PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/andhra-pradeshbad5ee51-b848-4be8-a5f3-20b021b8f052-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/andhra-pradeshbad5ee51-b848-4be8-a5f3-20b021b8f052-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో కొద్దిరోజుల నుంచి ప్రభుత్వం వర్సెస్ రాష్ట్ర ఎన్నికల సంఘం వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కరోనా కారణంగా ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న నాటి నుండి ప్రభుత్వం -ఎన్నికల సంఘం మధ్య దూరం ఏర్పడింది. ఎలా అయినా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నిస్తుంటే ఎలాగైనా ఎన్నికలు నిర్వహించకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఎస్ ఈ సీ ప్రకటించిన పంచాయితీ ఎన్నandhra pradesh;kumaar;suma;suma kanakala;andhra pradesh;high court;panchayati;courtపంచాయితీ ఎన్నికల విషయంలో ఏపీ సర్కార్ కి హైకోర్ట్ షాక్పంచాయితీ ఎన్నికల విషయంలో ఏపీ సర్కార్ కి హైకోర్ట్ షాక్andhra pradesh;kumaar;suma;suma kanakala;andhra pradesh;high court;panchayati;courtThu, 21 Jan 2021 11:00:00 GMTఆంధ్రప్రదేశ్లో కొద్దిరోజుల నుంచి ప్రభుత్వం వర్సెస్ రాష్ట్ర ఎన్నికల సంఘం వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కరోనా కారణంగా ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న నాటి నుండి ప్రభుత్వం -ఎన్నికల సంఘం మధ్య దూరం ఏర్పడింది. ఎలా అయినా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నిస్తుంటే ఎలాగైనా ఎన్నికలు నిర్వహించకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఎస్ ఈ సీ ప్రకటించిన పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ని వాయిదా వేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఎన్నికలు సజావుగా జరగాలని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. 


ఇక ఈ నెల 8న రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అయితే కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టాలని ఉండడంతో ఈ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే సింగిల్ జడ్జి ఎన్నికల కంటే వ్యాక్సిన్ ముఖ్యం కాబట్టి ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశం మీద రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించాలని అప్పీల్ చేశారు.


దీంతో మూడు రోజుల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఏపీలో పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 11 వ తారీకున ఎసిసి ఆదేశాలను సింగిల్ హైకోర్టు జడ్జి కొట్టి వేయగా ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆదేశాలను త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది. ఎవరికి ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ధర్మాసనం పేర్కొంది. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉండగా ఎన్నికలు నిర్వహించడానికి ఏమాత్రం సుముఖంగా లేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా తీర్పు మీద సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.


బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: నాడు వైఎస్‌కు.. నేడు జ‌గ‌న్‌కు వ‌న్‌సైడ్‌గా కొమ్ముకాస్తే ఇంత అన్యాయ‌మా..?

షాకింగ్: తెరాసకు ఇద్దరు మంత్రుల రాజీనామా...???

సోలార్ విద్యుత్‌లో సింగ‌రేణి రికార్డులు....డిసెంబ‌ర్ నాటికి 300 మెగావాట్లు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>