MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/roja-kathi-mahesh8f14baf3-d003-4d12-be97-b703b334e34a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/roja-kathi-mahesh8f14baf3-d003-4d12-be97-b703b334e34a-415x250-IndiaHerald.jpgనగరి ఎమ్మెల్యే రోజా "జబర్దస్త్" కామెడీ షోను కొన్ని సంవత్సరాలుగా జడ్జ్ చేస్తూ వస్తున్నారు. ఈ షో అనేది సెన్సేషనల్ సక్సెస్ ను అందుకుంది. ఇంకా, ఈ క్రేజ్ కొనసాగుతోంది కూడా. ఈ షో ద్వారా ఎంతోమందికి కమెడియన్ గా లైఫ్ వచ్చింది. అప్పటివరకు మరుగున పడి ఉన్న కమెడియన్స్ ఈ షో ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చారు. roja kathi mahesh;mahesh;jeevitha rajaseskhar;roja;jabardasth;mla;comedy;comedian;success;kathi mahesh;nagari;katthiరోజా "జబర్దస్త్" నవ్వుపై కత్తిమహేష్ షాకింగ్ కామెంట్స్రోజా "జబర్దస్త్" నవ్వుపై కత్తిమహేష్ షాకింగ్ కామెంట్స్roja kathi mahesh;mahesh;jeevitha rajaseskhar;roja;jabardasth;mla;comedy;comedian;success;kathi mahesh;nagari;katthiThu, 21 Jan 2021 15:00:00 GMTనగరి ఎమ్మెల్యే రోజా "జబర్దస్త్" కామెడీ షోను కొన్ని సంవత్సరాలుగా జడ్జ్ చేస్తూ వస్తున్నారు. ఈ షో అనేది సెన్సేషనల్ సక్సెస్ ను అందుకుంది. ఇంకా, ఈ క్రేజ్ కొనసాగుతోంది కూడా. ఈ షో ద్వారా ఎంతోమందికి కమెడియన్ గా లైఫ్ వచ్చింది. అప్పటివరకు మరుగున పడి ఉన్న కమెడియన్స్ ఈ షో ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చారు.

వెండితెరలో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఆ విధంగా "జబర్దస్" షో అనేది ఆడియెన్స్ కు నవ్వులు పువ్వులు పంచుతూనే కమెడియన్స్ జీవితంలో వెలుగులు నింపింది. ఈ షో అనేది రోజాకు ఎంతో ప్రత్యేకమైనది. ఆవిడ సందర్భం దొరికినప్పుడల్లా ఈ షో తన మనసుకు దగ్గరైనదని చెప్పుకొస్తూ ఉంటారు.

మెగాబ్రదర్ నాగబాబు ఈ షో నుంచి తప్పుకున్నా కూడా రోజా ఈ షోను వదలలేదు. ఆవిడ, ఈ షోలో కంటిన్యూ అవుతూనే ఉంది. అటు పొలిటికల్ కెరీర్ ను చూసుకుంటూనే ఇటు జబర్దస్త్ లో జడ్జ్ గా వ్యవహరించడాన్ని కంటిన్యూ చేస్తోంది.

రీసెంట్ గా రోజా ఒకానొక సందర్భంగా తనకు సరైన గౌరవం దక్కలేదని వాపోయింది. ఈ స్టేట్మెంట్ కు కత్తి మహేష్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. "జబర్దస్త్" అనే కామెడీ షోను వదులుకుంటే గౌరవం ఆటోమేటిగ్గా దక్కుతుందని అన్నాడు. కత్తిమహేష్ రోజాపై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం "జబర్దస్త్" టీమ్ ను షాక్ కి గురిచేసింది. "జబర్దస్త్" షోను బీ గ్రేడ్ షోగా కత్తి మహేష్ పేర్కొనడం పట్ల కొందరు అసంతృప్తికి గురయ్యారంటున్నారు విశ్లేషకులు.

ఇదిలా ఉంటే, ఎమ్మెల్యేగా రొజాగారు ఎన్ని మంచిపనులు చేసినా హైలైట్ కావడంలేదంటూ, అందుకు కారణం రొజాగారు "జబర్దస్త్" షోలో వెకిలి కామెడీకి నవ్వడమే అంటూ తనదైన శైలిలో విశ్లేషణనిచ్చాడు మహేష్. కత్తి మహేష్ కామెంట్స్ పై కామెడీని ఇష్టపడేవారు ఫైరవుతున్నారు. 'జబర్దస్త్' షో అనేది ఎంతో మందికి అన్నం పెట్టిందని అలాగే ఈ షో ద్వారా చాలా మంది తమ టెన్షన్స్ ను మరచిపోతున్నారని కొందరి అభిప్రాయం. మరికొందరు, కత్తిమహేష్ మాటల్లో నిజముందని అంగీకరిస్తున్నారు.  


ఇంగ్లండ్‌ను కూడా చిత్తు చేస్తేనే.. టీమిండియా ముందు అగ్ని పరీక్ష!

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఐదువేల పింఛ‌న్‌తో అయ్య‌వారికి శ‌ఠ‌గోపం.. జ‌గ‌న‌న్న మార్కు రాజ‌కీయం..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌.. నాడు-నేడు.. నిర్వీర్యం దిశ‌గా అడుగులు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>