HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/masroomsd6cc9fb0-b29a-4f4a-8ff6-6fa1c8f4e493-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/masroomsd6cc9fb0-b29a-4f4a-8ff6-6fa1c8f4e493-415x250-IndiaHerald.jpgఆరోగ్య పరిరక్షణలో పుట్టగొడుగులు ఎంతగానో సహాయపడతాయని అందరికీ తెలిసిందే. ఇవి వృద్ధాప్యాన్ని కూడా దూరం చేస్తాయి అన్న సంగతి మాత్రం మనలో చాలామందికి తెలియదు. నిత్యం యవ్వనంగా ఉండాలంటే పుట్టగొడుగులను తినాలి అని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా పుట్టగొడుగుల్లో అధికంగా ఉండే ఎర్గోథియోనిన్,గ్లూటాథియోనిన్ అనే యాంటి ఆక్సిడెంట్ల కారణంగా మనం నిత్యం యవ్వనంగా ఉండటానికి సహాయపడుతాయి. అయితే ఇతర ఉడికించిన కూరగాయలు మాదిరిగా పుట్టగొడుగులను ఉడికించినప్పటికీ వాటిలో వుంmasrooms;bhavana;nithya new;vitamin c;vitamin;mushroom;shaktiచలికాలంలో పుట్టగొడుగులను ఎక్కువగా తినాలి అంటారు.ఎందుకో తెలుసా?చలికాలంలో పుట్టగొడుగులను ఎక్కువగా తినాలి అంటారు.ఎందుకో తెలుసా?masrooms;bhavana;nithya new;vitamin c;vitamin;mushroom;shaktiThu, 21 Jan 2021 15:15:00 GMTఆరోగ్య పరిరక్షణలో పుట్టగొడుగులు ఎంతగానో సహాయపడతాయని అందరికీ తెలిసిందే. ఇవి వృద్ధాప్యాన్ని కూడా దూరం చేస్తాయి అన్న సంగతి మాత్రం మనలో చాలామందికి తెలియదు. నిత్యం యవ్వనంగా ఉండాలంటే పుట్టగొడుగులను తినాలి అని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా పుట్టగొడుగుల్లో అధికంగా ఉండే ఎర్గోథియోనిన్,గ్లూటాథియోనిన్ అనే యాంటి ఆక్సిడెంట్ల కారణంగా మనం నిత్యం యవ్వనంగా ఉండటానికి సహాయపడుతాయి. అయితే ఇతర ఉడికించిన కూరగాయలు మాదిరిగా పుట్టగొడుగులను  ఉడికించినప్పటికీ వాటిలో వుండే యాంటీ ఆక్సిడెంట్ల శాతం ఏ మాత్రం తగ్గదు.

పుట్టగొడుగులను రోజూవారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల,రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో ఫ్రీరాడికల్స్ ను ఎక్కువగా ఉత్పత్తి కాకుండా చేస్తాయి. అంతేకాకుండా ఇవి చలికాలంలో  శరీరానికి చాలా అవసరపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.  ఎందుకంటే చలికాలంలో ఎక్కువగా జబ్బుల బారినపడే అవకాశం ఉంది.పుట్టగొడుగులలో ఉండే ఎర్గోథియోనిన్,గ్లూటాథియోనిన్ అనే యాంటి ఆ క్సిడెంట్ల కారణంగా రోగనిరోధక శక్తి పెరిగి,త్వరగా జబ్బుల బారినపడకుండా ఉంటాము. పుట్టగొడుగుల్లో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని కూరగా,సలాడ్,సూప్ ఇలా ఎన్నో రకాలుగా తయారు చేసుకోవచ్చు.

అంతేకాకుండా పుట్టగొడుగుల్లో పొటాషియం, ప్రోటీన్, రాగి, సెలీనియం,భాస్వరం, యాంటి ఆక్సిడెంట్, ఫైటోకెమికల్స్,విటమిన్ సి,విటమిన్ ఇ, విటమిన్ డి వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఈ ధాతువులు శరీరాన్ని అనేక వ్యాధుల నుండి దూరంగా ఉండడానికి సహాయపడతాయి. పుట్టగొడుగులు తినడం వల్ల ఎముకలు బలపడతాయి. పుట్టగొడుగులలో  కేలరీలు తక్కువ స్థాయిలో ఉండడం వల్ల ఆకలి త్వరగా వేయదు. ఫలితంగా త్వరగా కడుపు నిండిపోయిన భావన కలిగి, ఇంకోసారి తినడానికి సాహసం చేయరు. ఫలితంగా బరువు తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

సాధారణంగా శరీరంలో విటమిన్ డి లోపం ఎక్కువైనప్పుడు అనేక వ్యాధులు వస్తుంటాయి. అలాంటప్పుడు విటమిన్ డి అధికంగా కలిగిన పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ డి అంది జబ్బుల బారిన పడకుండా ఉంటాము.




రోజా "జబర్దస్త్" నవ్వుపై కత్తిమహేష్ షాకింగ్ కామెంట్స్

జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ ఈ విషయాల్లో సేమ్ టు సేమ్... !! ఎప్పుడన్నా గమనించారా.. !!

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఐదువేల పింఛ‌న్‌తో అయ్య‌వారికి శ‌ఠ‌గోపం.. జ‌గ‌న‌న్న మార్కు రాజ‌కీయం..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌.. నాడు-నేడు.. నిర్వీర్యం దిశ‌గా అడుగులు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>