PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr938ddf13-920a-4e1a-b614-edf5298ceefc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr938ddf13-920a-4e1a-b614-edf5298ceefc-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో సీఎం మార్పు పై రోజు రోజు కి చర్చలు పెరిగిపోతున్నాయి. సామాన్యుడికి సైతం కేసీఆర్ కేటీఆర్ కి పట్టాభిషేకం చేస్తున్నారని తెలిసిపోయింది.. ఈ నేపథ్యంలో రాష్ట్రమంతటా ఏం జరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు నాయకత్వ మార్పు అంశంపై మైండ్ గేమ్ ఆడడం మొదలుపెట్టారు. కేటీఆర్ ని వీక్ చేసే విధంగా అయన మాట్లాడుతున్నారు. కాబోయే సీఎం అభ్యర్థి కేటీఆర్ కావడంతో ఆయనను టార్గెట్ చేస్తూ బండి సంజయ్ ఇతర గులాబీ నేతల్లో అసంతృప్తి ని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. kcr;kcr;ktr;kamalakar;bharatiya janata party;telangana rashtra samithi trs;eatala rajendar;gangula kamalakar;telangana;geum;cm;minister;etela rajender;partyబండి సంజయ్ సవాల్ ని కేసీఆర్, కేటీఆర్ లు స్వీకరించేనా..?బండి సంజయ్ సవాల్ ని కేసీఆర్, కేటీఆర్ లు స్వీకరించేనా..?kcr;kcr;ktr;kamalakar;bharatiya janata party;telangana rashtra samithi trs;eatala rajendar;gangula kamalakar;telangana;geum;cm;minister;etela rajender;partyThu, 21 Jan 2021 21:00:00 GMTతెలంగాణ లో సీఎం మార్పు పై రోజు రోజు కి చర్చలు పెరిగిపోతున్నాయి. సామాన్యుడికి సైతం కేసీఆర్ కేటీఆర్ కి పట్టాభిషేకం చేస్తున్నారని తెలిసిపోయింది.. ఈ నేపథ్యంలో రాష్ట్రమంతటా ఏం జరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు నాయకత్వ మార్పు అంశంపై మైండ్ గేమ్ ఆడడం మొదలుపెట్టారు. కేటీఆర్ ని వీక్ చేసే విధంగా అయన మాట్లాడుతున్నారు. కాబోయే సీఎం అభ్యర్థి కేటీఆర్ కావడంతో ఆయనను టార్గెట్ చేస్తూ బండి సంజయ్ ఇతర గులాబీ నేతల్లో అసంతృప్తి ని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు.

కేటీఆర్ సీఎం కావాలని ఉద్యమ ద్రోహులు మాత్రమే కోరుకుంటున్నారని,నిజమైన ఉద్యమకారులకు కేటీఆర్ సీఎం అవడం ఇష్టం లేదని, అన్నారు.. ముఖ్యంగా ఈటల రాజేందర్ ను దువ్వేందుకు అయన ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటలకు టీఆర్ఎస్‌లో అన్యాయం జరిగిందని… ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చినప్పుడల్లా ఈటలను ముందుపెట్టి కేసీఆర్‌ బయటపడుతున్నారని బండి సంజయ్‌ అంటున్నారు. తెలంగాణ లో మంచి ఫలితాలు వచ్చిన దగ్గరినుంచి బండి సంజయ్ తెరాస ని దుయ్యపట్టం చూస్తుంటే తెరాస డిఫెన్స్ లో పడిందని చెప్పాలి.

మొన్నటికి మొన్న తెరాస లో ముగ్గురు ఎమ్మెల్యేలు అసహనంలో ఉన్నారని, వారికి మంత్రి పదవులు ఇవ్వని కారణంగా పార్టీ లోనుంచి బయటకు వచ్చే ఆలోచన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాజేందర్ ను మచ్చిక చేసుకుని అయన తనవైపు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. కేటీఆర్‌ను సీఎం చేస్తే మంత్రివర్గ ప్రక్షాళన తప్పదని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ సారి మంత్రి పదవులు దక్కవని ప్రచారం జరుగుతున్న వారిలో ఈటల, గంగుల కమలాకర్ లాంటి వాళ్ల పేర్లు ఉన్నాయి. ఈ కారణంగానే ఈటలను మరింత దువ్వే ప్రయత్నాన్ని బండి సంజయ్ చేస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో.. కేసీఆర్ తాను సీఎంగా ఉండలేకపోతే.. మార్చాలని అనుకుంటే … తన తర్వాతైన దళితుడిని సీఎం చేయాలని ప్రజలు కోరుతున్నారనే కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. 


పులివెందులలోనే జగన్ కి బీజేపీ మార్క్ షాక్...?

కేసీఆర్ స్థానంలో ఈటెల, పద్మారావు కాకుండా 'కేటీఆర్' ఎందుకు సీఎం కావాలి?

కష్టాల్లో బాలీవుడ్.. టాలీవుడ్ ఆపన్నహస్తం కోసం..!

జగనోరూ.. పంతం కాదు అభివృద్ధి కావాలి..!!

జగన్ గెలిచేందుకు 24 గంటల గడువే!

తమన్నా ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లు ఇంటరెస్టింగ్ ?

'ఆర్ఆర్ఆర్' లో కనిపించని మెగా హీరో ఆయనే ... ఎవరో తెలిస్తే షాక్ అవుతారు ....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>