Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/former-indian-player-vrienden-sebelah-comments-on-pacer-natarajan5c026af0-0386-4e18-a5eb-050db3b647d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/former-indian-player-vrienden-sebelah-comments-on-pacer-natarajan5c026af0-0386-4e18-a5eb-050db3b647d5-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి కారణంగా దేశమంతా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టీం ఇండియా వెళ్లిన మొట్టమొదటి టూర్ ఆస్ట్రేలియా. అక్కడ జరిగిన టూర్ లో అద్భుత విజయం సాధించి తిరిగొచ్చిన టీమ్ఇండియా పేసర్‌ నటరాజన్‌కు సొంత ఊర్లో ఘన స్వాగతం అందించారు. గురువారం ఉదయం..nararanasan.;rani;india;australia;district;village;history;tamilnadu;local languageనటరాజన్ పై సెహ్వాగ్ సంచలన కామెంట్స్నటరాజన్ పై సెహ్వాగ్ సంచలన కామెంట్స్nararanasan.;rani;india;australia;district;village;history;tamilnadu;local languageFri, 22 Jan 2021 23:31:24 GMTఇండియా వెళ్లిన మొట్టమొదటి టూర్ ఆస్ట్రేలియా. అక్కడ జరిగిన టూర్ లో అద్భుత విజయం సాధించి తిరిగొచ్చిన టీమ్ఇండియా పేసర్‌ నటరాజన్‌కు సొంత ఊర్లో ఘన స్వాగతం అందించారు. గురువారం ఉదయం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నాడు. తర్వాత రోడ్డు మార్గంలో తన స్వగ్రామం తమిళనాడులోని సాలెం జిల్లా చిన్నప్పంపట్టికి వెళ్లాడు. ఈ సందర్భంగా స్థానికులు అతడికి నీరాజనాలు పట్టి పూలమాలలు, డప్పువాయిధ్యాలతో స్వాగతం పలికారు. అతడిని రథంపై ఊరేగిస్తూ సందడి చేశారు. నటరాజన్‌ అక్కడి వారికి అభివాదం చేస్తూ ఇంటికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.     

ఈ క్రమంలోనే నటరాజన్‌కు లభించిన ఆదరణపై టీమ్ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ స్పందించాడు. సామాజిక మాధ్యమాల ద్వారా తన మాటలను వ్యక్తం చేశాడు. నటరాజన్‌ ఊరేగింపు వీడియోను పోస్టు చేసి సంతోషాన్ని ప్రకటించాడు. ‘ఇండియా అంటే ఇది. ఇక్కడ క్రికెట్‌ అంటే ఆట మాత్రమే కాదు. అంతకన్నా ఎక్కువ. నటరాజన్‌ కు  చిన్నప్పంపట్టి గ్రామంలో ఘన స్వాగతం లభించింది’ అని కొనియాడాడు.       

ఇదిలా ఉంటే, నటరాజన్‌ తొలుత ఐపీఎల్‌ కోసం ఆగస్టులో యూఏఈకి వెళ్లాడు. అక్కడ హైదరాబాద్‌ తరఫున అద్భుతంగా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పర్యటనకు నెట్‌ బౌలర్‌గా ఎంపికై అక్కడికి చేరుకున్నాడు. అయితే అనూహ్యంగా మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. భారత్‌ తరఫున ఇలా ఒకేసారి అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు. అలాగే అంచనాలకు మించి రాణించి విశేష ఆదరణ సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే స్వగ్రామంలో అతడికి ఘన స్వాగతం లభించింది.   


వార్నీ .... ఇంకా షూటింగ్ మొదలే కాలేదు ... అప్పుడే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసారా .....?

బొమ్మ సూపర్ హిట్టే.. పవన్ కరెక్ట్ డెసిషన్...?

బాయ్స్ సినిమాలో జెనీలియా క్యారెక్టర్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హారోయిన్ ఎవరో తెలుసా?

గ్రేటర్ కొత్త మేయర్ ఎవరో!

తన భార్య నమ్రత ను మహేష్ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా..??

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్... రీ సౌండే మరి...?

నిమ్మగడ్డ హీరో... ముప్పయ్యేళ్ళ తరువాత మళ్ళీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>