PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tides-in-personal-and-political-lifeb7ee73bd-7365-436c-a386-612782d50541-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tides-in-personal-and-political-lifeb7ee73bd-7365-436c-a386-612782d50541-415x250-IndiaHerald.jpg1966లో బైడెన్‌కు తొలిసారి వివాహమైంది. నెలియాను వివాహమాడిన తరువాత విల్మింగ్టన్‌లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు బైడెన్‌. అప్పట్లో బైడెన్‌కు డెలవేర్‌ గవర్నర్‌ అయిన డెమొక్రాటిక్‌ నాయకుడి విధానాలపై ఆగ్రహం ఉండేది. రిపబ్లికన్‌ అభ్యర్థి భావాలు నచ్చేవి. అయితే, రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థి రిచర్డ్‌ నిక్సన్‌ అంటే ఇష్టం ఉండేది కాదు. 1969లో.. డెమొక్రాటిక్‌ పార్టీలో చురుగ్గా వ్యవహరించే ఒక వ్యక్తి నిర్వహించే న్యాయసంస్థలో పనిచేశారు. అక్కడ ఉండగానే తన భావాలు మార్చుకొని డెమొక్రాట్‌గా తన పేరు నమోదు చేసుకుtides in personal and political life;hari;hari music;jeevitha rajaseskhar;prema;american samoa;barack obama;love;wife;service;local language;leader;partyవ్యక్తిగత, రాజకీయ జీవితంలో ఆటుపోట్లు..!వ్యక్తిగత, రాజకీయ జీవితంలో ఆటుపోట్లు..!tides in personal and political life;hari;hari music;jeevitha rajaseskhar;prema;american samoa;barack obama;love;wife;service;local language;leader;partyThu, 21 Jan 2021 18:00:00 GMTస్థానిక కౌంటీ కౌన్సిల్‌కు ఎన్నికైన బైడెన్‌.. 1972లో జూనియర్‌ సెనెటర్‌గా ఎన్నికయ్యారు. చేతిలో డబ్బుల్లేకపోవడంతో.. బైడెన్‌ కుటుంబసభ్యులు ఇంటింటికీ తిరగి కరపత్రాలు పంచి ప్రచారం చేశారు. అయితే బైడెన్‌ ప్రత్యర్థి మాత్రం భారీగా ప్రచారం చేశారు. అయినా బైడెనే గెలిచారు. దురదృష్టవశాత్తూ ఆ ఏడాది  భార్య, ఏడాది వయసున్న కుమార్తె ప్రమాదంలో చనిపోయారు. ఆ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన కుమారులిద్దరూ ఆస్పత్రిలో ఉండగా.. సెనెట్‌ సభ్యుడుగా బైడెన్‌ ఆస్పత్రిలోనే ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సంఘటన అప్పట్లో అందరినీ విశేషంగా ఆకర్షించింది. సెనెటర్‌ పదవి చేపట్టిన తరువాత మొదటి 14 సంవత్సరాల కాలంలో తన వ్యక్తిగత జీవితంలో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేశారు. భార్య, కూతురి మరణం తరువాత తన కొడుకులిద్దరికీ మంచి జీవితం అందించాలనే తాపత్రయంతో తన సొంతిల్లు ఉన్న డెలవేర్ నుంచీ వాషింగ్టన్‌కు రోజూ వచ్చి వెళ్తుండేవారు.

1977లో ఆయన జిల్‌ ట్రేసీ జాకబ్స్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె. 30 ఏళ్ల వయసుకే సెనెటర్‌గా ఎన్నికైన బైడెన్‌ చురుగ్గా పనిచేయడంతో టైమ్‌ మేగజైన్‌ 1974లో బైడెన్‌ను ఫేసెస్‌ ఫర్‌ ద ఫ్యూచర్‌లో ఒకరిగా పేర్కొంది. సెనెటర్‌గా వినియోగదారుల హక్కులు, పర్యావరణ అంశాలపై ఎక్కువగా దృష్టిసారించారు బైడెన్. సెనెట్‌కు సంబంధించిన పలు కమిటీలకు నాయకత్వం వహించారు. రాజకీయంగా ఒక్కొక్క మెట్టే ఎదుగుతూ వచ్చారు. 1987లో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవి పోటీలో తొలిసారిగా అడుగు పెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటి బ్రిటిష్ లేబర్ పార్టీ లీడర్ నీల్ కినోక్ ఉపన్యాసాన్ని బైడెన్ అనుకరించారంటూ ఆరోపణలు రావడంతో ఆయన ప్రయత్నాలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ప్రచార బృందం చేసిన కొన్ని తప్పుల వలన, ఆయన గతంలో చేసిన కొన్ని తప్పుల వల్ల అభ్యర్థిత్వం దక్కలేదు.

2008లో మళ్లీ బైడెన్ అధ్యక్ష పోటీలో అడుగు పెట్టడానికి ప్రయత్నించారు. కానీ, ఆ ప్రయత్నం కూడా విజయవంతం కాలేదు.అయితే.. అప్పుడు డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న బరాక్ ఒబామా, తనకు తోడుగా ఉపాధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి జో బైడెన్‌ను ఎంచుకున్నారు. ఆ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ గెలిచింది. ఒబామా-బైడెన్ జంట ఆ తర్వాత 2012 అధ్యక్ష ఎన్నికల్లోనూ గెలిచింది. బైడెన్ చాలా సార్లు ఒబామాను తన సోదరునిగా అభివర్ణించారు. ఒబామా, తన అధ్యక్ష పదవి ఆఖరు రోజుల్లో బైడెన్‌కు అమెరికా దేశ అత్యున్నత పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం పురస్కారం ఇచ్చి సత్కరించారు. జో బైడెన్‌ అంటే నటన లేని ప్రేమ, స్వార్థం లేని సేవ, జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించే తత్వమని ప్రశంసించారు ఒబామా. ఒబామా-బైడెన్ భాగస్వామ్యాన్ని అత్యంత విజయవంతమైన భాగస్వామ్యంగా అభివర్ణిస్తారు విశ్లేషకులు. అయితే, అంత గొప్ప దశలో కూడా బైడెన్‌కు వ్యక్తిగతమైన బాధలు తప్పలేదు. 2015లో ఆయన కుమారుడు బౌ బ్రెయిన్ 46 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో మరణించారు. బౌ బైడెన్ రాజకీయాల్లో తన తండ్రికి వారసుడిగా కొనసాగుతారని అందరూ ఆశించారు. 2016లో బౌ డెలవేర్ రాష్ట్ర గవర్నర్‌గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇంతలోనే ఈ విషాదం జరిగింది.




మెగాస్టార్ చిరంజీవి ప్లానింగ్ మామూలుగా లేదుగా..

ప్రభాస్ పెళ్లి జరిగేది అప్పుడే: సంచలన విషయాలు వెల్లడించిన కృషంరాజు ....??

అనుష్క చేయబోయేది బోల్డ్ మూవీనా ?

విజయ్‌ దేవరకొండని ముంచేశారు..!

రోజా "జబర్దస్త్" నవ్వుపై కత్తిమహేష్ షాకింగ్ కామెంట్స్

జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ ఈ విషయాల్లో సేమ్ టు సేమ్... !! ఎప్పుడన్నా గమనించారా.. !!

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>