PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/the-female-power-behind-bidendd5eab99-cd3b-41e1-bd73-c0264980e4ad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/the-female-power-behind-bidendd5eab99-cd3b-41e1-bd73-c0264980e4ad-415x250-IndiaHerald.jpgప్రతి మగాడి విజయానికి..ఓ మహిళ ఉంటుంది అంటారు.. అవును ఈ మాట అక్షరాల నిజం... బైడెన్‌ జీవితంలో కూడా ఆయన భార్య జిల్‌ బైడన్‌ వెన్నంటే ఉన్నారు. బైడెన్‌ విజయంలో ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌ ఎంతో కీలకంగా వ్యవహరించారు. న్యూజెర్సీలో 1951 సంవత్సరంలో జన్మించిన జిల్‌ బైడెన్‌ పెన్సిల్వేనియాలో పెరిగారు. 1977 జూన్‌ 17న జో బైడెన్‌ను వివాహం చేసుకున్నారు. స్వయంకృషితో ఎదిగిన కుటుంబం ఆమెది. కొన్నాళ్లు మోడలింగ్ చేసినా, తర్వాతి కాలంలో ఉన్నత విద్యపై దృష్టిపెట్టి, డాక్టరేట్ ను పూర్తి చేశారు. బోధనను వృత్తిగా ఎంచుకున్న జిల్..the female power behind biden;women;jeevitha rajaseskhar;nithya new;american samoa;barack obama;school;university;jil;husband;wife;woman;butter;virginia;party;shaktiబైడెన్ వెనుకున్న ఆ మహిళా శక్తి..!బైడెన్ వెనుకున్న ఆ మహిళా శక్తి..!the female power behind biden;women;jeevitha rajaseskhar;nithya new;american samoa;barack obama;school;university;jil;husband;wife;woman;butter;virginia;party;shaktiThu, 21 Jan 2021 15:00:00 GMT మహిళ ఉంటుంది అంటారు.. అవును ఈ మాట అక్షరాల నిజం... బైడెన్‌ జీవితంలో కూడా ఆయన భార్య జిల్‌ బైడన్‌ వెన్నంటే ఉన్నారు. బైడెన్‌ విజయంలో ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌ ఎంతో కీలకంగా వ్యవహరించారు. న్యూజెర్సీలో 1951 సంవత్సరంలో జన్మించిన జిల్‌ బైడెన్‌ పెన్సిల్వేనియాలో పెరిగారు. 1977 జూన్‌ 17న జో బైడెన్‌ను వివాహం చేసుకున్నారు. స్వయంకృషితో ఎదిగిన కుటుంబం ఆమెది. కొన్నాళ్లు మోడలింగ్ చేసినా, తర్వాతి కాలంలో ఉన్నత విద్యపై దృష్టిపెట్టి, డాక్టరేట్ ను పూర్తి చేశారు. బోధనను వృత్తిగా ఎంచుకున్న జిల్.. ఒబామా హయాంలో సెకండ్ లేడీ హోదాలో ఉంటూనే తన వృత్తిని కొనసాగించారు. అమెరికాలో విద్యా వ్యాప్తి, కమ్యూనిటీల బలోపేతానికి విశేషంగా కృషి చేశారు.

నిజానికి బైడెన్ జీవితంలోకి జిల్ రాక నాటకీయంగా జరిగింది.1972.. అమెరికా చరిత్రలోనే సెనేట్ కు ఎన్నికైన రెండో పిన్నవయస్కుడిగా 29 ఏళ్లకే జోబైడెన్ రికార్డు నెలకొల్పారు. డెమోక్రటిక్ పార్టీ గోల్డెన్ బాయ్' అనే ఇమేజ్ ఉండేదప్పుడు. రోడ్డు ప్రమాదంలో ఆయన భార్య నీలియా, నెలల వయసున్న కూతురు నవోమీ మృతి చెందారు. మొదటి భార్య చనిపోయిన ఏడేళ్ల తర్వాత జిల్ రాకతో బైడెన్ జీవితం మళ్లీ గాడినపడింది. 1979లో స్కూల్ టీచర్ గా పనిచేస్తోన్న జిల్ ను బైడెన్ వివాహం చేసుకున్నారు. వీరికి ఆస్లా అనే కూతురుంది. అంతకుముందు మొదటి భర్త బిల్‌ స్టీవెన్‌సన్‌తో 1974లో ఆమె విడిపోయారు. శిధిలమైన నా జీవితాన్ని మళ్లీ నిర్మించడంతోపాటు దాన్ని నందనవనంగా మార్చేసింది జిల్'' అని  పదే పదే చెబుతుంటారు బైడెన్.

ఇదివరకు రెండు సార్లు అమెరికా సెకండ్ లేడీగా ఉన్నత బాధ్యతలు చేపట్టిన జిల్‌ బైడెన్‌, తనకు ఇష్టమైన వృత్తిని కొనసాగించేందుకు మొగ్గుచూపారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బైడెన్‌ వెన్నంటే ఉండి అనునిత్యం ఆయనకు అండగా నిలబడ్డారు. ప్రచారంలో ఓసారి బైడెన్‌ పైకి నిరసనకారులు దూసుకొచ్చిన సమయంలోనూ జో బైడెన్‌కు రక్షణగా నిలబడి అందర్నీ ఆకర్షించారు.వృత్తిరీత్యా బోధనా రంగంలో ఉన్న జిల్‌ బైడెన్‌ 1970 నుంచి అదే వృత్తిలో కొనసాగుతున్నారు. 2007లో యూనివర్సిటీ ఆఫ్‌ డెలావర్‌ నుంచి జిల్‌ డాక్టరేట్‌ పొందారు. ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసిన జిల్‌ బైడెన్‌, ప్రస్తుతం నార్తర్న్‌ వర్జీనియా కమ్యూనిటీ కాలేజ్‌లో ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.  బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ దేశ సెకండ్ లేడీగా జిల్,‌ ఓ వైపు అధికారిక బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు కమ్యూనిటీ కాలేజీలో ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌గా సేవలందించారు.






కమ్మ కులాన్ని టార్గెట్ చేసిన సుజనా... వాళ్ళు వచ్చేస్తారా...?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఐదువేల పింఛ‌న్‌తో అయ్య‌వారికి శ‌ఠ‌గోపం.. జ‌గ‌న‌న్న మార్కు రాజ‌కీయం..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌.. నాడు-నేడు.. నిర్వీర్యం దిశ‌గా అడుగులు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>