Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/constipation97c03b87-8d11-4560-8a4f-d81cdfc11d32-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/constipation97c03b87-8d11-4560-8a4f-d81cdfc11d32-415x250-IndiaHerald.jpgమలబద్దక సమస్య ఉన్నవాళ్లు ఎంత బాధ అనుభవిస్తున్నారో వారికి మాత్రమే తెలుసు. మలబద్ధకము వయసుతో సంబంధం లేకుండా అందరినీ బాధిస్తుంటుంది. రావడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి.మనం తినే ఆహారం కూడా మలబద్ధకానికి దారితీయవచ్చు.మంచి ఆహారం తీసుకోవడం వల్ల, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల, ఈ సమస్య నుండి బయటపడవచ్చు.కొన్ని ఇంటి చిట్కాలను తో మలబద్దకానికి చెక్ పెట్టొచ్చు, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మంచి నీళ్ళు బాగా తాగాలి, కనీసం రోజుకు మూడు లేదా నాలుగు లీటర్లు నీళ్లు తాగడం వల్ల మలబద్దక సమస్య నుండి ఉపశమనం constipation;cheque;aqua;butter;ghee;coffee;buttermilk;dhaniya powderఇంటి చిట్కాల తో మలబద్దకానికి చెక్ పెట్టొచ్చు...!ఇంటి చిట్కాల తో మలబద్దకానికి చెక్ పెట్టొచ్చు...!constipation;cheque;aqua;butter;ghee;coffee;buttermilk;dhaniya powderThu, 21 Jan 2021 02:00:00 GMTచెక్ పెట్టొచ్చు, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 మంచి నీళ్ళు బాగా తాగాలి, కనీసం రోజుకు మూడు లేదా నాలుగు లీటర్లు నీళ్లు తాగడం వల్ల మలబద్దక సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

 మలబద్ధకము నుంచి ఉపశమనం పొందడానికి, అరటి పండ్లు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అరటి పండులో ఉండే పోషకాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి. కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు అరటి పండ్లు తినడం చాలా మంచిది. అలా అని ఎక్కువ తినకూడదు.

వేడి పాలు తాగడం వల్ల కూడా మలబద్ధకాన్ని జయించవచ్చు. అలాగే అన్నంలోకి ధనియాల పొడి కలుపుకొని తినడం వల్ల కూడా మలబద్ధకం రాకుండా ఉంటుంది.

 ఉదయాన్నే మజ్జిగ తేట తాగడం వల్ల మలబద్దకం నుండి ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే మజ్జిగ లో క్యాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల సుఖ విరోచనాలు అవుతాయి.

 మలబద్దకం రాకుండా ఉండటానికి,తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు,తేనా ఎండు ఫలాలు మరియు వెన్న, నెయ్యి పాల పదార్థాలు అన్నింటినీ ఆహారంలో భాగం చేసుకోవాలి.

మలబద్దకానికి పండ్లు కూడా బాగా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ పండ్లను తీసుకోవాలి. అవి జామ పండ్లు,యాపిల్,క్యారెట్ రసం, బత్తాయి పళ్ళు క్యాబేజీ, బొప్పాయి, చిలగడ దుంపలు, వీటన్నింటినీ రోజులో ఒక్కసారైనా తీసుకోవడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇవే కాకుండా గోధుమలు,కొబ్బరి వంటివి కూడా తీసుకోవాలి.

కాఫీ, టీ తీసుకోవడం వల్ల మల బద్ధకం పెరుగుతుంది.కాబట్టి వీలైనంతవరకూ వీటిని తగ్గించుకోవడం చాలా మంచిది.

పీచుపదార్ధము ఎక్కువగా ఉండే ఆహారాలను వేసుకోవడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి మూత్రం సాఫీగా జరుగుతుంది. దీనివల్ల మలబద్ధకం సమస్య ఉండదు.


'క్యాష్' లో సుమకి దిమ్మతిరిగే పంచ్ వేసిన స్టూడెంట్.. అవాక్కైన యాంకర్..?

ఆ సామాజిక వర్గం కూరలో కరివేపాకా .... వైసీపీ మీద గుస్సా..?

ప్రపంచానికి మరో పెను ముప్పు...?

తిరుపతిలో వైసీపీకి పెద్ద గండమే!

తెలంగాణాలో నిరుద్యోగ భృతి రావాలంటే... కచ్చితంగా...!

ఏపీకి ప్రత్యేక హోదా ....ఇంకా గుర్తుందా...?

రాజధాని రైతులపై గల కేసులను కొట్టేసిన హైకోర్ట్...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>