PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp5c4a7933-fd1c-47d6-a676-f4932971748d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp5c4a7933-fd1c-47d6-a676-f4932971748d-415x250-IndiaHerald.jpgఅగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు ఈ కార్పొరేష‌న్ ద్వారా రుణాలు, ఆర్థిక సాయాలు, వివాహాలు వంటివి జ‌రిగాయి. ఇక, ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి నుంచి కూడా బ్రాహ్మ‌ణుల‌కు ప్ర‌త్యేకంగా కేటాయింపులు జ‌రిగేవి. దేవాల‌యాల్లోనూ ప్రాతినిధ్యం ఉండేది. కానీ, ఇప్పుడు మొత్తం ప‌రిస్థితి యూట‌ర్న్ అయింది. వైసీపీలో బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హించే పార్టీ నాయ‌కుడు అంటూ ఎవ‌రూ లేక పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో బ్రాహ్మ‌ణులు త‌మ‌కు ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. రోడ్డున ప‌డ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేకుండా పోయింది. మ‌రీ ముఖ్యంగా అగ్ర‌వ‌ర్ణysrcp;ganga;nidhi;surya sivakumar;vedhika;ganges;police;letter;tdp;partyబ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణ ప్రాతినిధ్యం ఏదీ? పేరుగొప్ప పాలిటిక్స్‌!!ysrcp;ganga;nidhi;surya sivakumar;vedhika;ganges;police;letter;tdp;partyThu, 21 Jan 2021 08:28:29 GMTఅధికార వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు ప్రాతినిధ్యం ఉందా ?  ఎవ‌రైనా బ్రాహ్మ‌ణుల త‌ర‌ఫున వాయిస్ వినిపిస్తున్నారా? అంటే.. లేద‌నే చెప్పాల్సి వ‌స్తోంది. వైసీపీలో అన్ని సామాజిక వ‌ర్గాల‌కు ప్రాతినిధ్యం ఉంది. కానీ, బ్రాహ్మ‌ణ వ‌ర్గానికి సంబంధించి మాత్రం ఎవ‌రూ బాధ్య‌త తీసుకోవ‌డం లేదు. వారి స‌మ‌స్య‌ల‌పై రాజ‌కీయాల్లో చ‌ర్చించేందుకు అనువైన వేదిక‌ను ఏర్పాటు చేసుకునే అవ‌కాశం కూడా ఇవ్వ‌డం లేదు. గ‌తంలో టీడీపీ అధికార ప్ర‌తినిధులుగా ఆనంద సూర్య వంటి వారు ఉండేవారు. రాష్ట్రంలో బ్రాహ్మ‌ణ వ‌ర్గాల్లోని పేద‌ల‌కు అవ‌స‌రమైన అన్ని విష‌యాల‌ను తెలుసుకుని.. బ్రాహ్మ‌ణుల‌కు-ప్ర‌భుత్వానికి మ‌ధ్య వార‌ధిగా వ్య‌వ‌హ‌రించేవారు.

ఫ‌లితంగా అంతో ఇంతో ప్రాతినిధ్యం, ప్రాధాన్యం ద‌క్కేది. ఈ క్ర‌మంలోనే బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ అనేది ఒక‌టి ఏర్పాటైంది. అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు ఈ కార్పొరేష‌న్ ద్వారా రుణాలు, ఆర్థిక సాయాలు, వివాహాలు వంటివి జ‌రిగాయి. ఇక, ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి నుంచి కూడా బ్రాహ్మ‌ణుల‌కు ప్ర‌త్యేకంగా కేటాయింపులు జ‌రిగేవి. దేవాల‌యాల్లోనూ ప్రాతినిధ్యం ఉండేది. కానీ, ఇప్పుడు మొత్తం ప‌రిస్థితి యూట‌ర్న్ అయింది. వైసీపీలో బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హించే పార్టీ నాయ‌కుడు అంటూ ఎవ‌రూ లేక పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో బ్రాహ్మ‌ణులు త‌మ‌కు ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. రోడ్డున ప‌డ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేకుండా పోయింది.

మ‌రీ ముఖ్యంగా అగ్ర‌వ‌ర్ణ పేద‌ బ్రాహ్మ‌ణులు..త‌మ స‌మ‌స్య‌ల‌ను బ‌హిరంగంగా చెప్పుకోలేక‌.. త‌మ‌కు చెప్పుకొనే వేదిక కూడా లేక పోవ‌డంతో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. అస‌లు త‌మ‌కంటే.. ప్ర‌భుత్వం ఏదైనా చేస్తోంది? అని తెసుకునేందుకు కూడా ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. గ‌తంలో ఉన్న అన్ని సౌల‌భ్యాల‌ను ఇప్పుడు తొల‌గించారు. ఫ‌లితంగా ఎమ్మెల్యేలు ఉన్న‌ప్ప‌టికీ.. బ్రాహ్మ‌ణుల వాయిస్‌కు మాత్రం, వారి స‌మ‌స్య‌ల‌కు మాత్రం ప‌రిష్కారం ల‌బించ‌డం లేద‌ని వారు వాపోతున్నారు.

మొత్తంగా ఈ ప‌రిణామం.. బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి తీవ్ర ఇబ్బందిక‌రంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, కొన్ని కొన్ని జిల్లాల్లో మ‌త మార్పిడుల కార‌ణంగా బ్రాహ్మ‌ణుల‌కు ఉపాధి లేకుండా పోతోంది. వీటిపైనా ఫిర్యాదులు అందుతున్నా.. అధికారులు, పోలీసులు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 


టీడీపీ నేత కళా వెంకట్రావు విడుదల

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ న్యూస్ తో మార్కెట్ ను ఓపెన్ చేసిన రాజమౌళి !

బ్రాహ్మ‌ణ ఘోష‌: పీఠాలు-మ‌ఠాల‌తో జ‌గ‌న్ పాలిటిక్స్‌.. బ్రాహ్మ‌ణులు ప‌ట్ట‌రా ?

చెన్నై సూపర్ కింగ్స్ గుడ్ న్యూస్.. రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్..!!

సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోబోతున్న హీరో వరుణ్!!

జగన్ ను బిజెపిలో ఆ ఇద్దరు ఇబ్బంది పెడతారా...?

చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వరు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>