Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gani-and-liger-same-zenre-movies7f25425b-8834-41d5-b630-ac4564a46902-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gani-and-liger-same-zenre-movies7f25425b-8834-41d5-b630-ac4564a46902-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఒక జోనర్ లో ఉండే సినిమాలు తెరపైకి వస్తూ ఉంటాయి. కాని ఆ సినిమాలు ఒకే సారి సెట్స్ పైకి రావడం మాత్రం చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్, రౌడీ హీరో విజయ దేవరకొండకు ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడింది. ఈ ఇద్దరి హీరోలవి తొందరలో ప్రేక్షకుల ముందుకు రాబోయే సినిమాలు ఒకే కథాంశంతో తెరకెక్కుతున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలోనే వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ సినిమాలు రాబోతున్నాయన్న సంగతి తెలిసిందే. కాగా బాక్సింగ్ నేపథ్యంలోనే రెండు సినిమాలు ఒకే సారి తెరముందుకు రావడvijay devarakonda;kiran;varun;varun sandesh;varun tej;vijay;vijay deverakonda;india;cinema;kanna lakshminarayana;genre;interview;director;hero;joseph vijay;posters;fighter;devarakondaగని, లైగర్ జోనర్ ఒకటే అయినప్పటికీ.. మరి కథలు ఏవిధంగా ఉన్నాయంటే?గని, లైగర్ జోనర్ ఒకటే అయినప్పటికీ.. మరి కథలు ఏవిధంగా ఉన్నాయంటే?vijay devarakonda;kiran;varun;varun sandesh;varun tej;vijay;vijay deverakonda;india;cinema;kanna lakshminarayana;genre;interview;director;hero;joseph vijay;posters;fighter;devarakondaFri, 22 Jan 2021 11:00:00 GMTజోనర్ లో ఉండే సినిమాలు తెరపైకి వస్తూ ఉంటాయి. కాని ఆ సినిమాలు ఒకే సారి సెట్స్ పైకి రావడం మాత్రం చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్, రౌడీ హీరో విజయ దేవరకొండకు ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడింది. ఈ ఇద్దరి హీరోలవి తొందరలో ప్రేక్షకుల ముందుకు రాబోయే సినిమాలు ఒకే కథాంశంతో తెరకెక్కుతున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలోనే వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ సినిమాలు రాబోతున్నాయన్న సంగతి తెలిసిందే. కాగా బాక్సింగ్ నేపథ్యంలోనే రెండు సినిమాలు ఒకే సారి తెరముందుకు రావడం ఆసక్తి కలిగిస్తోంది. అయితే మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా, కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న గని సినిమాను లాక్ డౌన్ కన్నా ముందే సెట్స్ పైకి తీసుకెళ్లాడు.
కాగా ఈ సినిమాకు అప్పట్లో బాక్సర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారనే పుకార్లు కూడా వచ్చాయి. కానీ తాజాగా వరున్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు‘గని’ అనే టైటిల్ ను, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు మేకర్స్. ఇకపోతే పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూడా లాక్ డౌన్ కంటే మునుపే స్టార్ట అయ్యింది.  ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు రూమర్స్ కూడా వచ్చాయి. కానీ ఆ టైటిల్ కాదని ఫైనల్ గా‘లైగర్’ అని ఫిక్స్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రూ.120 కోట్లకు పైగానే బడ్జెట్ కేటాయిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ రెండు సినిమాలు బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్నప్పటికీ కథ మాత్రం డిఫరెంట్ గానే ఉండబోతోందని తెలుస్తోంది.  

అయితే వరుణ్ తేజ్ ‘గని’ సినిమాలో క్రీడాకారులపై చూపుతున్న నిర్యక్ష్యాన్ని ఎత్తి చూపే విధంగా ఉండబోతుందని తెలుస్తోంది. క్రీడా సామర్థ్యాలతో ఒలంపిక్ పథకాలు సాధించినా.. వారు తగిన గుర్తింపును సమాజంలో పొందలేకపోతున్నారు. వారిపట్ల ఉండే నిర్యక్ష్యాన్ని ఎత్తి చూపడాన్ని ప్రధానంగా అంశంగా  సినిమా చూపిస్తుందని ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు తెలిపారు. ఇకపోతే డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న‘లైగర్’ సినిమా రివేంజ్ డ్రామా గా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయట. అయితే ఈ రెండు సినిమాలు బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్నప్పటీకి కథ వేరేగా ఉందని అర్థమైంది. కాకపోతే ఈ రెండు సినిమా స్టోరీ పూర్తిగా తెలియాలంటే మాత్రం.. ఆ సినిమాలు రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చెయ్యకతప్పదు మరి. 


అమ్మాయిలూ.. ఈ ఆహారాన్ని మాత్రం కచ్చితంగా తీసుకోండి

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

కాపు వేద‌న‌: రెంటికీ చెడుతున్న ‌కాపులు.. ఏం జ‌రుగుతోంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>