Businessyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/amazon09999fd0-9a1a-404e-b794-4e4c1cde9dc0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/amazon09999fd0-9a1a-404e-b794-4e4c1cde9dc0-415x250-IndiaHerald.jpgఈ-కామర్స్ రంగంలో రిలయన్స్ అమెజాన్‌కు ప్రధాన పోటీదారు కాబోతోందన్న అంచనాలు ఇప్పటికే మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే రంగంలో రిలయన్స్ మరో ముందడుగు వేసింది. దీంతో అమెజాన్ కు గట్టి షాక్ తగిలింది. రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ డీల్ కు స్టాక్ ఎక్సేంజ్ పచ్చ జెండా ఉపడంతో..amazon;mumbai;india;singapore;amazon;reliance;court;vegetable market;contractఒక్క డీల్ తో అమెజాన్ కు చుక్కలు చూపిస్తున్న రిలయన్స్.. సెబీ అనుమతి కూడా..!ఒక్క డీల్ తో అమెజాన్ కు చుక్కలు చూపిస్తున్న రిలయన్స్.. సెబీ అనుమతి కూడా..!amazon;mumbai;india;singapore;amazon;reliance;court;vegetable market;contractThu, 21 Jan 2021 23:39:00 GMTముంబై:  ఈ-కామర్స్ రంగంలో రిలయన్స్ అమెజాన్‌కు ప్రధాన పోటీదారు కాబోతోందన్న అంచనాలు ఇప్పటికే మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే రంగంలో రిలయన్స్ మరో ముందడుగు వేసింది. దీంతో అమెజాన్ కు గట్టి షాక్ తగిలింది. రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ డీల్ కు స్టాక్ ఎక్సేంజ్ పచ్చ జెండా ఉపడంతో అమెజాన్ కు పెద్ద దెబ్బే తగిలింది. అంతే కాదు రిటైల్ ఆస్తులను రిలయన్స్‌కు అమ్మాలనుకుంటున్న ఫ్యూచర్ గ్రూప్‌ ప్రయత్నాలు ఫలించనున్నాయి. ఈ డీల్ ముందుకు సాగచ్చంటూ భారత స్టాక్ ఎక్సెంజ్‌లు బుధవారం ఆమోద ముద్ర వేశాయి. ఈ ఒప్పందంపై అభ్యంతరాలు, ప్రతికూల అభిప్రాయాలు తమకు లేవని స్పష్టంగా చెప్పాయి. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి కూడా సమాచారం అందించామని, ఇక నిరభ్యంతరంగా డీల్ ముందుకు సాగచ్ఛని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లు పేర్కొన్నాయి. దీంతో ఈ డీల్ కు అన్ని అడ్డంకులు తొలగినట్లైంది. కాగా.. ఈ ఒప్పందంపై తొలి నుంచీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అమెజాన్‌కు ఈ పరిణామం మింగుడు పడడం లేదు.


రిలయన్స్‌తో డీల్‌కు సంబంధించి అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోంది. గతంలో అమెజాన్‌తో ఫ్యూచర్ గ్రూప్ చేసుకున్న ఒప్పందంలోని కొన్ని నిబంధనలను ఈ కొత్త డీల్ ఉల్లంఘిస్తోందనేది అమెజాన్ ప్రధాన లెవనెత్తుతున్న అభ్యంతరం. ఈ నేపథ్యంలో అమెజాన్ సంస్థ సింగపూర్ ఆర్బిట్రేటర్‌నూ ఆశ్రయించింది. ఈ క్రమంలో తుది తీర్పు వెలువడే వరకూ రిలయన్స్‌తో డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ఆర్బిట్రేటర్ గత ఏడాది ఆక్టోబర్‌లో తీర్పునిచ్చింది. అయితే రిలయన్స్‌తో ఒప్పందానికి సంబంధించినంత వరకూ సింగపూర్ ఆర్బిట్రేటర్ తీర్పుకు తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని ఫ్యూచర్ గ్రూప్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో డీల్ నిలిపివేత తీర్పును అమెజాన్ సంస్థ పలు లేఖల ద్వారా సెబీ దృష్టికి కూడా తీసుకెళ్లింది. సింగపూర్ ఆర్బిట్రేటర్ కోర్టులో ఈ డీల్‌కు సంబంధించి వాదోపవాదాలు నడుస్తున్నాయని, ఇలాంటి సమయంలో రిలయన్స్ తో ఫ్యూచర్ గ్రూప్ డీల్ ముందుగు సాగడం నిబంధనలకు విరుద్ధమంటూ గగ్గోలు పెట్టింది.


తాజాగా భారత్ స్టాక్ ఎక్సేంజీలు ఫ్యూచర్-రిలయన్స్ డీల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.  సెబీతో చర్చించాకే ఈ నిర్ణయానికి వచ్చినట్టు ప్రకటించాయి. ఈ డీల్‌తో పాటు అమెజాన్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను కూడా రిలయన్స్‌తో, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్‌తో ఫ్యూచర్ గ్రూప్ పంచుకోవాలని సూచించింది. అమెజాన్-ఫ్యూచర్ డీల్‌కు ఎన్‌సీఏఎల్‌టీ కూడా అనుమతించాల్సి ఉంటుంది. కాగా ఈ పరిణామంపై అమెజాన్ కూడా స్పందించింది. ఈ విషయమై ఇతర చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామని పేర్కొంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్ అనుమతులన్నీ సింగపూర్ ఆర్బిట్రేటర్ తుది తీర్పుపైనే ఆధారపడి ఉంటాయని పేర్కొంది. అందువల్ల అక్కడి తీర్పు ఫ్యూచర్ గ్రూప్ కు వ్యతిరేకంగా వస్తే ఈ డీల్ కూడా రద్దవుతుందని చెబుతోంది. ఏది ఏమైనా ఈ డీల్ పూర్తయితే రిలయన్స్ సంస్థ అమెజాన్ కు సరైన పోటీదారుగా మారుతుందనడంలో సందేహం లేదు.




బిడెన్ మొదటి హెచ్చరిక..కారణాలు చెప్పను..స్పాట్ లోనే..

కేసీఆర్ స్థానంలో ఈటెల, పద్మారావు కాకుండా 'కేటీఆర్' ఎందుకు సీఎం కావాలి?

కష్టాల్లో బాలీవుడ్.. టాలీవుడ్ ఆపన్నహస్తం కోసం..!

జగనోరూ.. పంతం కాదు అభివృద్ధి కావాలి..!!

జగన్ గెలిచేందుకు 24 గంటల గడువే!

తమన్నా ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లు ఇంటరెస్టింగ్ ?

'ఆర్ఆర్ఆర్' లో కనిపించని మెగా హీరో ఆయనే ... ఎవరో తెలిస్తే షాక్ అవుతారు ....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>