LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/thotakura-vadalue2ea7dad-f1f3-4400-950d-7acc6665c178-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/thotakura-vadalue2ea7dad-f1f3-4400-950d-7acc6665c178-415x250-IndiaHerald.jpgతోటకూర.. ఈ ఆకు కూరలు తెలియని వాళ్ళు ఉండరేమో.. ఎన్నో పోషకాలు దాగివున్నాయి. ఎన్నో రోగాలను నయం చేస్తాయి. అందుకే డాక్టర్లు కూడా తోట కూరను ఎక్కువగా తీసుకోమని చెప్తుంటారు. అయితే తోట కూరతో కొంత మంది పప్పు లేదా కూరను చేసుకుంటారు. కానీ కొంత మంది ఆకు కూరలతో వెరైటీ గా చేసుకోవాలని భావిస్తారు. అలాంటి వాళ్ళు తోట కూర తో వడలను చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఎలాంటి పదార్థాలను ఉపయోగిస్తారు.. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం... thotakura vadalu;mirchi;oil;cumin;thota chandrasekhar;coriander.;ishtamతోట కూరతో వడలు ఎప్పుడైన ట్రై చేశారా..తోట కూరతో వడలు ఎప్పుడైన ట్రై చేశారా..thotakura vadalu;mirchi;oil;cumin;thota chandrasekhar;coriander.;ishtamFri, 22 Jan 2021 19:00:00 GMTతోట కూరను ఎక్కువగా తీసుకోమని చెప్తుంటారు. అయితే తోట కూరతో కొంత మంది పప్పు లేదా కూరను చేసుకుంటారు. కానీ కొంత మంది ఆకు కూరలతో వెరైటీ గా చేసుకోవాలని భావిస్తారు. అలాంటి వాళ్ళు తోట కూర తో వడలను చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఎలాంటి పదార్థాలను ఉపయోగిస్తారు.. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం... 


కావలసిన పదార్థాలు.. 

మినుప పప్పు : అర కిలో, 

తోటకూర: రెండు కట్టలు, 

కొత్తిమీర: ఒక కట్ట, 

ఉల్లి పాయలు: రెండు, 

జీలకర్ర: ఒక స్పూన్‌, 

పచ్చి మిర్చి: రెండు,

 ఉప్పు: తగినంత, 
 .
 నూనె: వేయించడానికి సరిపడా.

తయారీ విధానం: 


మినుప పప్పును ముందు రోజు రాత్రి నాన బెట్టుకోవాలి. తోటకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. మినుప పప్పును నీళ్ళు లేకుండా గట్టిగా, మెత్తగా గారెలు పిండిలాగా రుబ్బుకుని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఆ మిశ్రమం లో తరిగి పెట్టుకున్న కొత్తి మీర, పచ్చి మిర్చి, ఉల్లిపాయలను వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోట కూరను కూడా వేసుకొని అంతా కలిసేలా బాగా కలుకోవాలి. అందులో ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని వడల్లా వత్తుకుని నూనె లో వేయించుకుంటే సరి. రుచికరమైన తోటకూర వడలు రెడీ.. టమోటా చట్నీతో లేదా పల్లీల చట్నీతో కలిపి తీసుకుంటే ఇంకాస్త రుచిగా ఉంటాయి. తోట కూరను నేరుగా తీసుకోవడానికి ఇష్టపడని వాళ్ళు ఇలా చేసుకోవడం చాలా మంచిది. అసలు తోటకూర తో చేసినట్లు తెలియదు. అందుకే చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు.  తోట కూర తో ఈ వడలు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి..



భజన్ కింగ్ ఆఫ్ ఇండియా "నరేంద్ర చంచల్" ‌ ఇకలేరు

గ్రేటర్ కొత్త మేయర్ ఎవరో!

తన భార్య నమ్రత ను మహేష్ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా..??

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్... రీ సౌండే మరి...?

నిమ్మగడ్డ హీరో... ముప్పయ్యేళ్ళ తరువాత మళ్ళీ..?

మెగాస్టార్ ని కలిసిన బిగ్ బాస్ సోహెల్ ..... నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు .....!!

తదుపరి సినిమా కోసం అనుష్క పడుతున్న క‌ష్టాలు చూడండి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>