PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/now-everyone-is-looking-at-sasikala-3ffde469-807f-4bb0-9a60-2e7b994f200b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/now-everyone-is-looking-at-sasikala-3ffde469-807f-4bb0-9a60-2e7b994f200b-415x250-IndiaHerald.jpgతమిళనాడు దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ బెంగళూరులోని సెంట్రల్‌ జైలులో తీవ్ర‌ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, వెన్నునొప్పితో బాధపడుతున్న ఆమెను జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. అలాగే రాత్రి నుంచి శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. ఆమెకు ర్యాపిడ్ యాంటిజెన్ వైద్య ప‌రీక్ష‌లు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొవిడ్‌ నెగెటివ్‌గా తేల‌డంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. జైలులోని ఆస్పత్రిలో చేరే సమయంలో ఆమె రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు తక్కువగా ఉండటంతో కరోనా సోకి ఉంటుందని వైద్యుsasikala;jayalalitha;raja;january;bengaluru 1;assembly;lawyer;beach;butter;marina beach;partyశ‌శి క‌ళ‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌.. జైలు నుంచి విడుద‌ల‌కు ముందు ఏంటీ పరిణామాలుశ‌శి క‌ళ‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌.. జైలు నుంచి విడుద‌ల‌కు ముందు ఏంటీ పరిణామాలుsasikala;jayalalitha;raja;january;bengaluru 1;assembly;lawyer;beach;butter;marina beach;partyThu, 21 Jan 2021 07:30:00 GMTజయలలిత స్నేహితురాలు శశికళ బెంగళూరులోని సెంట్రల్‌ జైలులో తీవ్ర‌ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, వెన్నునొప్పితో బాధపడుతున్న ఆమెను జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. అలాగే రాత్రి నుంచి శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. ఆమెకు ర్యాపిడ్ యాంటిజెన్ వైద్య ప‌రీక్ష‌లు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొవిడ్‌ నెగెటివ్‌గా తేల‌డంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.  జైలులోని ఆస్పత్రిలో చేరే సమయంలో ఆమె రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు తక్కువగా ఉండటంతో కరోనా సోకి ఉంటుందని వైద్యులు అనుమానం వ్యక్తంచేసినట్టు సమాచారం. దీంతో ఆమెను బెంగళూరులోని బోరింగ్ ఆస్పత్రికి తరలించారు. శశికళ ఆరోగ్య పరిస్థితి గురించి జైలు అధికారులు ఆమె లీగల్‌ టీంకు సమాచారం ఇచ్చారు.


ఇదిలా ఉండ‌గా అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ జైలు నుంచి ఈ నెల 27న విడుదల కానున్నట్ట్టు ఆమె తరఫు న్యాయవాది రాజా సెంథూరపాండియన్‌ మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే.  బెంగ‌ళూరు జైలు అధికారుల‌ను ఉటంకిస్తూ ఆమె త‌ర‌పు న్యాయ‌వాది రాజా సేథురాపాండియ‌న్ ఈ సంగ‌తి మంగ‌ళ‌వారం రాత్రి వెల్ల‌డించారు. 2016లో జ‌య‌ల‌లిత దుర్మ‌ర‌ణం త‌ర్వాత అన్నాడీఎంకే అధినేత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన శ‌శిక‌ళ‌.. నాలుగేండ్ల క్రితం అక్ర‌మాస్తుల కేసులో బెంగ‌ళూరులోని జైలు పాల‌య్యారు. అయితే నాలుగేండ్ల జైలుశిక్ష పూర్తి కావ‌డంతోపాటు రూ.10 కోట్ల జ‌రిమానను చెల్లిస్తే శ‌శిక‌ళ విడుద‌ల అవుతార‌ని పార్టీ వ‌ర్గాలు తెలియ‌జేశాయి. త్వ‌ర‌లో త‌మిళ‌నాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో శ‌శిక‌ళ జైలు నుంచి విడుద‌ల కానుండ‌టం ప్రాధాన్యం సంత‌రించుకున్న‌ది.



జనవరి 27న బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదల కావడం ఖాయమని భావిస్తున్న 'అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం' అభిమానులు, ఆమెకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న చెన్నైలోని పార్టీ కార్యాలయంలో సమావేశమైన ఆమె అనుచరులు, ఆమెకు స్వాగతం పలికేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న విషయమై చర్చించారు. ఆపై ఆమె నేరుగా మెరీనా బీచ్ కు వెళ్లి, జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించి శపథం చేస్తారని, ఆపైనే ఆమె తన ఇంటికి చేరుకుంటారని పార్టీ నేతలు అంటున్నారు. చిన్నమ్మకు స్వాగతం పలుకుతూ 65 చోట్ల ఆహ్వాన సభలను నిర్వహించాలని నిర్ణయించామని, ఈ ఏర్పాట్లపై దృష్టి పెట్టామని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.




ప్రశ్నలు వర్షంలా కురిసినా, సమాధానాలు చినుకుల్లా పడ్డాయి - ఇదీ కచరా ప్రభుత్వం తీరు

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ న్యూస్ తో మార్కెట్ ను ఓపెన్ చేసిన రాజమౌళి !

బ్రాహ్మ‌ణ ఘోష‌: పీఠాలు-మ‌ఠాల‌తో జ‌గ‌న్ పాలిటిక్స్‌.. బ్రాహ్మ‌ణులు ప‌ట్ట‌రా ?

చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ న్యూస్.. రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్..!!

సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోబోతున్న హీరో వరుణ్!!

జగన్ ను బిజెపిలో ఆ ఇద్దరు ఇబ్బంది పెడతారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>