PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycpf6d153ab-214a-43ee-bdae-4af381283a81-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycpf6d153ab-214a-43ee-bdae-4af381283a81-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో అస్థిత్వం ఉండాలంటే పార్టీ గట్టిగా ఉండాలి. ఎన్నికల వేళ మాత్రమే పార్టీని పట్టించుకుంటామంటే కుదిరేది కాదు, ఒకసారి అధికారంలోకి వచ్చాక నాయకులు అంతా ఇదే చేస్తున్నారు. ఆ తరువాత ఫలితాలను కూడా అనుభవిస్తున్నారు.కళ్ళ ముందే టీడీపీ అధినేత చంద్రబాబు కనిపిస్తున్నారు. ఆయన కూడా పార్టీని అలా వదిలేయడం వల్లనే ఎన్నికల సమయానికి ఎవరూ పట్టించుకోలేదు. దాంతో పార్టీ చాలా ఘోరంగా ఓడాల్సివచ్చింది. ycp;jagan;chief minister;tdp;local language;ycp;v;party;mantraజగనోరూ.. వారిని అలా వదిలేశారు...?జగనోరూ.. వారిని అలా వదిలేశారు...?ycp;jagan;chief minister;tdp;local language;ycp;v;party;mantraFri, 22 Jan 2021 10:00:00 GMTపార్టీ గట్టిగా ఉండాలి. ఎన్నికల వేళ మాత్రమే పార్టీని పట్టించుకుంటామంటే కుదిరేది కాదు, ఒకసారి అధికారంలోకి వచ్చాక నాయకులు అంతా ఇదే చేస్తున్నారు. ఆ తరువాత ఫలితాలను కూడా అనుభవిస్తున్నారు.

కళ్ళ ముందే టీడీపీ అధినేత  చంద్రబాబు కనిపిస్తున్నారు. ఆయన కూడా పార్టీని అలా వదిలేయడం వల్లనే ఎన్నికల సమయానికి ఎవరూ పట్టించుకోలేదు. దాంతో పార్టీ చాలా  ఘోరంగా ఓడాల్సివచ్చింది. ఇపుడు వైసీపీలోనూ అదే రకమైన పరిస్థితి కనిపిస్తోంది. జగన్ ముఖ్యమంత్రి కావాలని వాంతా ఎంతగానే కృషి చేశారు. ఒకటి రెండేళ్ళు కాదు. ఏళ్లకు ఏళ్ళు పనిచేశారు.


అటువంటి క్యాడర్ ఇపుడు తీవ్రమైన నిరాశలో ఉన్నారు. ఏకంగా జగన్ కుడి భుజమైన విజయసాయిరెడ్డి ఎదురుగానే కార్యకర్తలు ఏ మాత్రన్ సంతృప్తిగా లేరు అంటూ డిప్యూటీ సీఎం ధర్మాన క్రిష్ణ దాస్ ధర్మమైన మాట చెప్పారు. వారిని పట్టించుకోవాలని కూడా కోరారు. కానీ ఇప్పటికీ అతీ గతీ లేదు.

మరి చూడబోతే లోకల్ బాడీ ఎన్నికలు దూసుకువస్తున్నాయి. అక్కడ జగనా మరొకరా అని జనాలు చూడరు, ఇవి పూర్తిగా కార్యకర్తల కష్టం మీదనే గెలవాల్సిన ఎన్నికలు, మరి పల్లెల్లో జరిగే పంచాయతీలలో కనుక వైసీపీ కార్యకర్తలు చేతులు ఎత్తేస్తే 151 సీట్లతో గెలిచిన జగన్ సర్కార్ పరువు పోవడం ఖాయం. మరి ఇప్పటికైనా జగన్ వారి గోడు వింటారా. పట్టించుకుంటారా అన్నదే క్యాడర్ ఆవేదనగా ఉందిట. నిజానికి రాష్ట్రంలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండేళ్ళకు దగ్గర పడుతోంది. కానీ క్యాడర్ కి ఒక్క పదవి కూడా దక్కలేదు. పైగా వారికి ఏ మర్యాదా కూడా లేకుండా పోయిందన్నది అతి పెద్ద ఫిర్యాదుగా ఉంది. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పట్టించుకోవడం లేదని అంటున్నారు.  ఇక పార్టీ కార్యకలాపాలు కూడా లేకపోవడం వల్ల కూడా క్యాడర్ దూరంగా ఉంటోంది అంటున్నారు.






కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

కాపు వేద‌న‌: రెంటికీ చెడుతున్న ‌కాపులు.. ఏం జ‌రుగుతోంది..?

రాధే శ్యామ్ పరమహంస సీక్రెట్ బయటపెట్టిన కృష్ణంరాజు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>