PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-strong-counter-to-tdp2a19ec7f-55a9-4a69-821a-bc8e414651cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-strong-counter-to-tdp2a19ec7f-55a9-4a69-821a-bc8e414651cb-415x250-IndiaHerald.jpg చంద్ర‌బాబు అయినా త‌న త‌ర్వాత త‌న వార‌సుడు లోకేష్ మాత్ర‌మే టీడీపీ ప‌గ్గాలు చేప‌ట్టి... ముఖ్య‌మంత్రి అవ్వాల‌నే విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వ‌స్తున్నారు. అయితే గ‌త ఐదేళ్ల‌లో చంద్ర‌బాబు న‌వ్యాంధ్ర తొలి సీఎంగా ఉన్న‌ప్పుడు ఈ క‌మ్మ వ‌ర్గంలో చాలా మంది చంద్ర‌బాబు తీరుతో ఇబ్బందులు ప‌డ్డారు. వైసీపీ కూడా చంద్ర‌బాబును బూచీగా చూపించి.. చివ‌ర‌కు క‌మ్మ వ‌ర్గంపై స‌మాజంలో మిగిలిన కులాల‌పై తీవ్ర వ్య‌తిరేక భావాన్ని క్రియేట్ చేయ‌డంతో పాటు ఈ వ‌ర్గాన్ని మిగిలిన వ‌ర్గాల‌కు దూరం చేసే విష‌యంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్chandra babu;cbn;ntr;telugu;cm;letter;tdp;ycp;lokesh kanagaraj;nandamuri taraka rama rao;partyనాడు బాబుకు కుడిభుజం... నేడు బాబు పేరు చెపితే ప‌రార్‌...!నాడు బాబుకు కుడిభుజం... నేడు బాబు పేరు చెపితే ప‌రార్‌...!chandra babu;cbn;ntr;telugu;cm;letter;tdp;ycp;lokesh kanagaraj;nandamuri taraka rama rao;partyThu, 21 Jan 2021 12:35:00 GMTతెలుగుదేశం పార్టీకి క‌మ్మ సామాజిక వ‌ర్గానికి ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆ పార్టీ పెట్టిన ఎన్టీఆర్ ఇదే వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో ఆ వ‌ర్గం గ‌త మూడున్న‌ర ద‌శాబ్దాల పాటు టీడీపీని నెత్తిన పెట్టుకుంటూ వ‌స్తోంది. గ‌తంలో ఎన్టీఆర్‌కు వ‌న్ సైడ్‌గా స‌పోర్ట్ చేసిన క‌మ్మ వ‌ర్గం ఆ త‌ర్వాత చంద్ర‌బాబుకు కూడా అంతే మ‌ద్ద‌తు ఇచ్చింది. చంద్ర‌బాబు తొలి సారి తొమ్మిదేళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు.. ఇంకా చెప్పాలంటే ఆయ‌న వ‌రుస‌గా రెండు సార్లు ఓడిన‌ప్పుడు కూడా బాబునే న‌మ్మింది.

ఇటు చంద్ర‌బాబు సైతం క‌మ్మ వ‌ర్గంలో మ‌రో నేత ఎద‌గ‌కుండా... ఈ వ‌ర్గానికి తానే ప్ర‌తినిధిగా ఎదిగారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రాజ్యాధికారం ద‌క్కించుకుని.. పెద్ద ప‌ద‌వి అధిరోహించాలంటే చంద్ర‌బాబు మిన‌హా వేరే క‌మ్మ నేత ఎవ్వ‌రూ క‌న‌ప‌డడం లేదు. చంద్ర‌బాబు అయినా త‌న త‌ర్వాత త‌న వార‌సుడు లోకేష్ మాత్ర‌మే టీడీపీ ప‌గ్గాలు చేప‌ట్టి... ముఖ్య‌మంత్రి అవ్వాల‌నే విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వ‌స్తున్నారు. అయితే గ‌త ఐదేళ్ల‌లో చంద్ర‌బాబు న‌వ్యాంధ్ర తొలి సీఎంగా ఉన్న‌ప్పుడు ఈ క‌మ్మ వ‌ర్గంలో చాలా మంది చంద్ర‌బాబు తీరుతో ఇబ్బందులు ప‌డ్డారు.

వైసీపీ కూడా చంద్ర‌బాబును బూచీగా చూపించి.. చివ‌ర‌కు క‌మ్మ వ‌ర్గంపై స‌మాజంలో మిగిలిన కులాల‌పై తీవ్ర వ్య‌తిరేక భావాన్ని క్రియేట్ చేయ‌డంతో పాటు ఈ వ‌ర్గాన్ని మిగిలిన వ‌ర్గాల‌కు దూరం చేసే విష‌యంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యింది. అస‌లు చంద్ర‌బాబుతో సంబంధం లేని క‌మ్మ నేత‌లు కూడా బాబు తీరుతో చాలా ఇబ్బంది ప‌డ్డారు. ఈ వ‌ర్గంలో వైద్య‌, విద్యా, పారిశ్రామిక‌, ఆర్థిక‌, వాణిజ్య రంగాల్లో ఉన్న వారంతా ఇప్పుడు చంద్ర‌బాబుకు క్ర‌మ‌క్ర‌మంగా దూర‌మ‌వుతోన్న పరిస్థితి.

పోయిన చోటే వెతుక్కోవాల‌న్నట్టుగా చంద్ర‌బాబు ఇప్పుడు పార్టీ కోసం ఎంతో చేసిన క‌మ్మ‌ల‌ను ప‌క్క‌న పెట్టేసి.. బీసీల‌కు ప‌ద‌వులు ఇస్తున్నారు. దీంతో పార్టీని న‌మ్ముకున్న క‌మ్మ‌లు కూడా ఇప్పుడు బాబుకు దూరం జ‌రుగుతున్నారు. మ‌రి వీరిని బాబు ఎలా మ్యానేజ్ చేస్తారో ?  చూడాలి. 


కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. రాహుల్ కాదంటే ఆ సీఎంకు అధ్యక్ష పీఠం!

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఐదువేల పింఛ‌న్‌తో అయ్య‌వారికి శ‌ఠ‌గోపం.. జ‌గ‌న‌న్న మార్కు రాజ‌కీయం..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌.. నాడు-నేడు.. నిర్వీర్యం దిశ‌గా అడుగులు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>