PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr61a9c86b-e2e9-44c4-8542-66494499661c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr61a9c86b-e2e9-44c4-8542-66494499661c-415x250-IndiaHerald.jpg తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో కొత్త ప‌ల్ల‌వి మొద‌లైంది. సీఎం ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు అన్ని ర‌కాలుగా కేటీఆర్ స‌మ‌ర్థుడే అంటూ మంత్రులు స‌ర్టిఫై చేసేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ స్థానంలో ఆయన తనయుడు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావాలంటున్న నేతల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు పలుమార్లు ఈ ఆకాంక్షను వ్యక్తం చేయగా.. తాజాగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ బాట పట్టారు. దీంతో ఇప్పుడు టీఆర్‌ఎ్‌సలో ఈ అంశమే హాట్‌ టాపిక్‌గా మారింది.మొన్న ఆరోగ్య‌శాఖ‌మంత్రి ktr;ktr;telangana rashtra samithi trs;telangana;chief minister;assembly;mla;minister;central government;party;bodhan;mantraఫిబ్ర‌వ‌రిలోనే ముఖ్య‌మంత్రిగా కేటీఆర్..ఫిబ్ర‌వ‌రిలోనే ముఖ్య‌మంత్రిగా కేటీఆర్..ktr;ktr;telangana rashtra samithi trs;telangana;chief minister;assembly;mla;minister;central government;party;bodhan;mantraThu, 21 Jan 2021 07:10:00 GMTతెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో కొత్త ప‌ల్ల‌వి మొద‌లైంది. సీఎం ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు అన్ని ర‌కాలుగా కేటీఆర్ స‌మ‌ర్థుడే అంటూ మంత్రులు స‌ర్టిఫై చేసేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ స్థానంలో ఆయన తనయుడు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావాలంటున్న నేతల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు పలుమార్లు ఈ ఆకాంక్షను వ్యక్తం చేయగా.. తాజాగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ బాట పట్టారు. దీంతో ఇప్పుడు టీఆర్‌ఎ్‌సలో ఈ అంశమే హాట్‌ టాపిక్‌గా మారింది.మొన్న ఆరోగ్య‌శాఖ‌మంత్రి ఈటెల రాజేంద‌ర్ విలేఖ‌రుల‌తో మాట్లాడుతూ కేసీఆర్‌కు రాజ‌కీయాల్లోనూ స‌రైన వార‌సుడు కేటీఆరే అంటూ కితాబిచ్చారు.


ఇప్ప‌టికే ఆయ‌న సీఎం అందుబాటులో లేని స‌మ‌యంలో ప‌రోక్షంగా ఆ పాత్ర పోషిస్తున్నారంటూ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. తాజాగా మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ కూడా కేటీఆర్ ముఖ్య‌మంత్రి అయితే త‌ప్పేంటి అంటూ వ్యాఖ్య‌నించారు. కేటీఆర్ ముఖ్య‌మంత్రి అవుతార‌నే అంశంపై విలేఖ‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు. అయితే ఈ విషయంపై తగిన సమయంలో సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కేటీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తలసాని ఈ వ్యాఖ్యలు చేశారు.


పార్టీ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ సమర్థుడని, వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఆయన ఆధ్వర్యంలో జరగాలన్నదే తన కోరిక అని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. గ‌తంలో ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్‌, మాజీ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌లు సీఎం కావాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు.  వచ్చే నెలలో కేటీఆర్‌కు సీఎం పగ్గాలు అప్పగించడం ఖాయమనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ఈ వాదనను తెరపైకి తెస్తుండటం గమనార్హం. కేబినెట్లోనూ భారీగా మార్పులు ఉంటాయన్న చ‌ర్చ పార్టీ ముఖ్య నేత‌ల మ‌ధ్య జ‌రుగుతోంది. దీంతో ఇద్ద‌రు ముగ్గురు సీనియ‌ర్ మంత్రులు కూడా కేటీఆర్ ముఖ్య‌మంత్రి కాబోతున్నారంటూ వ్యాఖ్య‌నిస్తూ ముంద‌స్తుగానే వారి స్థానాల‌ను ప‌దిలం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ చెబుతున్నారు.





ప్రశ్నలు వర్షంలా కురిసినా, సమాధానాలు చినుకుల్లా పడ్డాయి - ఇదీ కచరా ప్రభుత్వం తీరు

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ న్యూస్ తో మార్కెట్ ను ఓపెన్ చేసిన రాజమౌళి !

బ్రాహ్మ‌ణ ఘోష‌: పీఠాలు-మ‌ఠాల‌తో జ‌గ‌న్ పాలిటిక్స్‌.. బ్రాహ్మ‌ణులు ప‌ట్ట‌రా ?

చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ న్యూస్.. రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్..!!

సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోబోతున్న హీరో వరుణ్!!

జగన్ ను బిజెపిలో ఆ ఇద్దరు ఇబ్బంది పెడతారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>