MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun0cfaaa41-b8a9-463e-8cba-cb738be83012-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun0cfaaa41-b8a9-463e-8cba-cb738be83012-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమాలో నటిస్తున్నాడు..కేవలం తెలుగులోనే కాకుండా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల కానుంది ఈ సినిమా. దీనికోసం కథలో కూడా కొన్ని మార్పులు చేశాడు సుకుమార్. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ కథ ఉంటుందని.. ఆ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది అని చెబుతున్నాడు దర్శకుడు.ఇందులో లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. రష్మిక మందన హీరోయిన్. కథలో ఈమె పాత్ర కూడా కీలకంగా ఉండబోతుంది. పూర్తిగా డి గ్లామరస్ పాత్రలో నటిస్తుంది రష్మిక. దానికిallu arjun;kumaar;allu arjun;rashmika mandanna;santoshi;sukumar;india;godavari river;cinema;telugu;tamil;village;kannada;car;hindi;industry;blockbuster hit;driver;fort;heroine;arjun 1;ala vaikuntapuramloఅల్లు అర్జున్ కారును ఆపిన గిరిజనులు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??అల్లు అర్జున్ కారును ఆపిన గిరిజనులు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??allu arjun;kumaar;allu arjun;rashmika mandanna;santoshi;sukumar;india;godavari river;cinema;telugu;tamil;village;kannada;car;hindi;industry;blockbuster hit;driver;fort;heroine;arjun 1;ala vaikuntapuramloThu, 21 Jan 2021 18:00:00 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమాలో నటిస్తున్నాడు..కేవలం తెలుగులోనే కాకుండా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో  విడుదల కానుంది ఈ సినిమా. దీనికోసం కథలో కూడా కొన్ని మార్పులు చేశాడు సుకుమార్. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ కథ ఉంటుందని.. ఆ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది అని చెబుతున్నాడు దర్శకుడు.ఇందులో లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. రష్మిక మందన హీరోయిన్. కథలో ఈమె పాత్ర కూడా కీలకంగా ఉండబోతుంది. పూర్తిగా డి గ్లామరస్ పాత్రలో నటిస్తుంది రష్మిక. దానికి తోడు రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్..
 
అల వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత అల్లు అర్జున్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి..ఇక కరోనాకు ముందు ఈ చిత్ర షూటింగ్‌ని శేషాచలం అడవులలో ప్లాన్ చేయగా, వైరస్ వలన ప్లానింగ్ అంతా మారింది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం వై.రామవరం మండలాల పరిధిలో ఉన్న తాళ్లపాలెం కోట పాముబొక్క తదితర గ్రామాల సరిహద్దుల్లోను షూటింగ్ చేస్తున్నారు. గంధపు చెక్కల నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కాబట్టి మూవీ షూటింగ్ దాదాపు అటవీ ప్రాంతాల్లోనే చేయనున్నారు. అయితే చిత్ర యూనిట్ ప్రతి రోజు రంపచోడవరం నుండి పందిరిమామిడి మీదుగా కోట గ్రామానికి వెళ్తున్నారు.

 ఈ విషయాన్ని గమనించిన 500 మంది గిరిజనులు ఓ రోజు బన్నీ కారుకు అడ్డుపడ్డారు.ఆయనతో తమ గోడు వెళ్ళబుచ్చుకున్నారు. లొకేషన్‌కు వస్తే మమ్మల్ని పంపిచేస్తున్నారు. మేం మీ అభిమానులం అంటూ వారు తమ ఆవేదన చెప్పుకునే సరికి, బన్నీ కారు టాప్ ఎక్కి వారితో సెల్ఫీలు దిగాడు. అనంతరం కర్పూరంతో హారతులు ఇచ్చారు. గుమ్మడికాయలతో దిష్టి తీశారు. బన్నీ.. బన్నీ.. అంటూ అరిచారు. మారుమూల గ్రామంలో తమకు ఇంత ఆదరణ, అభిమానం దక్కే సరికి అల్లు అర్జున్ కూడా చాలా సంతోషించారు...!!




వ్యక్తిగత, రాజకీయ జీవితంలో ఆటుపోట్లు..!

బాలయ్యని నందమూరి హీరోలు కూడా ఇలా వాడుకోలేదు..!

బుల్లి తెర మెగాస్టార్ “ప్రభాకర్” కూతురు గురించి ఈ విషయాలు తెలుసా.?

ఎడిటోరియల్ : అందరి నిందలూ బాబు మీదే ? 'కమ్మ 'టి దెబ్బ ?

మెగాస్టార్ చిరంజీవి ప్లానింగ్ మామూలుగా లేదుగా..

ప్రభాస్ పెళ్లి జరిగేది అప్పుడే: సంచలన విషయాలు వెల్లడించిన కృషంరాజు ....??

అనుష్క చేయబోయేది బోల్డ్ మూవీనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>