PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/biden118fcad8-6c5b-494b-9536-2f011aa9b12a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/biden118fcad8-6c5b-494b-9536-2f011aa9b12a-415x250-IndiaHerald.jpgఆయనకేంటి టాప్ చైర్ లో కూర్చున్నాడు అని ఎవరైనా అనుకోవచ్చు. అలాగే ఎవరైనా ఉన్నత స్థానంలో ఉంటే దిగువ నుంచి చూసే వారు ఇలాగే భావిస్తారు. కానీ ఎవరికీ అత్యున్నత పీఠాలు అంత సులువుగా దక్కవు. దాని కోసం వారు చేయాల్సిన పరిశ్రమ. పడిన బాధలు కష్టాలు తెర వెనక ఎన్నో ఉంటాయి. అమెరికాకు కొత్త ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ ఈ సీటు దక్కించుకోవడానికి ఎంతగానో శ్రమించారు. ఆయన వయసు ఇపుడు డెబ్బై ఏడేళ్ళు. biden;jeevitha rajaseskhar;korcha;industries;cancer;wife;yevaruఅగ్ర రాజ్యాధినేత జీవితంలో అంతులేని విషాదం...?అగ్ర రాజ్యాధినేత జీవితంలో అంతులేని విషాదం...?biden;jeevitha rajaseskhar;korcha;industries;cancer;wife;yevaruThu, 21 Jan 2021 10:00:00 GMT
అమెరికాకు కొత్త ప్రెసిడెంట్  గా బాధ్యతలు స్వీకరించిన జో  బైడెన్ ఈ సీటు దక్కించుకోవడానికి ఎంతగానో శ్రమించారు. ఆయన వయసు ఇపుడు డెబ్బై ఏడేళ్ళు. నిజానికి ఈ వయసు వచ్చిన వారు మనకెందుకీ బరువు బాధ్యతలు అంటూ వేదాంతంలోకి జారుకుంటారు. ఇక ఇంట్లో ఉన్న వారే వారిని పట్టించుకోని పరిస్థితి. కానీ జో బైడెన్ మాత్రం అలా కాదు, జీవితంలో చివరి ఊపిరి వరకూ తానేంటో నిరూపించుకోవాలనే తపన పడుతూ వస్తున్నారు.

అందుకే ఆయనకు ఈ వయసులో ఈ పదవి దక్కింది. అమెరికాకు 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ జీవితం పూలపానుపు కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి కష్టాలే పడ్డారు. ఇక ఆయన ఇపుడు ప్రమాణం చేసిన వేళ ఆయన వెనక  సొంత కుటుంబం ఎవరున్నారు వారి పరిస్థితి ఏంటి అన్నది చూస్తే ఎవరూ లేరు అని అర్ధమవుతుంది.

ఆయన భార్య, కుమార్తె ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన మెదడు క్యాన్సర్ తో పెద్ద కుమారుడు చనిపోయాడు. ఇక రెండవ కుమారుడు మత్తు పదార్ధాలకు బానిస అయి నౌకాదళంలో ఉద్యోగం కోల్పోయాడు. ఇక స్వయంగా బైడెన్ కి కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయన ఫేషియల్ పాల్సీ అనే ముఖ పక్ష‌వాతం ఉందిట. మరి ఇన్ని రకాలైన ఇబ్బందులు బాధలు ఉన్నప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిగా పోరాడి ప్రపంచంలోనే అగ్ర రాజ్యంగా ఉన్న అమెరికాకు కొత్త ప్రెసిడెంట్ గా బైడెన్ నెగ్గాడంటే ఆయనకు జేజేలు చెప్పాల్సిందే. ఆయన ఎందరికో స్పూర్తి కూడా.






డయాబెటిస్ నియంత్రణలో దాల్చిన చెక్క,, వెల్లుల్లి ముఖ్యపాత్ర..??

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

షాకింగ్: తెరాసకు ఇద్దరు మంత్రుల రాజీనామా...???

సోలార్ విద్యుత్‌లో సింగ‌రేణి రికార్డులు....డిసెంబ‌ర్ నాటికి 300 మెగావాట్లు..

బ్రాహ్మ‌ణ ఘోష‌: జ‌గ‌న్ పాల‌న‌లో అర్చ‌కులపై ఉక్కుపాదం.. ఇవే సాక్ష్యాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>