SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsde35118e-18ce-4c0a-a92e-fb60982f1ae9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsde35118e-18ce-4c0a-a92e-fb60982f1ae9-415x250-IndiaHerald.jpgక్రికెట్ అంటేనే ఒక సందడి.. స్టేడియంలో అభిమానులు చేసే హంగామా.. అల్లరి.. అంతా ఇంతా కాదు. అభిమానులను చూస్తూ ఆటగాళ్లు చేసే అభివాదాలు తమ అభిమాన క్రికెటర్లను చూస్తూ ఫ్యాన్స్ చేసే కోలాహలం.. ఇవన్నీ కూడా ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. దాదాపు అవకాశం ఉన్న ప్రతి క్రికెట్ అభిమాని స్టేడియంలో మ్యాచ్ చూడడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు. ఎందుకంటే తమ అభిమాన జట్టును, తమ అభిమాన క్రికెటర్ ను దగ్గరనుండి చూస్తూ చెప్పలేనంత అనుభూతికి లోనవుతూ ఉంటారు. sports news;cricket;india;australia;england;bcci;chennai;good news;good newwz;allariక్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇక స్టేడియంలో సందడి..!!క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇక స్టేడియంలో సందడి..!!sports news;cricket;india;australia;england;bcci;chennai;good news;good newwz;allariThu, 21 Jan 2021 17:00:00 GMTక్రికెట్ అంటేనే ఒక సందడి.. స్టేడియంలో అభిమానులు చేసే హంగామా.. అల్లరి.. అంతా ఇంతా కాదు. అభిమానులను చూస్తూ ఆటగాళ్లు చేసే అభివాదాలు తమ అభిమాన క్రికెటర్లను చూస్తూ ఫ్యాన్స్ చేసే కోలాహలం.. ఇవన్నీ కూడా ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. దాదాపు అవకాశం ఉన్న ప్రతి క్రికెట్ అభిమాని స్టేడియంలో మ్యాచ్ చూడడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు. ఎందుకంటే తమ అభిమాన జట్టును, తమ అభిమాన క్రికెటర్ ను దగ్గరనుండి చూస్తూ చెప్పలేనంత అనుభూతికి లోనవుతూ ఉంటారు.

అయితే  గత ఏడాది కాలంగా కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూసి ఆస్వాదించే అనుభూతిని కోల్పోయారు. అయితే తాజాగా బీసీసీఐ క్రికెట్ అభిమానులకు శుభవార్త వినిపించింది. కరోనా మహమ్మారి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించే దిశగా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. భారత్ వేదికగా జరుగనున్న ఇండియా- ఇంగ్లండ్ సిరీస్‌కు క‌నీసం 50 శాతం మంది ప్రేక్ష‌కుల‌ను స్టేడియంలోకి అనుమతించాలని భావిస్తోంది. ఆయా రాష్ట్రాలలో మాత్రం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో 20 నుంచి 25 శాతం వరకు ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉంది.

ఈ సిరీస్ జ‌రిగే అన్ని స్టేడియాల్లో ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించాల‌ని ప్లాన్ చేస్తోంది. కరోనా కార‌ణంగా ఈ టూర్ మొత్తాన్ని కేవ‌లం మూడు స్టేడియాల‌కే ప‌రిమితం చేశారు. ఇందులో చెన్నై, అహ్మ‌దాబాద్‌, పుణె వంటి నగరాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ జట్టుతో మొత్తం నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వ‌న్డేలు జ‌ర‌గ‌నున్నాయి.గత ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లను అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఆ తర్వాత కరోనా మహమ్మారి దేశంలో ప్రవేశించడంతో అత్యంత ప్రజాదరణ కలిగిన ఐపీఎల్ కూడా ప్రేక్షకులు లేకుండా అరబ్ కంట్రీ లో జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లను వీక్షించడానికి క్రికెట్ అభిమానులు సిద్ధమవుతున్నారు. 


వ్యక్తిగత, రాజకీయ జీవితంలో ఆటుపోట్లు..!

మెగాస్టార్ చిరంజీవి ప్లానింగ్ మామూలుగా లేదుగా..

ప్రభాస్ పెళ్లి జరిగేది అప్పుడే: సంచలన విషయాలు వెల్లడించిన కృషంరాజు ....??

అనుష్క చేయబోయేది బోల్డ్ మూవీనా ?

విజయ్‌ దేవరకొండని ముంచేశారు..!

రోజా "జబర్దస్త్" నవ్వుపై కత్తిమహేష్ షాకింగ్ కామెంట్స్

జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ ఈ విషయాల్లో సేమ్ టు సేమ్... !! ఎప్పుడన్నా గమనించారా.. !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>