PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/narendra-chanchalcc962d06-e2b9-4c97-813e-c1e84d7ed8d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/narendra-chanchalcc962d06-e2b9-4c97-813e-c1e84d7ed8d5-415x250-IndiaHerald.jpgప్రముఖ భజన గాయకుడు నరేంద్ర చంచల్ ఇకలేరు. అనారోగ్య సమస్యలతో శుక్రవారం కన్నుమూశారు. ఈరోజు అయన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నరేంద్ర చంచల్ దాదాపు మూడు నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. డాక్టర్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. ఇప్పుడు అయన చికిత్స పొందుతూ మరణించారు. narendra chanchal;amritsar;india;narendra modi;cinema;media;prime minister;social media;twitter;king;king 1;central government;punjabi;bobby;narendraభజన్ కింగ్ ఆఫ్ ఇండియా "నరేంద్ర చంచల్" ‌ ఇకలేరుభజన్ కింగ్ ఆఫ్ ఇండియా "నరేంద్ర చంచల్" ‌ ఇకలేరుnarendra chanchal;amritsar;india;narendra modi;cinema;media;prime minister;social media;twitter;king;king 1;central government;punjabi;bobby;narendraFri, 22 Jan 2021 21:03:00 GMT" style="height: 281px;">

ప్రముఖ భజన గాయకుడు నరేంద్ర చంచల్  ఇకలేరు. అనారోగ్య సమస్యలతో శుక్రవారం  అయన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నరేంద్ర చంచల్ దాదాపు మూడు నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. డాక్టర్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. ఇప్పుడు అయన చికిత్స పొందుతూ మరణించారు. నరేంద్ర చంచల్‌ను భజన్ కింగ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. కేవలం భజన పాటలే.. కాదు సినిమా పాటలను కూడా నరేంద్ర చంచల్ ఆలపించారు. నరేంద్ర చంచల్ భజన పాటలకు ఉత్తరాదిన ఎంతో క్రేజ్ ఉంది....

నరేంద్ర చంచల్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను ఎంతగానో బాధించిందని ప్రధాని ట్వీట్ చేశారు. తనదైన గాత్రంతో పాటల ప్రపంచంలో ఎంతో పేరు తెచ్చుకున్నారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు... అయన  మృతిపై ప్రముఖ పంజాబీ సింగర్ దలేర్ మెహిందీ కూడా దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఇక దిగ్గజ గాయకురాలు లతా మంగేష్కర్‌ సైతం సోషల్‌ మీడియా వేదికగా నరేంద్ర చంచల్‌కు నివాళులు అర్పించారు. అదే విధంగా టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ నరేంద్ర చంచల్‌ మృతి పట్ల విచారం వ్యక్తం చేశాడు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు, కేంద్ర సాంస్కృతిక శాఖ ఆయనను స్మరించుకుంటూ ట్విటర్‌ వేదికగా సంతాపం ప్రకటించింది.

కాగా, నరేంద్ర చంచల్ స్వస్థల పంజాబ్‌లోని అమృత్‌సర్.  వారిది ఆధ్యాత్మిక కుటుంబం కావడం వల్ల చిన్నప్పటి నుంచే నరేంద్ర చంచల్ భజన పాటలు పాడే వారు. 1973లో వచ్చిన బాబీ మూవీలో 'బేషక్ మందిర్ మసీద్' పాటను నరేంద్ర చంచల్ పాడగా . ఆ పాటకు ఉత్తమ ప్లేబ్యాక్ విభాగంలో ఫిలింఫేర్ అవార్డు రావడం విశేషం ..







గ్రేటర్ కొత్త మేయర్ ఎవరో!

తన భార్య నమ్రత ను మహేష్ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా..??

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్... రీ సౌండే మరి...?

నిమ్మగడ్డ హీరో... ముప్పయ్యేళ్ళ తరువాత మళ్ళీ..?

మెగాస్టార్ ని కలిసిన బిగ్ బాస్ సోహెల్ ..... నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు .....!!

తదుపరి సినిమా కోసం అనుష్క పడుతున్న క‌ష్టాలు చూడండి..!

ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమాలోని ఆ రెండు పాటలను కేవలం రెండు రోజుల్లోనే తీసారట..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>