MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-master-200-crore-clubcc0bf737-fc07-476a-9118-7a708d2767cc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-master-200-crore-clubcc0bf737-fc07-476a-9118-7a708d2767cc-415x250-IndiaHerald.jpgతలపతి విజయ్ ఫ్యాన్స్ కు సెలెబ్రేట్ చేసుకోవడానికి ఓ కొత్త రీజన్ దొరికింది. బాక్సాఫీస్ వద్ద "మాస్టర్" సినిమా రికార్డుల మోత మ్రోగిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కురిపిస్తున్న రికార్డుల వర్షాన్ని చూసి విజయ్ తో పాటు విజయ్ సేతుపతి క్లౌడ్ 9 లో ఉన్నాడు. vijay master 200 crore club;sethu;vijay;vijay sethupathi;tollywood;cinema;telugu;government;kollywood;blockbuster hit;tamilnadu;husband;success;joseph vijay;lokesh kanagaraj;masterరూ.200 కోట్ల క్లబ్ లోకి ఎంటరైన "మాస్టర్"రూ.200 కోట్ల క్లబ్ లోకి ఎంటరైన "మాస్టర్"vijay master 200 crore club;sethu;vijay;vijay sethupathi;tollywood;cinema;telugu;government;kollywood;blockbuster hit;tamilnadu;husband;success;joseph vijay;lokesh kanagaraj;masterFri, 22 Jan 2021 18:00:00 GMTవిజయ్ ఫ్యాన్స్ కు సెలెబ్రేట్ చేసుకోవడానికి ఓ కొత్త రీజన్ దొరికింది. బాక్సాఫీస్ వద్ద "మాస్టర్" సినిమా రికార్డుల మోత మ్రోగిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కురిపిస్తున్న రికార్డుల వర్షాన్ని చూసి విజయ్ తో పాటు విజయ్ సేతుపతి క్లౌడ్ 9 లో ఉన్నాడు.

కొంతకాలం క్రితమే థియేటర్స్ ను 50 శాతం ఆక్యుపెన్సీతో ఓపెన్ చేసుకోవచ్చని సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఐతే, ఈ రేంజ్ లో ఈ సినిమాకు ఆదరణ లభిస్తుందని ఎవరూ ఊహించలేదు. మూవీలవర్స్ ను "మాస్టర్" సినిమా సంతృప్తిపరుస్తోంది.

ట్రేడర్స్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 200 కోట్ల రూపాయల క్లబ్ ను క్రాస్ చేసిందని టాక్. కేవలం తమిళనాడులోనే 100 కోట్ల రూపాయల క్లబ్ ను దాటిందట. కేవలం ఎనిమిదిరోజుల్లోనే ఈ సినిమా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరడం విజయ్ ఫ్యాన్స్ ను సంతోషపెడుతోంది.

లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో కూడా విశేష ఆదరణ పొందుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 13 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. ఈ యాక్షన్ డ్రామాను బ్లాక్ బస్టర్ గా డిక్లేర్ చేశారు.

విజయ్ కెరీర్లో 200 కోట్ల క్లబ్ లో చేరిన నాలుగవ సినిమాగా ఇది చోటు సంపాదించుకుంది. తమిళనాడులో ఏకంగా నాలుగు సినిమాలను 200 కోట్ల క్లబ్ లో చేర్చిన ఘనత విజయ్ కే సాధ్యమైంది అనంటున్నారు అభిమానులు. విడుదలైన వారానికే ఈ సినిమా ఈ రికార్డు కలక్షన్స్ తో సంచలనం సృష్టిస్తోంది.

అసలు ఈ సినిమా గతేడాదే విడుదలవ్వాల్సి ఉంది. కానీ, లాక్ డౌన్ వలన సినిమా విడుదల ఆలస్యమైంది. మొత్తానికి, ఈ ఏడాది ఈ సినిమా థియేటర్స్ ద్వారా ప్రేక్షకులను అలరించింది.

ఇటువంటి సమయంలో సినిమాలను థియేటర్స్ లో రిలీజ్ చేయాలా లేదా ఓటీటీకే పరిమితం చేయాలా అన్న సందేహాన్ని "మాస్టర్" మూవీ తొలగించింది. మంచి సబ్జెక్ట్ ఉంటే ప్రేక్షకులకు థియేటర్స్ కు వచ్చి మరీ ఆదరిస్తారని నిరూపించింది. "మాస్టర్" సక్సెస్ అనేది టాలీవుడ్ అలాగే కోలీవుడ్ చిత్రపరిశ్రమలో కొత్త ఆశలను నింపింది. 


తదుపరి సినిమా కోసం అనుష్క పడుతున్న క‌ష్టాలు చూడండి..!

ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమాలోని ఆ రెండు పాటలను కేవలం రెండు రోజుల్లోనే తీసారట..!!

నా అభిమానులు కూడా వైసీపీకే ఓటేశారు.. పవన్ కల్యాణ్ భావోద్వేగం

అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళంగా పవన్ కళ్యాణ్ ఎంత ఇచ్చాడో తెలుసా...?

మహేష్ ఫ్యాన్సా మజాకా.. ఇది వీళ్లకే సాధ్యమండీ బాబు

అందాలే పెట్టుబడిగా సరికొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన శ్రీ రెడ్డి..

అక్కినేని కోడలు పక్కన బాలీవుడ్ హీరో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>