PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_analysis/brahmins-jagan10965dcc-1a06-4ab8-8095-d4dbe0ba5bb6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_analysis/brahmins-jagan10965dcc-1a06-4ab8-8095-d4dbe0ba5bb6-415x250-IndiaHerald.jpgఇక‌, పార్టీలో మాత్రం కీల‌క‌మైన ప‌దవుల్లో మెజారిటీగా రెడ్డి సామాజిక వ‌ర్గానికే కేటాయించారు. నిజానికి బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు ఉన్న‌దే త‌క్కువ‌. ఉన్న‌వారిలోనూ ప్ర‌ధానంగా ఎలాంటి ప్రాధాన్యం ద‌క్కించుకోని వారు మ‌రింత మంది ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ తూర్పు నుంచి ఓడిపోయిన‌.. విజ‌య‌నిర్మ‌ల‌కు నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప‌ద‌వినీ ఇవ్వ‌లేదు. బాప‌ట్ల నుంచి వ‌రుస‌గా రెండు సార్లు గెలిచిన కోన ప్ర‌భాక‌ర్ రావుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వ‌లేదు. brahmins jagan;tiru;vishnu;indiaherald group;rbi;backward classes;smart phone;vishakapatnam;mla;minister;letter;ycp;reddy;partyబ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!brahmins jagan;tiru;vishnu;indiaherald group;rbi;backward classes;smart phone;vishakapatnam;mla;minister;letter;ycp;reddy;partyFri, 22 Jan 2021 12:05:00 GMTఅధికార పార్టీ వైసీపీలో అగ్ర‌వ‌ర్ణ బ్రాహ్మ‌ణుల‌కు ప్రాధాన్యం ఎంత ఉంది?  వైసీపీలో రెడ్డి, కాపు, క్ష‌త్రియ‌, బీసీ ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌తో పోల్చుకుంటే.. బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు ఎంద‌రు ఉన్నారు?  అంటే.. ప్ర‌శ్నార్థ‌కంగా నే మారింది.  రెడ్లు, ఇత‌ర సామాజిక వ‌ర్గాల డామినేష‌న్‌తో బ్రాహ్మ‌ణుల‌కు పార్టీలో ప‌ద‌వులు అంద‌ని ద్రాక్ష‌గానే మారాయి. పైగా ఉన్న ఒక‌టి అరా ప‌ద‌వులు కూడా త‌మ కు అత్యంత అనుంగులుగా ఉన్న‌వారికో.. లేదా ఇప్ప‌టికే కీల‌క‌మైన ప‌ద‌విలో ఉన్న‌వారికో ఇచ్చేస్తున్నారు. దీంతో వైసీపీలో బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్యం లేకుండా పోయింది.

అయితే.. గుడ్డిలో మెల్ల న‌యం అన్న‌ట్టుగా.. ఉన్న అన్ని పార్టీల‌తోనూ పోల్చుకుంటే.. వైసీపీనే బెట‌ర్ అని చెప్ప‌క‌త‌ప్ప‌దు. ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుకు.. బ్రాహ్మ‌ణ ‌కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు. ఇక‌, పార్టీలో మాత్రం కీల‌క‌మైన ప‌దవుల్లో మెజారిటీగా రెడ్డి సామాజిక వ‌ర్గానికే కేటాయించారు. నిజానికి బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు ఉన్న‌దే త‌క్కువ‌. ఉన్న‌వారిలోనూ ప్ర‌ధానంగా ఎలాంటి ప్రాధాన్యం ద‌క్కించుకోని వారు మ‌రింత మంది ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ తూర్పు నుంచి ఓడిపోయిన‌.. విజ‌య‌నిర్మ‌ల‌కు నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప‌ద‌వినీ ఇవ్వ‌లేదు.

బాప‌ట్ల నుంచి వ‌రుస‌గా రెండు సార్లు గెలిచిన కోన ప్ర‌భాక‌ర్ రావుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వ‌లేదు. నిజానికి రాజకీయంగా బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం చైత‌న్య‌మే త‌క్కువ‌గా ఉంద‌నేది వాస్త‌వం. ఉన్న‌వారిలోనూ గుర్తింపు కోసం అల్లాడుతున్న‌వారు కూడా ఉన్నారు. ఓటు బ్యాంకు విష‌యానికి వ‌స్తే.. మాత్రం అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని చెప్పే పార్టీలు ప‌ద‌వుల విష‌యానికి వ‌స్తే మాత్రం దాట‌వేత ధోర‌ణిని అవ‌లంబిస్తున్నాయి. తిరుమ‌ల తిరుప‌తి మాజీ ప్ర‌ధానార్చ‌కుడి విష‌యం తీసుకుంటే.. ఆయ‌న‌ను తిరిగి నియ‌మిస్తామ‌ని.. వైసీపీ నేత‌లు ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌ను త్రిశంకు స్వ‌ర్గంలోనే ఉంచారు. ఇలాంటి ప‌రిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలానే ఉండ‌డం గ‌మ‌నార్హం. 

బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి
తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.


మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!


బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఐదువేల పింఛ‌న్‌తో అయ్య‌వారికి శ‌ఠ‌గోపం.. జ‌గ‌న‌న్న మార్కు రాజ‌కీయం..!

వాళ్లకు కేసీఆర్ కంటే వ్యాపారాలే ముఖ్యమా...?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌.. నాడు-నేడు.. నిర్వీర్యం దిశ‌గా అడుగులు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?

సౌందర్య చెప్పిన మాట విని చలించిపోయా: ఎస్ వి కృష్ణా రెడ్డి

వైసీపీకి మ‌రో షాక్‌.... జ‌గ‌న్‌కు దెబ్బ మీద దెబ్బ‌...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>