MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/mahes-babuf17d4441-c566-4192-a110-1d65fc10a132-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/mahes-babuf17d4441-c566-4192-a110-1d65fc10a132-415x250-IndiaHerald.jpgమహేష్ బాబు అంటే సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే మహేష్ బాబుకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే అని చెప్పాలి. మన సూప‌ర్‌స్టార్ కృష్ణ వారసుడిగా మన సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు మహేష్ బాబు. తండ్రికి తగ్గా తనయుడిగా గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు.mahesh babu;cbn;mahesh;suresh;keerthi suresh;kirti;krishna;mahesh babu;prince;raasi;tara;teja;rajaka;cinema;heroine;nijamమొన్న మహేష్ పక్కన చైల్డ్ ఆర్టిస్టు...నిన్న మహేష్ కి విలన్..ఆ నటి ఎవరు.?మొన్న మహేష్ పక్కన చైల్డ్ ఆర్టిస్టు...నిన్న మహేష్ కి విలన్..ఆ నటి ఎవరు.?mahesh babu;cbn;mahesh;suresh;keerthi suresh;kirti;krishna;mahesh babu;prince;raasi;tara;teja;rajaka;cinema;heroine;nijamThu, 21 Jan 2021 10:00:00 GMTమహేష్ బాబు అంటే సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే మహేష్ బాబుకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే అని చెప్పాలి. మన సూప‌ర్‌స్టార్ కృష్ణ వారసుడిగా మన సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు మహేష్ బాబు. తండ్రికి తగ్గా తనయుడిగా గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు. మొదట మహేష్ బాబు  చైల్డ్ ఆర్టిస్ట్‌గానే సినీ కెరీర్‌ని ప్రారంభించారు.కృష్ణ న‌టించిన ప‌లు చిత్రాల్లో మ‌హేష్ బాబు కృష్ణకి కొడుకుగా న‌టించాడు. అలాగే బాల‌చంద్రుడు మూవీలో ప్ర‌ధాన పాత్ర‌లోనూ మెరిశాడు.ఆ తరువాత రాజ కుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు. నిజంగానే రాజకుమారుడు లెక్క ఉంటాడు కదా మహేష్ బాబు..అందుకనే అభిమానులు మహేష్ ని ప్రిన్స్ అని పిలుచుకుంటారు. రాజకుమారుడు సినిమా  త‌రువాత  వరుస సినిమాలు చేస్తూ  మంచి హిట్లు కొడుతూ త‌న కెరీర్‌ని కొన‌సాగిస్తున్నారు.


అయితే అప్పట్లో మ‌హేష్ బాబుతో పాటు చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన ఓ హీరోయిన్,  త‌రువాత మహేష్ కి  విల‌న్‌గా కూడా మారింది. అసలు ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..? అలనాటి  అందాల తార  రాశి. ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఈ హీరోయిన్ హవా కొనసాగింది. తరువాత మెల్లగా అవకాశాలు తగ్గాయి. అయితే రాశి కూడా  త‌న కెరీర్‌ని చైల్డ్ ఆర్టిస్ట్‌ గానే ప్రారంభించారు. ఈ క్ర‌మంలో కృష్ణ న‌టించిన గూఢ‌చారి 117లో రాశి ఒక పాత్ర‌లో న‌టించారు. అలాగే  ఇదే మూవీలో మ‌హేష్ బాబు కూడా న‌టించారు. ఇద్దరు కలిసి బాల నటులుగా చేసిన సినిమా ఇది. కానీ  వారిద్ద‌రి మ‌ధ్య కలిసి నటించే సీన్లు ఉండ‌వు.ఎవరి పాత్ర వారిది. దాదాపు చాలా ఏళ్ల గ్యాప్ తరువాత మళ్ళీ వీళ్ళద్దరు పెద్దయ్యాక నిజం సినిమాలో కలిసి నటించారు.

తేజ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన నిజం సినిమాలో  గోపిచంద్ విల‌న్‌గా న‌టించ‌గా, అత‌డి స‌ర‌స‌న కీల‌క పాత్ర‌లో రాశి కూడా విల‌న్‌గా న‌టించారు.ఈ సినిమాలో కూడా అంతే... వీరిద్దరి మధ్య ఎక్కువ సీన్లు కూడా ఉండవు. హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో రాశి కూడా అడపా దడపా కొన్ని సినిమాల్లో నటించింది.  ప్రస్తుతం మ‌హేష్ బాబు  స‌ర్కారు వారి పాట‌లో న‌టించేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీలో మ‌హేష్ స‌ర‌స‌న కీర్తి సురేష్  తొలిసారిగా జ‌త‌క‌డుతోంది.  అ మూవీపై మ‌హేష్ అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.


డయాబెటిస్ నియంత్రణలో దాల్చిన చెక్క,, వెల్లుల్లి ముఖ్యపాత్ర..??

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

షాకింగ్: తెరాసకు ఇద్దరు మంత్రుల రాజీనామా...???

సోలార్ విద్యుత్‌లో సింగ‌రేణి రికార్డులు....డిసెంబ‌ర్ నాటికి 300 మెగావాట్లు..

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>