MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan99cf829c-7bbe-46fd-ab0f-1432e99ac536-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan99cf829c-7bbe-46fd-ab0f-1432e99ac536-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఇపుడు అరడజన్ సినిమాల దాకా కమిట్ అయ్యారు. అన్నీ కూడా విభిన్నమైన కంటెంట్ తో ఉన్నవే. పైగా టాప్ టెక్నీషియన్స్ అంతా వాటికి వర్క్ చేస్తున్నారు. pawan;pawan;gouthami;kalyan;krish;pawan kalyan;cinema;producer;king;audience;remake;director;producer1పవన్.. క్రిష్... జోరు మామూలుగా లేదే...?పవన్.. క్రిష్... జోరు మామూలుగా లేదే...?pawan;pawan;gouthami;kalyan;krish;pawan kalyan;cinema;producer;king;audience;remake;director;producer1Thu, 21 Jan 2021 20:30:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఇపుడు అరడజన్ సినిమాల దాకా కమిట్ అయ్యారు. అన్నీ కూడా విభిన్నమైన కంటెంట్ తో ఉన్నవే. పైగా టాప్ టెక్నీషియన్స్ అంతా వాటికి వర్క్  చేస్తున్నారు.

పవన్ తన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా సమాంతరంగా రెండు సినిమాలు ఒకేసారి చేస్తున్నారు. అదే అయ్యప్పనుం కోషియం అన్న మళయాళ రీమేక్ తో పాటు డైరెక్టర్ క్రిష్ తో చేస్తున్న హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్ మూవీ ఒకటి. ఈ రెండూ కూడా ఒకేసారి పూర్తి చేయాలని పవన్ నిర్ణయించుకున్నారని అంటున్నారు.

ఇక క్రిష్ సంగతి తెలిసిందే. ఆయన సినిమాలు చాలా స్పీడ్ గా తీస్తారు. డెబ్బై రోజుల వ్యవధిలో గౌతమి పుత్ర శాతకర్ణి మూవీని కంప్లీట్ చేసి నాలుగేళ్ల క్రితం రికార్డ్ క్రియేట్ చేశాడు క్రిష్. ఇపుడు ఆయన అలాంటి ప్రయోగమే చేస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ తో తీస్తున్న సినిమా కూడా హిస్టారికల్ మూవీ అంటున్నారు. ఈ మూవీలో పవన్ రాజుల కాలం నాటి పాత్రలో కనిపిస్తారు అని చెబుతున్నారు. ఈ మూవీ మీద పూర్తి హోం వర్క్ చేసుకుని వచ్చిన క్రిష్ పవన్ తో షూటింగ్ చకచకా లాగించేస్తున్నాడట. ఇప్పటికే ఒక పాటను పవన్ తో తీసిన క్రిష్ రెండవ పాట కూడా తొందరలోనే ఫినిష్ చేయబోతున్నాడుట.

మొత్తానికి పాటలతో మొదలుపెట్టి ఆ తరువాత సీన్లు వేగంగా తీసేస్తే ఇక గ్రాఫిక్ వర్క్స్ ఏమైనా ఉంటే చూసుకుని ఈ ఏడాది లోనే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి క్రిష్ రెడీ అవుతున్నాడు అంటున్నారు. మొత్తానికి చూస్తే క్రిష్ పవన్ సినిమా జోరు మామూలుగా లేదు అంటున్నారు. ఇక క్రిష్ పవన్ మూవీని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం భారీ సెట్స్ కూడా వేశారు. ఇక పవన్ ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఈ మూవీ ఉంటుందని అంటున్నారు.






ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు....

కేసీఆర్ స్థానంలో ఈటెల, పద్మారావు కాకుండా 'కేటీఆర్' ఎందుకు సీఎం కావాలి?

కష్టాల్లో బాలీవుడ్.. టాలీవుడ్ ఆపన్నహస్తం కోసం..!

జగనోరూ.. పంతం కాదు అభివృద్ధి కావాలి..!!

జగన్ గెలిచేందుకు 24 గంటల గడువే!

తమన్నా ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లు ఇంటరెస్టింగ్ ?

'ఆర్ఆర్ఆర్' లో కనిపించని మెగా హీరో ఆయనే ... ఎవరో తెలిస్తే షాక్ అవుతారు ....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>