PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల పేరుతో ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ప్రజలను కొన్ని విధాలుగా వేధిస్తున్నారని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో పెట్రోల్ రేటు 92 రూపాయలు గా ఉంది. దీనితో ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే రోడ్ల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం అయింది. కానీ సంక్షేమ కార్యక్రమాల పేరుతో ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు కొన్ని నిర్ణయాలను వివాదాస్పదంగా తీసుకుంటున్నారు. jagan,ycp,ap;bhavana;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;petrol;partyజగనోరు అప్పట్లో చెప్పిన మాట మర్చిపోయారా...?జగనోరు అప్పట్లో చెప్పిన మాట మర్చిపోయారా...?jagan,ycp,ap;bhavana;telugu desam party;jagan;andhra pradesh;telugu;chief minister;petrol;partyThu, 21 Jan 2021 15:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల పేరుతో ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ప్రజలను కొన్ని విధాలుగా వేధిస్తున్నారని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో పెట్రోల్ రేటు 92 రూపాయలు గా ఉంది. దీనితో ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే రోడ్ల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం అయింది. కానీ సంక్షేమ కార్యక్రమాల పేరుతో ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు కొన్ని నిర్ణయాలను వివాదాస్పదంగా తీసుకుంటున్నారు.

గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్కువగా పెట్రోల్ ధరలు ఉండేవి అని అసెంబ్లీలో ఆరోపించిన ఆయన ఇప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నా సరే పెట్రోల్ ధరలు తగ్గించకుండా భారీగా పెంచడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనికి అనేక కారణాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్నా సరే ప్రజలలో మాత్రం ఆగ్రహం వ్యక్తం అవుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మద్యం ధరలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉన్నాయి. మద్యపాన నిషేధం విషయంలో ముఖ్యమంత్రి జగన్ మద్యం దశలవారీగా రద్దు చేయకుండా దశలవారీగా పెంచే కార్యక్రమాలు చేస్తున్నారు.

దీని కారణంగా ప్రజలకు జగన్ పై నమ్మకం పోతుంది అనే  వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఈ మధ్య కాలంలో ప్రజలపై పన్నులు విధించే విషయంలో కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీని కారణంగా ఆయన ప్రజల్లో చులకన అవుతున్నారు అనే భావన ఉంది. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రభుత్వం ఎలా పరిపాలించిన సరే ప్రజల మీద పెద్దగా భారం పడలేదు అనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ కార్యక్రమాల పేరుతో ప్రజల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు అని ఆవేదన ఉంది. అప్పులు కూడా పెరిగిపోవడంతో ఇప్పుడు ప్రజల్లో జగన్ నమ్మకం కోల్పోతున్నారు అని అంటున్నారు.


ఇంగ్లండ్‌ను కూడా చిత్తు చేస్తేనే.. టీమిండియా ముందు అగ్ని పరీక్ష!

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఐదువేల పింఛ‌న్‌తో అయ్య‌వారికి శ‌ఠ‌గోపం.. జ‌గ‌న‌న్న మార్కు రాజ‌కీయం..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌.. నాడు-నేడు.. నిర్వీర్యం దిశ‌గా అడుగులు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>