MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-rrrab50d046-a8c6-40e0-acad-f58b789b595c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-rrrab50d046-a8c6-40e0-acad-f58b789b595c-415x250-IndiaHerald.jpg రాజమౌళి సాధారణంగా తన సినిమాలకు సంబంధించిన విషయాలను బయటకు లీక్ చేయడు. ఆఖరికి తన మూవీలో నటించే నటీనటులు ఎంత గొప్ప వారైనా సరే వారు షూటింగ్ స్పాట్ లో సెల్ ఫోన్స్ ను తెచ్చుకోవడానికి కూడ అంగీకరించడు.అలాంటి రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ క్లైమాక్స్ షూట్ ప్రారంభం కాబోతోంది అంటూ అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ పాత్రలను పోషిస్తున్న జూనియర్ చరణ్ లు చేయిచేయి కలుపుతున్న ఒక పోష్టర్ ను విడుదల చేసి ఈమూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది అన్న సందేశం ఇవ్వడం వెనుక జక్కన్న మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది అని అంటున్నారు. ఈమూవీని rajamouli rrr;beauty;ram charan teja;alia bhatt;jr ntr;kranthi;kranti;ram pothineni;rajamouli;dussehra;makar sakranti;alluri sitarama raju;komaram bheem;rrr movie;sankranthi;industry;vijayadashami;vegetable market;heroine;british;indianఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ న్యూస్ తో మార్కెట్ ను ఓపెన్ చేసిన రాజమౌళి !ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ న్యూస్ తో మార్కెట్ ను ఓపెన్ చేసిన రాజమౌళి !rajamouli rrr;beauty;ram charan teja;alia bhatt;jr ntr;kranthi;kranti;ram pothineni;rajamouli;dussehra;makar sakranti;alluri sitarama raju;komaram bheem;rrr movie;sankranthi;industry;vijayadashami;vegetable market;heroine;british;indianThu, 21 Jan 2021 08:13:30 GMTరాజమౌళి సాధారణంగా తన సినిమాలకు సంబంధించిన విషయాలను బయటకు లీక్ చేయడు. ఆఖరికి తన మూవీలో నటించే నటీనటులు ఎంత గొప్ప వారైనా సరే వారు షూటింగ్ స్పాట్ లో సెల్ ఫోన్స్ ను తెచ్చుకోవడానికి కూడ అంగీకరించడు.


అలాంటి రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ క్లైమాక్స్ షూట్ ప్రారంభం కాబోతోంది అంటూ అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ పాత్రలను పోషిస్తున్న జూనియర్ చరణ్ లు చేయిచేయి కలుపుతున్న ఒక పోష్టర్ ను విడుదల చేసి ఈమూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది అన్న సందేశం ఇవ్వడం వెనుక జక్కన్న మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది అని అంటున్నారు. ఈమూవీని వేగంగా పూర్తి చేసి ఈసంవత్సరం దసరా కు విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్.


అయితే చాలామంది బయ్యర్లు మాత్రం ఈమూవీని ఈఏడాది దసరా సీజన్ లో కంటె వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కు విడుదల చేస్తే రికార్డు కలక్షన్స్ వస్తాయి అంటూ రాయబారాలు చేస్తున్నట్లు టాక్. కానీ రాజమౌళి మాత్రం ఈమూవీని ఎట్టి పరిస్థితులలోను ఈసంవత్సరం విడుదల చేయాలి అన్న పట్టుదలతో అడుగులు వేస్తూ బయ్యర్లలో పోటీ పెంచడానికి ఇలా క్లైమాక్స్ మొదలుకాబోతోంది అన్నసంకేతాలు ఇచ్చి ఉంటాడు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ క్లైమాక్స్ చిత్రీకరణ 30 రోజులు జరుగుతుందని ఈ క్లైమాక్స్ సీన్స్ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో సుమారు 20 నిముషాలు ఉంటాయి కాబట్టి ఈ క్లైమాక్స్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాజమౌళి ఆలోచన అని అంటున్నారు. ఈ క్లైమాక్స్ షూట్ ముగిసిన తరువాత రామ్ చరణ్ అలియా భట్ లపై ఒక డ్రీమ్ సాంగ్ ఆతరువాత కొన్ని మైనర్ సీన్స్ చిత్రీకరణ ఉంటుంది అని అంటున్నారు. అయితే ఈమూవీలో నటించవలసిన ఒలివియా మోరిస్ ఇంకా షూటింగ్ స్పాట్ కు రాని పరిస్థితులలో ఇంతకీ ఆమె పాత్రను జక్కన్న కొనసాగిస్తున్నాడా లేదంటే మన ఇండియన్ హీరోయిన్స్ లోనే ఎవరినైనా బ్రిటీష్ బ్యూటీ గా చూపెడుతున్నాడా అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో కొనసాగుతున్నాయి..







టీడీపీ నేత కళా వెంకట్రావు విడుదల

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పీఠాలు-మ‌ఠాల‌తో జ‌గ‌న్ పాలిటిక్స్‌.. బ్రాహ్మ‌ణులు ప‌ట్ట‌రా ?

చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ న్యూస్.. రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్..!!

సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోబోతున్న హీరో వరుణ్!!

జగన్ ను బిజెపిలో ఆ ఇద్దరు ఇబ్బంది పెడతారా...?

చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వరు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>