PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news63531d9a-da55-4482-947d-66d0c05c04a0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news63531d9a-da55-4482-947d-66d0c05c04a0-415x250-IndiaHerald.jpgకరోనా వ్యాక్సిన్ పంపిణీ నేపథ్యంలో ఎన్నికలు అడ్డుగా మారే అవకాశం ఉందని పిటిషన్ లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనగా.. దాంతో హైకోర్టు సింగిల్ బెంచ్ లో ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను ధర్మాసనం సస్పెండ్ చేసింది. అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎస్ఈసీ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసింది. వాదోపవాదాలు విన్న తర్వాత హై కోర్ట్ కరోనా వ్యాక్సిన్ కి ఎన్నికలు ఏమాత్రం అడ్డు కావని రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగాల్సిందేనని హై కోర్ట్ తేల్చిచెప్పింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో రాష్latest news;nani;amala akkineni;kumaar;dharma;jagan;andhra pradesh;high court;panchayati;court;perni nani;minister;tdp;local language;supreme court;ycp;election commissionఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్తానంటున్న వైసీపీ.. పరువు తీసుకోవద్దు అంటున్న టీడీపీ..!!ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్తానంటున్న వైసీపీ.. పరువు తీసుకోవద్దు అంటున్న టీడీపీ..!!latest news;nani;amala akkineni;kumaar;dharma;jagan;andhra pradesh;high court;panchayati;court;perni nani;minister;tdp;local language;supreme court;ycp;election commissionThu, 21 Jan 2021 19:00:00 GMTస్థానిక ఎన్నికలపై నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. జగన్ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ స్థానిక ఎన్నికల నిర్వహణ జరగాల్సిందే అంటూ స్పష్టం చేసింది. గత ఏడాది కాలంగా స్థానిక ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య వివాదం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతి లేకుండానే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి ఒక్కసారిగా సంచలనం రేపారు. ఈ నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

కరోనా వ్యాక్సిన్ పంపిణీ నేపథ్యంలో ఎన్నికలు అడ్డుగా మారే అవకాశం ఉందని పిటిషన్ లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనగా.. దాంతో హైకోర్టు సింగిల్ బెంచ్ లో ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను ధర్మాసనం సస్పెండ్ చేసింది. అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎస్ఈసీ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసింది. వాదోపవాదాలు విన్న తర్వాత హై కోర్ట్ కరోనా వ్యాక్సిన్ కి ఎన్నికలు ఏమాత్రం అడ్డు కావని రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగాల్సిందేనని హై కోర్ట్ తేల్చిచెప్పింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి. హైకోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.

మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళతామని ఆయన తెలిపారు. నిమ్మగడ్డ అనుకున్నంత మాత్రన ఎన్నికల కోడ్‌ అమలు కాదని.. న్యాయమూర్తులు మారినా ధర్మం గెలవాలనే కోరుకుంటున్నామని పేర్నినాని పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపాయి. టిడిపి కీలక నేత అచ్చెన్నాయుడు స్పందిస్తూ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని... జగన్‌ మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లి ఏపీ పరువు తీయొద్దని ఆయన ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా ఎస్ఈసి గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేయడంతో మళ్లీ మరలా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.


రామ్ దృష్టి ఇకపై అక్కడ కూడా..!!

కేసీఆర్ స్థానంలో ఈటెల, పద్మారావు కాకుండా 'కేటీఆర్' ఎందుకు సీఎం కావాలి?

కష్టాల్లో బాలీవుడ్.. టాలీవుడ్ ఆపన్నహస్తం కోసం..!

జగనోరూ.. పంతం కాదు అభివృద్ధి కావాలి..!!

జగన్ గెలిచేందుకు 24 గంటల గడువే!

తమన్నా ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లు ఇంటరెస్టింగ్ ?

'ఆర్ఆర్ఆర్' లో కనిపించని మెగా హీరో ఆయనే ... ఎవరో తెలిస్తే షాక్ అవుతారు ....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>