన్ గా పెట్టడం జరిగిందట.దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఆలీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. సినిమా సూపర్ హిట్ అయింది.

 కొంతకాలం తరువాత జగపతి బాబు, ఆమని, రోజా నటించిన  ‘శుభలగ్నం’ సినిమాలో  అలీతో ఓ స్పెషల్ సాంగ్ చేయాలనీ అనుకున్నారట.అయితే ఆ పాటలో  హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలిసి స్వయంగా సౌందర్యనే  అలీతో నటిస్తానని చెప్పారట. ఆ రోజు అలీతో నటించే  అవకాశం వదులుకున్నాను ఆ వెలితి నాలో ఇంకా ఊడిపోయింది అని అన్నారట. మీకు అభ్యంతరం లేకపోతె అలీతో  ఆ ఒక్క పాటలో నేను నటిస్తా అని  అడిగారట. ముందు నటించను అని చెప్పినాగాని తరువాత తానే స్వయంగా నటిస్తానని చెప్పడంతోనే సౌందర్య గొప్పతనం ఏంటో అర్ధం అవుతుందని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు.. !!


‘అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి బురదలో పొర్లిందట’.. వైసీపీపై నిప్పులు చెరిగాన పవన్..

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌.. నాడు-నేడు.. నిర్వీర్యం దిశ‌గా అడుగులు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?

వైసీపీకి మ‌రో షాక్‌.... జ‌గ‌న్‌కు దెబ్బ మీద దెబ్బ‌...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!

లిప్ లాక్ తో ఇబ్బందుల్లో పడ్డ ప్రదీప్..

జ‌గ‌న్‌కు ఈ కులాల‌న్ని దూరం దూరం... దెబ్బ‌డిపోతోందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>