PoliticsParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/modi-the-best-india-today-survey-mood-of-the-nation-9d8dd252-f3c0-40c4-bb82-d73df23653d9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/modi-the-best-india-today-survey-mood-of-the-nation-9d8dd252-f3c0-40c4-bb82-d73df23653d9-415x250-IndiaHerald.jpgప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎంతో మెరుగ్గా ఉందని తెలిపారు. “కోవిడ్ -19 పెండమిక్ నియంత్రణ నిర్వహణ” లో నరెంద్ర మోదికి లభించిన ప్రజాభిప్రాయ ప్రజాదరణ రేటింగ్ 74 అని తేలింది. (ఔట్-స్టాండింగ్ 30% కాగా గుడ్ 44% నిర్ణయిస్తే నమో కి 74 రేటింగ్ లభించటం “ది గ్రేటెస్ట్” గా చెప్పవచ్చు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే మరోసారి బిజేపి అతిసునాయాసంగా అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే చెపుతుంది. mood of the nation 2021;modi;india;narendra modi;january;media;prime minister;interview;survey;population;war;central government;narendraకరోనా నియంత్రణలో - టీకా పంపిణీలో - భారత్ ప్రపంచంలోనే భేష్ - నమో ది గ్రేటెస్ట్ - ఇండియా టుడే సర్వే - మూడ్ ఆఫ్ ది నేషన్ 2021కరోనా నియంత్రణలో - టీకా పంపిణీలో - భారత్ ప్రపంచంలోనే భేష్ - నమో ది గ్రేటెస్ట్ - ఇండియా టుడే సర్వే - మూడ్ ఆఫ్ ది నేషన్ 2021mood of the nation 2021;modi;india;narendra modi;january;media;prime minister;interview;survey;population;war;central government;narendraFri, 22 Jan 2021 12:00:00 GMT కోవిడ్ -19 పెండమిక్ నియంత్రణ లో భారత్ అద్భుతమైన పరిణితిని ప్రదర్శించింది. జాతి జనం సర్వం భారత ప్రధాని నరెంద్ర మోడీ వెనక నిలిచి ఆ బాటలో క్రమశిక్షణతో ముందుకు సాగారు.

కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రపంచ వ్యాప్తంగా జరిగినా భారత్ లో జరిగిన టీకా పంపిణీ యే గొప్ప విజయవంతమైంది. ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు “టీకా” ప్రణాళిక ప్రకారం అందించే కార్యక్రమం కొనసాగు తుంది. పకడ్బందీ ప్రణాళికతో తొలి దశలో 30 కోట్ల భారతీయులను ఈ "వాక్సినేషన్ డ్రైవ్-ఫేజ్ 1" లో కవర్ చేసే ప్రయత్నాలు జరగగా ఈ కార్యక్రమ అనుకున్న ప్రకారం విజయ వంతంగా కొనసాగుతుంది. ప్రపంచం లోనే అతి పెద్ద కార్యక్రమమైన దీనిని కేంద్రం  విజయవంతంగా నడిపిస్తోందని భావించవచ్చు.

ఈ క్రమంలోనే జాతీయ మీడియా "ఇండియా టుడే - మూడ్ ఆఫ్ ది నేషన్ 2021" పేరుతో 19 రాష్ట్రాల్లో 97 పార్లమెంటరి, 194 శాసనసభ నియోజకవర్గాలను కవర్ చేస్తూ 12232 ఇంటర్వ్యూలతో 10 రోజుల పాటు జనవరి 3 నుంచి 13 వరకు జరిపిన సర్వేలో కరోనాకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడయ్యాయి.

భారత ప్రధాని నరెంద్ర మోడీ నాయకత్వం ఇంత భయంకరమైన మహమ్మారిని నిలువరించటంలో అద్భుత పనితనం చూపించారని తేటతెల్లమైంది. కరోనా మహమ్మారి కట్టడి విషయంలో 130 కోట్ల జనాభా కలిగిన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ సమర్ధవంతంగా ఎదుర్కొంది. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజేపి ప్రభుత్వం కరోనా పై యుద్ధంలో విజయం సాధించిందని అధిక సంఖ్యలో ప్రజలు, కుల, మత, ప్రాంత, లింగ విభేదాలను అధిగమించి తమ అభిప్రాయాలు చెప్పారు.

ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎంతో మెరుగ్గా ఉందని తెలిపారు. “కోవిడ్ -19 పెండమిక్ నియంత్రణ నిర్వహణ” లో నరెంద్ర మోదికి లభించిన ప్రజాభిప్రాయ ప్రజాదరణ రేటింగ్ 74 అని తేలింది. (ఔట్-స్టాండింగ్ 30% కాగా గుడ్ 44% నిర్ణయిస్తే నమో కి 74 రేటింగ్ లభించటం “ది గ్రేటెస్ట్” గా చెప్పవచ్చు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే మరోసారి బిజేపి అతిసునాయాసంగా అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే చెపుతుంది.  

దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు 76 శాతం మంది ప్రజలు మొగ్గు చూపుతున్నారు. 21 శాతం మంది మాత్రమే వేచిచూసే ధోరణిని అనుసరిస్తున్నారు. 3 శాతం మంది ప్రజలు ఎటూ తేల్చుకోలేక వెనుకాడుతున్నారు.

మరో వైపు 92 శాతం మంది ప్రజలు కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందించాలని కోరుతున్నారు. 7 శాతం మంది ఉచితంగా వద్దంటున్నారు. 1 శాతం ఎటూ తేల్చుకోవడం లేదు.

కరోనా మహమ్మారి కట్టడికి ప్రధాని నరెంద్ర మోడీ విధించిన లాక్-డౌన్ తో నియంత్రణలోకి వచ్చిందని 39 శాతం మంది చెప్పగా, 28 శాతం మది ఇతర సమస్యలు వచ్చాయన్నారు. 13 శాతం మంది విఫలమైందని అన్నారు. 10 శాతం మంది ఆర్థిక నష్టం జరిగిందని అన్నారు. 7 శాతం మంది ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసిందన్నారు.

దేశంలో కరోనా చికిత్స విషయంలో 76 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. 22 శాతం మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక కరోనా బారిన పడలేదని 92 శాతం ప్రజలు సమాధానమిచ్చారు. మొత్తంగా నరెంద్ర మోడీ ప్రభుత్వ చర్యలు కోవిడ్ -19 పెండమిక్ నియంత్రణ, వ్యాక్సినేషన్-డ్రైవ్ పై దేశ ప్రజలు సంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.


మళ్లీ సంచనల ప్రకటన చేసిన మస్క్.. ఈ సారి కోట్లు కుమ్మరించడానికీ రెడీ..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!

జ‌గ‌న్‌కు ఈ కులాల‌న్ని దూరం దూరం... దెబ్బ‌డిపోతోందిగా..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>