PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-rameshkumar3cf18ae7-0113-4e34-925e-bf2ba5ccb172-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-rameshkumar3cf18ae7-0113-4e34-925e-bf2ba5ccb172-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇప్పుడు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. రాజకీయంగా ఈ మాటల యుద్ధం అధికార పార్టీనే అనితిమంగా ఇబ్బంది పెడుతుంది అనే మాట వాస్తవం. ఇక సిఎం జగన్ ఈ వ్వ్యవహారం మీద సీరియస్ గా ఉన్నా సరే... హైకోర్ట్ ఇచ్చిన తీర్పుతో ఎన్నికల నిర్వహణ జరగడం ఖాయంగా కనపడుతుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పు వెలువడినప్పటి నుంచీ ముఖ్యమంత్రnimmagadda;jagan;andhra pradesh;రాజీనామా;high court;chief minister;kala venkata rao;arrest;tdp;traffic police;local language;venkata rao;varla ramaiahఆ ఇద్దరు కలెక్టర్లకు నిమ్మగడ్డ షాక్ ఇస్తారా...?ఆ ఇద్దరు కలెక్టర్లకు నిమ్మగడ్డ షాక్ ఇస్తారా...?nimmagadda;jagan;andhra pradesh;రాజీనామా;high court;chief minister;kala venkata rao;arrest;tdp;traffic police;local language;venkata rao;varla ramaiahFri, 22 Jan 2021 11:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇప్పుడు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. రాజకీయంగా ఈ మాటల యుద్ధం అధికార పార్టీనే అనితిమంగా ఇబ్బంది పెడుతుంది అనే మాట వాస్తవం. ఇక సిఎం జగన్ ఈ వ్వ్యవహారం మీద సీరియస్ గా ఉన్నా సరే... హైకోర్ట్ ఇచ్చిన తీర్పుతో ఎన్నికల నిర్వహణ జరగడం ఖాయంగా కనపడుతుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య  కీలక వ్యాఖ్యలు చేసారు.

ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పు వెలువడినప్పటి నుంచీ ముఖ్యమంత్రికి వణుకు మొదలైంది అని ఆయన అన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నైతిక బాధ్యత వహించి, ముఖ్యమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు. కోర్టు తీర్పుని స్వాగతించి, ఎన్నికలకు సిద్ధమన్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పచెప్పాలి అని ఆయన పేర్కొన్నారు. అడుగడుగునా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న సవాంగ్ డీజీపీగా కొనసాగడానికి అనర్హుడు అని ఆయన వ్యాఖ్యానించారు.

ఎన్నికల కమిషనర్ తక్షణమే ఎన్నికలప్రక్రియ పూర్తయ్యేంతవరకు  ఆయన్ని  తొలగించాలి అని డిమాండ్ చేసారు. ఆయన డీజీగా ఉంటే, రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగదని, సవాంగ్ వ్యవహారశైలి తెలిసినవాళ్లెవరైనా ఒప్పుకుంటారు అని ఆయన పేర్కొన్నారు.  ఎన్నికల వాయిదాకు ముందు, ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వుల  ప్రకారం   గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను నిమ్మగడ్డ తక్షణమే బదిలీచేయాలి అని డిమాండ్ చేసారు. గతంలో బలవంతపు ఏకగ్రీవాలకు సహకరించి, ప్రభుత్వానికి అండగా నిలిచిన పోలీస్ అధికారులను రేంజ్ దాటి బదిలీచేయాలని ఎస్ఈసీని కోరుతున్నాను అని ఆయన వ్యాఖ్యానించారు. కళా వెంకట్రావును అరెస్ట్ చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశాక, ఆయన్ని అరెస్ట్ చేయలేదని సజ్జల చెప్పడం, సజ్జల దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనం అని విమర్శించారు. అరెస్ట్ చేశాకే బెయిల్ ఇస్తారనే ఇంగితంకూడా సజ్జలకు లేకపోవడం బాధాకరం అని అన్నారు.


జ‌గ‌న్‌కు ఈ కులాల‌న్ని దూరం దూరం... దెబ్బ‌డిపోతోందిగా..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

కాపు వేద‌న‌: రెంటికీ చెడుతున్న ‌కాపులు.. ఏం జ‌రుగుతోంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>