PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/uttara-pradesh5eb7cf62-bd28-48a1-b4e8-5417a76d0e20-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/uttara-pradesh5eb7cf62-bd28-48a1-b4e8-5417a76d0e20-415x250-IndiaHerald.jpgప్రభుత్వ చట్టాలు మారిన, మహిళల రక్షణ కోసం కొత్త చట్టాలను అమలు చేస్తున్న కూడా మృగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. వావి వరుసలు కూడా పూర్తిగా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల పై లైంగిక దాడులు జరుగుతున్నాయి. నార్త్ ఇండియా లో అయితే లెక్క లేనన్ని జరిగాయి. తాజాగా జరిగిన మరో ఘటన కంట తడి పెట్టిస్తుంది. రెండేళ్ల చిన్నారి పై ఓ కామాంధుడు అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశాడు. చిన్నారి మృతి తో తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.. uttara pradesh;amala akkineni;india;police;police station;murder.;traffic police;local language;father;lieరెండేళ్ల చిన్నారి పై అతి కిరాతకంగా అత్యాచారం, హత్య.. చివరికిరెండేళ్ల చిన్నారి పై అతి కిరాతకంగా అత్యాచారం, హత్య.. చివరికిuttara pradesh;amala akkineni;india;police;police station;murder.;traffic police;local language;father;lieFri, 22 Jan 2021 08:00:00 GMTఇండియా లో అయితే లెక్క లేనన్ని జరిగాయి. తాజాగా జరిగిన మరో ఘటన కంట తడి పెట్టిస్తుంది. రెండేళ్ల చిన్నారి పై ఓ కామాంధుడు అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశాడు. చిన్నారి మృతి తో తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు..



వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది. స్థానిక కవి నగర్‌కు చెందిన ఒక కుటుంబం తమ పాప కనిపించడంలేదంటూ గత ఏడాది అక్టోబర్‌ 19న పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బంధువులతో పాటు పాప తండ్రి స్నేహితుడు చందన్‌ పాండేపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు వారిని ప్రశ్నించారు. తొలుత తనకేమీ తెలియదని అతడు బుకాయించాడు. మరునాడు స్థానిక పారిశ్రామిక ప్రాంతం లోని కాలువ వద్ద బాలిక మృత దేహం లభించింది.



పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు చందన్ ను మరోసారి పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారణ జరిపారు. చందన్‌ను పోలీసులు మరోసారి ప్రశ్నించగా పాపపై లైంగికదాడికి పాల్పడి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడ్ని అరెస్ట్‌ చేసి పోస్కో చట్టం తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి డిసెంబర్‌ 29న చార్జిషీట్‌ను ఫైల్‌ చేశారు. అనంతరం పోస్కో కోర్టు రికార్డు స్థాయిలో 29 రోజుల్లో కేసు విచారణ పూర్తి చేసింది. పది మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. న్యాయ మూర్తి మహేంద్ర శ్రీవాస్త బుధవారం తీర్పు వెల్లడించారు. నిందితుడు చందన్‌ పాండేకు మరణ శిక్ష విధించారు. ఈ విషయం స్థానికంగా కలకలం రేపుతోంది.




హెచ్ -1బీ పై తాజా వెసులుబాటు...ఎన్నారైల ఓట్లకు కృతజ్ఞత చూపించాడుగా..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

రాధే శ్యామ్ పరమహంస సీక్రెట్ బయటపెట్టిన కృష్ణంరాజు !

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ యువ‌త జాగృతం కావాలి.. రాజ‌కీయాల‌కు చేరువ అవ్వాలి..!

హెరాల్డ్ సెటైర్ : రాజకీయ యాత్రలతో రచ్చ చేస్తున్న ప్రతిపక్షాలు

ఆర్థిక కష్టం.. టిడిపికి ఎంతో నష్టం ?

జగనోరు చులకనవుతున్నారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>