PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagandc229f47-1c4b-4a94-82fa-becf7f1ce9e2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagandc229f47-1c4b-4a94-82fa-becf7f1ce9e2-415x250-IndiaHerald.jpg ఇక‌, శ్రీకాళ‌హ‌స్తిలో విగ్ర‌హాలు తెచ్చిపెట్టిన వివాదం వెలుగు చూడ‌డంతో ముగ్గురు అర్చకుల‌ను వివ‌రాలు చెప్పాలంటూ.. ఎమ్మెల్యే అనుచ‌రులు ఇంటికి వెళ్లిమ‌రీ వేధించారు. ఇక‌, అంత‌ర్వేది ర‌థం ద‌గ్ధం ఘ‌ట‌న‌లోనూ పూజారుల‌పై రుస‌రుస‌లాడారు. ఇక్క‌డే ప‌డుకోండి! అని ఓ ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు. రామ‌తీర్థంలో రాముని శిర‌చ్ఛేదం ఘ‌ట‌న వెలుగు చూసిన త‌ర్వాత‌.. కూడా పూజారుల‌పై ఇంట‌రాగేష‌న్ ఇటు పోలీసుల నుంచి అటు రాజ‌కీయ నేత‌ల‌నుంచి తీవ్ర‌స్థాయిలో చోటు చేసుకుంది. దాడులు జ‌రిగిన ఆల‌యాల్లోని పూజారులు స‌హా ఇత‌ర jagan;nithya new;ramu;tiru;police;mla;letter;ycp;party;tirumala tirupathi devasthanamబ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!jagan;nithya new;ramu;tiru;police;mla;letter;ycp;party;tirumala tirupathi devasthanamThu, 21 Jan 2021 08:50:58 GMTవైసీపీ అధినేత జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మ‌ణుల‌కు ర‌క్ష‌ణ కొర‌వ‌డిందా?  అధికార పార్టీ నాయ‌కులే బ్రాహ్మ‌ణుల‌పై దాడులు చేస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి బ్రాహ్మ‌ణుల‌పై అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ నాయ‌కులు పెత్త‌నం చేస్తున్నారు. కీల‌క‌మైన ఆల‌యాల్లో బ్రాహ్మ‌ణుల‌పై ఒత్తిడి తెస్తున్నారు. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ టెంపుల్ స‌హా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలోని అర్చకుల‌పైనా నేత‌ల పెత్త‌నం ఎక్కువైంద‌నేది ఇటీవ‌ల ప‌రిణామాల‌ను బ‌ట్టి అర్ధ‌మ‌వుతోంది. అయితే.. కొన్ని వెలుగు చూస్తుండ‌గా.. మ‌రికొన్ని మాత్రం లోపాయికారీగా రాజీ చేసుకుని అక్క‌డితో ముగిస్తున్నారు.

క‌ర్నూలు జిల్లాలోని ఓ ఆల‌యంలో పూజాల‌ను ఈవోతో క‌లిసి వైసీపీ నేత‌లు చిత‌క్కొట్టిన వ్య‌వ‌హారం తెలిసిందే. ఇక‌, శ్రీకాళ‌హ‌స్తిలో విగ్ర‌హాలు తెచ్చిపెట్టిన వివాదం వెలుగు చూడ‌డంతో ముగ్గురు అర్చకుల‌ను వివ‌రాలు చెప్పాలంటూ.. ఎమ్మెల్యే అనుచ‌రులు ఇంటికి వెళ్లిమ‌రీ వేధించారు. ఇక‌, అంత‌ర్వేది ర‌థం ద‌గ్ధం ఘ‌ట‌న‌లోనూ పూజారుల‌పై రుస‌రుస‌లాడారు. ఇక్క‌డే ప‌డుకోండి! అని ఓ ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు. రామ‌తీర్థంలో రాముని శిర‌చ్ఛేదం ఘ‌ట‌న వెలుగు చూసిన త‌ర్వాత‌.. కూడా పూజారుల‌పై ఇంట‌రాగేష‌న్ ఇటు పోలీసుల నుంచి అటు రాజ‌కీయ నేత‌ల‌నుంచి తీవ్ర‌స్థాయిలో చోటు చేసుకుంది.

దాడులు జ‌రిగిన ఆల‌యాల్లోని పూజారులు స‌హా ఇత‌ర ఆల‌యాల్లోని పూజారులు కూడా బిక్కుబిక్కు మంటూ కాలం గ‌డుపుతున్నారు. కొంద‌రు రాత్రి వేళల్లో అయితే.. ఆల‌యాల్లో తీవ్ర‌మైన చలిలో నిద్ర‌చేస్తున్నారు. ఎక్క‌డ ఏం జ‌రుగుతుందో.. ఏ నేత త‌మ‌పైకి దాడికి వ‌స్తాడో అని భ‌య‌ప‌డుతున్న వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. నిజానికి రాజ‌కీయ ప్రేరేపిత దాడుల‌ను పూజారుల‌పైకి నెట్టేయాల‌ని కూడా కొంద‌రు నాయ‌కులు ప్ర‌య‌త్నించారు.

అయితే.. మ‌రింత వివాదం అవుతామ‌ని భావించి వెన‌క్కి త‌గ్గారు. ఇలా జ‌గ‌న్ పాల‌న‌లో పూజారుల‌కు, బ్రాహ్మ‌ణ‌కు ప్ర‌భుత్వం నుంచి రూపాయి సాయం అంద‌క‌పోయినా.. వారిపై మాత్రం అనుమానాలు వేధింపులు నిత్యం కృత్యంగా మారాయి. మ‌రి జ‌గ‌న్ కు ఇవ‌న్నీ తెలుసా?  తెలిసే ఇలా జ‌రుగుతోందా?  అనేది ప్ర‌శ్న‌. 


సోలార్ విద్యుత్‌లో సింగ‌రేణి రికార్డులు....డిసెంబ‌ర్ నాటికి 300 మెగావాట్లు..

విదేశీ యువతి కోరడంతో బట్టలిప్పిన యువకుడు.. కానీ అంతలోనే..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ న్యూస్ తో మార్కెట్ ను ఓపెన్ చేసిన రాజమౌళి !

బ్రాహ్మ‌ణ ఘోష‌: పీఠాలు-మ‌ఠాల‌తో జ‌గ‌న్ పాలిటిక్స్‌.. బ్రాహ్మ‌ణులు ప‌ట్ట‌రా ?

చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ న్యూస్.. రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్..!!

సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోబోతున్న హీరో వరుణ్!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>