MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pusha-moviea498c6c9-a3b4-4a59-8b76-8119bfe06231-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pusha-moviea498c6c9-a3b4-4a59-8b76-8119bfe06231-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా పుష్ప. పాన్ ఇండియా మూవీ గా అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపద్యంలో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకునే కథా కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకాభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. pushpa movie latest news;allu arjun pushpa;kumaar;allu arjun;devi sri prasad;prasad;raj;rashmika mandanna;sukumar;india;godavari river;bollywood;tollywood;district;east;cinema;east godavari;blockbuster hit;hero;heroine;success;mythri movie makers;arjun 1;mass'పుష్ప' మూవీ లో మేజర్ హైలైట్స్ ఇవే .....ఫ్యాన్స్ కి ఇక పూనకాలే ....??'పుష్ప' మూవీ లో మేజర్ హైలైట్స్ ఇవే .....ఫ్యాన్స్ కి ఇక పూనకాలే ....??pushpa movie latest news;allu arjun pushpa;kumaar;allu arjun;devi sri prasad;prasad;raj;rashmika mandanna;sukumar;india;godavari river;bollywood;tollywood;district;east;cinema;east godavari;blockbuster hit;hero;heroine;success;mythri movie makers;arjun 1;massThu, 21 Jan 2021 23:50:50 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా పుష్ప. పాన్ ఇండియా మూవీ గా అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో  రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపద్యంలో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకునే కథా కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై  ప్రేక్షకాభిమానుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి.

కాగా ఈ మూవీలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే మాస్ పాత్ర చేస్తుండగా ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు విలన్ పాత్ర చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. దీని అనంతరం తదుపరి షెడ్యూల్ ని హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించనట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రధాన హైలైట్స్ ఇవే అంటూ ప్రస్తుతం ఒక వార్త పలు టాలీవుడ్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. దాని ప్రకారం మూవీ లో హీరో ఇంట్రడక్షన్ సీన్ నెవర్ బిఫోర్ నెవర్ ఎగైన్ అనే రేంజ్లో ఉంటుందని, ఆతర్వాత ఇంటర్వెల్ బ్లాక్ ఎంతో అద్భుతంగా ఉండటంతో పాటు అది సెకండాఫ్ పై ప్రేక్షకుల్లో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తుందని అంటున్నారు.

అనంతరం వచ్చే సెకండాఫ్ లో రెండు భారీ చేజింగ్ సన్నివేశాలు ఒక యాక్షన్ సన్నివేశం ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ వంటివి ఈ సినిమా యొక్క ప్రధాన హైలెట్స్ అని, ఇక ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ అందిస్తున్న మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మరొక లెవల్లో ఉండనుందని అంటున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం పుష్ప సినిమా హైలైట్స్ ఇవే అంటూ ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే రేపు రిలీజ్ తర్వాత ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకునే అవకాశం గట్టిగా కనపడుతోందని అంటున్నారు విశ్లేషకులు. మరి అది ఎంతవరకు జరుగుతుందో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఎంతవరకు ఈ మూవీ ఐ ఫీస్ట్ గా నిలుస్తుందో తెలియాలి అంటే ఈ ఏడాది సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే.....!!




బిడెన్ మొదటి హెచ్చరిక..కారణాలు చెప్పను..స్పాట్ లోనే..

కేసీఆర్ స్థానంలో ఈటెల, పద్మారావు కాకుండా 'కేటీఆర్' ఎందుకు సీఎం కావాలి?

కష్టాల్లో బాలీవుడ్.. టాలీవుడ్ ఆపన్నహస్తం కోసం..!

జగనోరూ.. పంతం కాదు అభివృద్ధి కావాలి..!!

జగన్ గెలిచేందుకు 24 గంటల గడువే!

తమన్నా ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లు ఇంటరెస్టింగ్ ?

'ఆర్ఆర్ఆర్' లో కనిపించని మెగా హీరో ఆయనే ... ఎవరో తెలిస్తే షాక్ అవుతారు ....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>