PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/brahmins-jagan10965dcc-1a06-4ab8-8095-d4dbe0ba5bb6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/brahmins-jagan10965dcc-1a06-4ab8-8095-d4dbe0ba5bb6-415x250-IndiaHerald.jpgఇక‌, పార్టీలో మాత్రం కీల‌క‌మైన ప‌దవుల్లో మెజారిటీగా రెడ్డి సామాజిక వ‌ర్గానికే కేటాయించారు. నిజానికి బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు ఉన్న‌దే త‌క్కువ‌. ఉన్న‌వారిలోనూ ప్ర‌ధానంగా ఎలాంటి ప్రాధాన్యం ద‌క్కించుకోని వారు మ‌రింత మంది ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ తూర్పు నుంచి ఓడిపోయిన‌.. విజ‌య‌నిర్మ‌ల‌కు నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప‌ద‌వినీ ఇవ్వ‌లేదు. బాప‌ట్ల నుంచి వ‌రుస‌గా రెండు సార్లు గెలిచిన కోన ప్ర‌భాక‌ర్ రావుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వ‌లేదు. brahmins jagan;tiru;vishnu;backward classes;vishakapatnam;mla;minister;letter;ycp;reddy;partyబ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!brahmins jagan;tiru;vishnu;backward classes;vishakapatnam;mla;minister;letter;ycp;reddy;partyThu, 21 Jan 2021 09:51:00 GMTఅధికార పార్టీ వైసీపీలో అగ్ర‌వ‌ర్ణ బ్రాహ్మ‌ణుల‌కు ప్రాధాన్యం ఎంత ఉంది?  వైసీపీలో రెడ్డి, కాపు, క్ష‌త్రియ‌, బీసీ ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌తో పోల్చుకుంటే.. బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు ఎంద‌రు ఉన్నారు?  అంటే.. ప్ర‌శ్నార్థ‌కంగా నే మారింది.  రెడ్లు, ఇత‌ర సామాజిక వ‌ర్గాల డామినేష‌న్‌తో బ్రాహ్మ‌ణుల‌కు పార్టీలో ప‌ద‌వులు అంద‌ని ద్రాక్ష‌గానే మారాయి. పైగా ఉన్న ఒక‌టి అరా ప‌ద‌వులు కూడా త‌మ కు అత్యంత అనుంగులుగా ఉన్న‌వారికో.. లేదా ఇప్ప‌టికే కీల‌క‌మైన ప‌ద‌విలో ఉన్న‌వారికో ఇచ్చేస్తున్నారు. దీంతో వైసీపీలో బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్యం లేకుండా పోయింది.

అయితే.. గుడ్డిలో మెల్ల న‌యం అన్న‌ట్టుగా.. ఉన్న అన్ని పార్టీల‌తోనూ పోల్చుకుంటే.. వైసీపీనే బెట‌ర్ అని చెప్ప‌క‌త‌ప్ప‌దు. ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుకు.. బ్రాహ్మ‌ణ ‌కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు. ఇక‌, పార్టీలో మాత్రం కీల‌క‌మైన ప‌దవుల్లో మెజారిటీగా రెడ్డి సామాజిక వ‌ర్గానికే కేటాయించారు. నిజానికి బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు ఉన్న‌దే త‌క్కువ‌. ఉన్న‌వారిలోనూ ప్ర‌ధానంగా ఎలాంటి ప్రాధాన్యం ద‌క్కించుకోని వారు మ‌రింత మంది ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ తూర్పు నుంచి ఓడిపోయిన‌.. విజ‌య‌నిర్మ‌ల‌కు నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప‌ద‌వినీ ఇవ్వ‌లేదు.

బాప‌ట్ల నుంచి వ‌రుస‌గా రెండు సార్లు గెలిచిన కోన ప్ర‌భాక‌ర్ రావుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వ‌లేదు. నిజానికి రాజకీయంగా బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం చైత‌న్య‌మే త‌క్కువ‌గా ఉంద‌నేది వాస్త‌వం. ఉన్న‌వారిలోనూ గుర్తింపు కోసం అల్లాడుతున్న‌వారు కూడా ఉన్నారు. ఓటు బ్యాంకు విష‌యానికి వ‌స్తే.. మాత్రం అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని చెప్పే పార్టీలు ప‌ద‌వుల విష‌యానికి వ‌స్తే మాత్రం దాట‌వేత ధోర‌ణిని అవ‌లంబిస్తున్నాయి. తిరుమ‌ల తిరుప‌తి మాజీ ప్ర‌ధానార్చ‌కుడి విష‌యం తీసుకుంటే.. ఆయ‌న‌ను తిరిగి నియ‌మిస్తామ‌ని.. వైసీపీ నేత‌లు ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌ను త్రిశంకు స్వ‌ర్గంలోనే ఉంచారు. ఇలాంటి ప‌రిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలానే ఉండ‌డం గ‌మ‌నార్హం. 


డయాబెటిస్ నియంత్రణలో దాల్చిన చెక్క,, వెల్లుల్లి ముఖ్యపాత్ర..??

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

షాకింగ్: తెరాసకు ఇద్దరు మంత్రుల రాజీనామా...???

సోలార్ విద్యుత్‌లో సింగ‌రేణి రికార్డులు....డిసెంబ‌ర్ నాటికి 300 మెగావాట్లు..

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!

విదేశీ యువతి కోరడంతో బట్టలిప్పిన యువకుడు.. కానీ అంతలోనే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>