PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/accident240a4706-7758-448b-ab08-d58c1eea1e5d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/accident240a4706-7758-448b-ab08-d58c1eea1e5d-415x250-IndiaHerald.jpgరోడ్డు ప్రమాదంలో చాల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేటలో ఆటో – కంటైనర్‌ ఢీకొనడంతో తొమ్మిది మంది మృతి చెందగా, మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక మృతి చెందిన వారు చింతబావికి చెందిన రోజువారీ కూలీలుగా గుర్తించారు. accident;auto;police;nalgonda;village;driver;local language;devarakondaనల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..!?నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం..!?accident;auto;police;nalgonda;village;driver;local language;devarakondaThu, 21 Jan 2021 21:00:00 GMTనల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేటలో ఆటో – కంటైనర్‌ ఢీకొనడంతో తొమ్మిది మంది మృతి చెందగా, మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక  మృతి చెందిన వారు చింతబావికి చెందిన రోజువారీ కూలీలుగా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదానికి ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు లారీ అతివేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆటోలో లెక్కకు మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, అజాగ్రత్తగా నడిపి ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టెక్ చేసే క్రమంలో లారీని డీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికుల చెబుతున్నారు. ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు ఐదుగురు మహిళలు మృతి చెందారు.

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కూలీల కుటుంబాల్లో ఈ ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. మృతులంగా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇలా ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. జరుగుతూనే ఉన్నాయి. వాహనదారుల నిర్లక్ష్యం, అతివేగం, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రయాణాల్లో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రమాదాలు జరుగకుండా పోలీసులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదాలు జరుగుతూ రహదారులు రక్తసిక్తంగా మారుతున్నాయి.


కేసీఆర్ ని పచ్చి బూతులు తిడుతున్నా సరే చూస్తుంటారే...?`

కేసీఆర్ స్థానంలో ఈటెల, పద్మారావు కాకుండా 'కేటీఆర్' ఎందుకు సీఎం కావాలి?

కష్టాల్లో బాలీవుడ్.. టాలీవుడ్ ఆపన్నహస్తం కోసం..!

జగనోరూ.. పంతం కాదు అభివృద్ధి కావాలి..!!

జగన్ గెలిచేందుకు 24 గంటల గడువే!

తమన్నా ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లు ఇంటరెస్టింగ్ ?

'ఆర్ఆర్ఆర్' లో కనిపించని మెగా హీరో ఆయనే ... ఎవరో తెలిస్తే షాక్ అవుతారు ....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>