PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/brahmin-ghosh-deputy-speaker-sir-silence-even-if-it-happened-doesnot-speak-out-39ffd98b-8cf7-428c-a1b2-8bbce155f825-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/brahmin-ghosh-deputy-speaker-sir-silence-even-if-it-happened-doesnot-speak-out-39ffd98b-8cf7-428c-a1b2-8bbce155f825-415x250-IndiaHerald.jpg అంతో ఇంతో ఇతోధిక సాయం చేస్తున్నారు. ఆర్థికంగానో.. ప్ర‌భుత్వ ప‌రంగా ప‌థ‌కాల రూపంలోనో.. వ్యాపార‌ప‌రంగానో.. సాయం చేస్తున్నారు. వారి ఓట్ల‌తో గెలిచామ‌నే కృత‌జ్ఞ‌త‌ను చాటుకుంటున్నారు. మ‌రి డిప్యూటీ స్పీక‌ర్‌గా ర‌ఘుప‌తి బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి ఏం చేస్తున్నార‌నే ప్ర‌శ్న త‌లెత్తితే.. గ‌తంలో త‌మ పార్టీ అధికారంలో లేద‌ని చెప్పేవారు. స‌రే! నిజ‌మే క‌దా.. అని బ్రాహ్మ‌ణులు స‌రిపుచ్చుకున్నారు. ఇక‌, ఇప్పుడు వైసీపీ స‌ర్కారుదే క‌దా.. రాజ్యం.. మ‌రి ఇప్పుడైనా మాకు సాయం చేయండి అంటున్నారు. దీనికి ర‌ఘుప‌తి kona raghupathi;district;assembly;letter;ycp;reddy;partyబ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?kona raghupathi;district;assembly;letter;ycp;reddy;partyThu, 21 Jan 2021 10:12:00 GMTఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్‌. గుంటూరు జిల్లా బాప‌ట్ల నుంచి వ‌రుస‌గా విజ‌యం సాధిస్తున్నారు. అయితే.. చిత్రం ఏంట‌ని అనుకుంటున్నారా?  బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డ‌మే! ఆయ‌నే కోన ర‌ఘుప‌తి.  బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాల‌కు చెంది న నాయ‌కులే గెలుపు గుర్రాలు ఎక్క‌లేక చ‌తికిల ప‌డుతుంటే.. బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధిస్తున్న ఈయ‌న‌కు ఇక్క‌డి బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం ఎంత అండ‌గా నిలుస్తోందో అర్ధ‌మ‌వుతుంది. ఈ క్ర‌మంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ వంటి కీల‌క‌మైన ప‌ద‌విని సంపాయించుకున్నారు.

 మ‌రి.. ఈయ‌న త‌న సొంత సామాజిక వ‌ర్గానికి ఏం చేస్తున్నారు? నిజానికి రాష్ట్రంలో రెడ్డి, క‌మ్మ, కాపు సామాజిక వ‌ర్గాల‌ను తీసుకుంటే.. వారివారి సామాజిక వ‌ర్గాల‌కు నాయ‌కులు అంతో ఇంతో ఇతోధిక సాయం చేస్తున్నారు. ఆర్థికంగానో.. ప్ర‌భుత్వ ప‌రంగా ప‌థ‌కాల రూపంలోనో.. వ్యాపార‌ప‌రంగానో.. సాయం చేస్తున్నారు. వారి ఓట్ల‌తో గెలిచామ‌నే కృత‌జ్ఞ‌త‌ను చాటుకుంటున్నారు. మ‌రి డిప్యూటీ స్పీక‌ర్‌గా ర‌ఘుప‌తి బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి  ఏం చేస్తున్నార‌నే ప్ర‌శ్న త‌లెత్తితే.. గ‌తంలో త‌మ పార్టీ అధికారంలో లేద‌ని చెప్పేవారు. స‌రే! నిజ‌మే క‌దా.. అని బ్రాహ్మ‌ణులు స‌రిపుచ్చుకున్నారు.

ఇక‌, ఇప్పుడు వైసీపీ స‌ర్కారుదే క‌దా.. రాజ్యం.. మ‌రి ఇప్పుడైనా మాకు సాయం చేయండి అంటున్నారు. దీనికి ర‌ఘుప‌తి చెప్పే స‌మాధానం.. నిజ‌మే.. మ‌న ప్ర‌భుత్వ‌మే ఉంది. కానీ, నేను డిప్యూటీ స్పీక‌ర్‌గా ఉన్నాను క‌దా.. అలాంటి వాటిలో నేను జోక్యం చేసుకుంటే.. ప్ర‌తిప‌క్షాల నుంచి చెడ్డ‌పేరు, విమ‌ర్శ‌లు రెండూ వ‌స్తాయి.. అని మెల్ల‌గా త‌ప్పించుకుంటు న్నార‌ట‌. దీంతో ఆయ‌న‌కు ఎందుకు ఓట్లేశామా? అని ఇక్క‌డి బ్రాహ్మ‌ణులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో ఆల‌యాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

ఇక్క‌డ బ్రాహ్మ‌ణ అగ్ర‌హారాలు కూడా ఎక్కువే. దీంతో త‌మ‌కు ఏదైనా చేయాల‌ని కోరుతున్నారు. పోనీ.. ఏమీ చేయ‌లేదు. కానీ, ఇటీవ‌ల రాష్ట్రంలో జ‌రుగుతున్న ఆల‌యాల‌పై దాడుల ఘ‌టన‌ల‌‌ను కూడా ఆయ‌న ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యాల్లో ముందుండి మాట్లాడాల్సిన బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌జాప్ర‌తినిధి త‌న‌కు ఏమీ ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. ఆయ‌న మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఆయ‌న‌పై తీవ్రంగా ఉన్నాయి. 


స్థానిక ఎన్నికలపై తాడో..పేడో తేల్చనున్న ధర్మాసనం !!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

షాకింగ్: తెరాసకు ఇద్దరు మంత్రుల రాజీనామా...???

సోలార్ విద్యుత్‌లో సింగ‌రేణి రికార్డులు....డిసెంబ‌ర్ నాటికి 300 మెగావాట్లు..

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>