Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/virat-and-anushka-came-on-to-media-and-said-thanks2da8c2ac-f259-4876-b875-e480796300c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/virat-and-anushka-came-on-to-media-and-said-thanks2da8c2ac-f259-4876-b875-e480796300c3-415x250-IndiaHerald.jpgటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మధ్యనే తండ్రయిన విషయం తెలిసిందే. ఆయన భార్య అనుష్క శర్మ ఇటీవలే పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లీనే తన ట్విటర్ ద్వారా వెల్లడించాడు. కానీ చిన్నారి ఫొటోలను మాత్రం బయటికి విడుదల చేయలేదు. అంతేకాకుండా తమ ప్రైవసీని ..virat anushka;anoushka;anushka sharma;jeevitha rajaseskhar;prema;virat kohli;india;media;twitter;love;doctor;wife;letter;father;santosham;anandamబిడ్డ పుట్టిన తరువాత తొలిసారి మీడియా ముందుకు విరాట్-అనుష్క.. ఏం చెప్పారంటే..బిడ్డ పుట్టిన తరువాత తొలిసారి మీడియా ముందుకు విరాట్-అనుష్క.. ఏం చెప్పారంటే..virat anushka;anoushka;anushka sharma;jeevitha rajaseskhar;prema;virat kohli;india;media;twitter;love;doctor;wife;letter;father;santosham;anandamFri, 22 Jan 2021 08:15:49 GMTఇంటర్నెట్ డెస్క్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మధ్యనే తండ్రయిన విషయం తెలిసిందే. ఆయన భార్య అనుష్క శర్మ ఇటీవలే పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లీనే తన ట్విటర్ ద్వారా వెల్లడించాడు. కానీ చిన్నారి ఫొటోలను మాత్రం బయటికి విడుదల చేయలేదు. అంతేకాకుండా తమ ప్రైవసీని గౌరవించాలని, తమ పాపకు సంబంధించిన ఫేక్ ఫోటోలను మీడియాలో ప్రసారం చేయవద్దని కోరారు. ఆ తరువాత వారిద్దరూ ఇన్నాళ్లూ ఎవరికీ కనిపించలేదు.

విరుష్క దంపతులు కోరడంతో మీడియా కూడా వారిని అండగా నిలిచింది. వారి గురించి, వారి పాప గురించి ఎలాంటి వార్తలనూ ప్రసారం చేయలేదు. అయితే ఎట్టకేలకు బిడ్డ పుట్టిన 10 రోజుల తరువాత వారిద్దరూ తొలిసారిగా మీడియాకు చిక్కారు. గురువారం డాక్టర్ చెకప్ కోసం వెళుతున్న విరాట్, అనుష్కలను మీడియా ప్రతినిధులు గుర్తించారు. వారి ఫోటోలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే వారు మీడియాతో మాట్లాడారు. తమ విజ్ఞప్తిని మన్నించి.. తమ గురించి, తమ పాప గురించి ఎలాంటి వార్తలనూ ప్రసారం చేయనందుకు విరుష్క దంపతులు  మీడియాకు కృతజ్ణతలు తెలిపారు.

చాలా రోజుల తరువాత విరుష్క జంటకు సంబందించిన ఫోటో బయటకు రావడంతో వారి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. విరాట్, అరుష్కలను ఇలా చూడడం ఆనందంగా ఉందని, వారు, వారి పాప సంతోషంగా ఉండాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే తండ్రి కాబోతున్న విరాట్ గత డిసెంబరులో ఆసీస్ టూర్ నుంచి పెటర్నటీ లీవ్ తీసుకుని భారత్ తిరిగొచ్చాడు. ఆ తరువాత తమకు పాప పుట్టిన విషయం ట్విటర్ ద్వారా వెల్లడించాడు.  ‘‘ఇవాళ మధ్యాహ్నం మాకు కూతురు పుట్టిందన్న విషయాన్ని మీతో పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. అనుష్క, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు, మా జీవితంలో ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సమయంలో మా ప్రైవసీని మీరంతా గౌరవిస్తారని ఆశిస్తూ.. ప్రేమతో మీ విరాట్’’ అని విరాట్ తన ట్విట్‌లో రాసుకొచ్చాడు.

">




హెచ్ -1బీ పై తాజా వెసులుబాటు...ఎన్నారైల ఓట్లకు కృతజ్ఞత చూపించాడుగా..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

రాధే శ్యామ్ పరమహంస సీక్రెట్ బయటపెట్టిన కృష్ణంరాజు !

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ యువ‌త జాగృతం కావాలి.. రాజ‌కీయాల‌కు చేరువ అవ్వాలి..!

హెరాల్డ్ సెటైర్ : రాజకీయ యాత్రలతో రచ్చ చేస్తున్న ప్రతిపక్షాలు

ఆర్థిక కష్టం.. టిడిపికి ఎంతో నష్టం ?

జగనోరు చులకనవుతున్నారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>