PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kanna-laxminarayanab16fce95-b981-4424-bfdd-281b693019f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kanna-laxminarayanab16fce95-b981-4424-bfdd-281b693019f7-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో కొంతమంది కీలక నేతలు ఈ మధ్యకాలంలో సైలెంట్ గా ఉండటంతో అసలు ఆ పార్టీ లో ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కావడం లేదు. ముఖ్యంగా బిజెపి కార్యక్రమాలలో కన్నా లక్ష్మీ నారాయణ పాల్గొనకపోవడంతో ఆయన తెలుగుదేశం పార్టీ లోకి వెళ్ళే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరిగింది. రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ లో భవిష్యత్తు లేదు అన్న విషయం అందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీని ప్రజలు పెద్దగా నమ్మే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ విధానాలపై రాష్ట్ర ప్రkanna laxminarayana;bharatiya janata party;telugu desam party;andhra pradesh;narendra modi;janasena;telugu;kanna lakshminarayana;prime minister;minister;lakshmi devi;tdp;central government;kanna lakshmi narayana;janasena party;partyకాపు సామాజిక వర్గ నేతలతో టీడీపీలోకి కన్నాకాపు సామాజిక వర్గ నేతలతో టీడీపీలోకి కన్నాkanna laxminarayana;bharatiya janata party;telugu desam party;andhra pradesh;narendra modi;janasena;telugu;kanna lakshminarayana;prime minister;minister;lakshmi devi;tdp;central government;kanna lakshmi narayana;janasena party;partyThu, 21 Jan 2021 11:00:00 GMTఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో కొంతమంది కీలక నేతలు ఈ మధ్యకాలంలో సైలెంట్ గా ఉండటంతో అసలు ఆ పార్టీ లో ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కావడం లేదు. ముఖ్యంగా బిజెపి కార్యక్రమాలలో కన్నా లక్ష్మీ నారాయణ పాల్గొనకపోవడంతో ఆయన తెలుగుదేశం పార్టీ లోకి వెళ్ళే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరిగింది. రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ లో భవిష్యత్తు లేదు అన్న విషయం అందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీని ప్రజలు పెద్దగా నమ్మే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు.

ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ విధానాలపై రాష్ట్ర ప్రజల్లో చాలా వరకు ఆగ్రహం ఉంది. దాదాపుగా రాష్ట్రం విడిపోయిన ఆరేళ్లలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా గాని ప్రత్యేకంగా నిధులు గాని ఇచ్చే విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముందడుగు వేయలేకపోతున్నారు. రాష్ట్రంలో ఉన్న పార్టీలను తన చెప్పుచేతల్లో పెట్టుకొని ముందుకు వెళ్లాలి అని భావించడంపై కూడా ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రాష్ట్రానికి సహాయం చేయాల్సి ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది.

కాబట్టి బీజేపీ ఏపీలో బలపడటం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాని పని అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు కొందరు బయటకు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వదిలేసే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. అయితే ఆయన వైసీపీలోకి వెళ్తారా టీడీపీ లోకి వెళ్తారా అనేది స్పష్టత రాక పోయినా కచ్చితంగా ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయనతో పాటు దాదాపుగా పది మంది కాపు సామాజికవర్గ నేతలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. కాపు సామాజికవర్గం నేతలు ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణతో చర్చలు జరుపుతున్నారని వారిలో జనసేన పార్టీ నేతలు కూడా కొంత మంది ఉన్నారని అంటున్నారు. వారందరితో కలిసి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరవచ్చునని అంటున్నారు.


కృష్ణంరాజు జీవితంలో గొప్ప సినిమాలు ఇవేనంట..!?

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

షాకింగ్: తెరాసకు ఇద్దరు మంత్రుల రాజీనామా...???

సోలార్ విద్యుత్‌లో సింగ‌రేణి రికార్డులు....డిసెంబ‌ర్ నాటికి 300 మెగావాట్లు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>