MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bollywood-hero-next-to-akkineni-kodalub8db9402-2a24-43cb-8b44-fc5419adaa01-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bollywood-hero-next-to-akkineni-kodalub8db9402-2a24-43cb-8b44-fc5419adaa01-415x250-IndiaHerald.jpgపాన్‌ ఇండియన్ సినిమా అనగానే మన మేకర్స్‌ అంతా ముంబయి ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. బాలీవుడ్‌ నుంచి హీరోయిన్లు, సపోర్టింగ్ ఆర్టిస్టులని పట్టుకొస్తున్నారు. మరిప్పుడు గుణశేఖర్- సమంతల 'శాకుంతలం' కూడా పాన్‌ ఇండియన్‌ మూవీగానే వస్తోంది. మరి గుణశేఖర్ ఈ సినిమాకి హీరోగా బాలీవుడ్‌ స్టార్‌ని తీసుకుంటున్నాడా? సౌత్‌ స్టార్‌తోనే పూర్తి చేస్తున్నాడా అనే సందేహాలు సినీ అభిమానుల్లో నెలకొన్నాయి.తెలుగులో పాన్‌ ఇండియన్‌ మూవీ అనగానే రాజమౌళి నుంచి నాగ్ అశ్విన్ వరకు అంతా ముంబయి హీరోయిన్స్‌నే తీసుకుంటున్నారు. నార్త్‌ మార్కbollywood hero next to akkineni kodalu;alia bhatt;gunasekhar;nag ashwin;nageshwara rao akkineni;rajamouli;samantha;mumbai;bollywood;rrr movie;cinema;telugu;naga aswin;husband;hero;indian;rudramadeviఅక్కినేని కోడలు పక్కన బాలీవుడ్ హీరో..!అక్కినేని కోడలు పక్కన బాలీవుడ్ హీరో..!bollywood hero next to akkineni kodalu;alia bhatt;gunasekhar;nag ashwin;nageshwara rao akkineni;rajamouli;samantha;mumbai;bollywood;rrr movie;cinema;telugu;naga aswin;husband;hero;indian;rudramadeviFri, 22 Jan 2021 16:00:00 GMTఇండియన్ సినిమా అనగానే మన మేకర్స్‌ అంతా ముంబయి ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. బాలీవుడ్‌ నుంచి హీరోయిన్లు, సపోర్టింగ్ ఆర్టిస్టులని పట్టుకొస్తున్నారు. మరిప్పుడు గుణశేఖర్- సమంతల 'శాకుంతలం'  కూడా పాన్‌ ఇండియన్‌ మూవీగానే వస్తోంది. మరి గుణశేఖర్ ఈ సినిమాకి హీరోగా బాలీవుడ్‌ స్టార్‌ని తీసుకుంటున్నాడా? సౌత్‌ స్టార్‌తోనే పూర్తి చేస్తున్నాడా అనే సందేహాలు సినీ అభిమానుల్లో నెలకొన్నాయి.  

తెలుగులో పాన్‌ ఇండియన్‌ మూవీ అనగానే రాజమౌళి నుంచి నాగ్ అశ్విన్ వరకు అంతా ముంబయి హీరోయిన్స్‌నే తీసుకుంటున్నారు. నార్త్‌ మార్కెట్‌కి ప్లస్ అవుతారని బాలీవుడ్‌ స్టార్స్‌తో నింపేస్తున్నారు. ఈ లెక్కలతోనే 'ఆర్ ఆర్ ఆర్'కి ఆలియా భట్‌ని తీసుకొచ్చాడు రాజమౌళి. ఇక ప్రభాస్‌ సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామాకి దీపికా పదుకొణేని ఒప్పించాడు నాగ్ అశ్విన్.

గుణశేఖర్ 'రుద్రమదేవి' తర్వాత చాలా గ్యాప్‌ తీసుకొని 'శాకుంతలం' సినిమా చేస్తున్నాడు. మహాకవి కాళిదాస్ రచించిన 'అభిజ్ఞాన శాకుంతలం' ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు గుణశేఖర్. సమంత శకుంతల క్యారెక్టర్‌ ప్లే చేస్తోంది. మరి శకుంతల భర్త దుష్యంతుడి పాత్ర ఎవరు పోషిస్తారు.. పాన్‌ ఇండియన్‌ మార్కెట్‌కి సెట్‌  అయ్యేలా బాలీవుడ్ హీరోని తీసుకొస్తారా.. లేకపోతే తెలుగు హీరోనే తీసుకుంటారా.. అనేది ఆసక్తికరంగా మారుతోంది.

'శాకుంతలం' సినిమా కొంచెం హీరోయిన్‌ సెంట్రిక్‌గానే నడుస్తుంది. సమంత క్యారెక్టర్‌ హీరోని డామినేట్ చేసే ఛాన్స్‌ ఉంది. మరి స్క్రీన్‌ స్పేస్, బిల్డప్‌లో హీరోయిన్‌ కంటే కొంచెం తక్కువగా ఉండే హీరో పాత్ర పోషించడానికి బాలీవుడ్ స్టార్లు ఒప్పుకుంటారా.. ఒకవేళ తెలుగుహీరోలనే తీసుకోవాలనుకుంటే టాప్‌ హీరోలు ఓకే చెబుతారా అనేది చూడాలి.

మొత్తానికి పాన్ ఇండియన్ ఫిల్మ్ గా శాకుంతలము తెరకెక్కుతోంది. అక్కినేని కోడలు సమంత శకుంతల క్యారెక్టర్ ప్లే చేస్తుండటంతో సినీ ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. గుణశేఖర్ దర్శకత్వంలో వస్తోన్న శాకుంతలములో.. దుష్యంతుడి పాత్రకి బాలీవుడ్ హీరోను తీసుకుంటారా అనే సందేహాలు నెలకొంటున్నాయి.








చిక్కుల్లో తెలుగు లీడింగ్ న్యూస్ ఛానల్స్ !

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?

అయ్య బాబోయ్ ‘పుష్ప’ కు ఇంత బడ్జెట్ కేటాయించారా?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఐదువేల పింఛ‌న్‌తో అయ్య‌వారికి శ‌ఠ‌గోపం.. జ‌గ‌న‌న్న మార్కు రాజ‌కీయం..!

వాళ్లకు కేసీఆర్ కంటే వ్యాపారాలే ముఖ్యమా...?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌.. నాడు-నేడు.. నిర్వీర్యం దిశ‌గా అడుగులు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>