MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/rajasekhar-and-chiranjeevib93428fe-9545-45b2-bcfb-860dbcdd029d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/rajasekhar-and-chiranjeevib93428fe-9545-45b2-bcfb-860dbcdd029d-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి, సీనియర్ హీరో రాజశేఖర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వారిద్దరి మధ్య ఉన్న శత్రుత్వం గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లో ప్రజారాజ్యం పెట్టి రాజకీయాల్లో మంచి నాయకుడిగా పేరు తెచ్చుకోవాలని చిరంజీవి ప్రయత్నిస్తున్నారు.rajasekhar and chiranjeevi;chiranjeevi;ganga;dr rajasekhar;audi;ganges;రాజీనామా;cinema;event;blockbuster hit;hero;success;allari;maa association;shatru1అప్పట్లో చిరంజీవి, రాజశేఖర్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉండేవారో తెలుసా..?అప్పట్లో చిరంజీవి, రాజశేఖర్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉండేవారో తెలుసా..?rajasekhar and chiranjeevi;chiranjeevi;ganga;dr rajasekhar;audi;ganges;రాజీనామా;cinema;event;blockbuster hit;hero;success;allari;maa association;shatru1Thu, 21 Jan 2021 14:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి, సీనియర్ హీరో రాజశేఖర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వారిద్దరి మధ్య ఉన్న శత్రుత్వం గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లో ప్రజారాజ్యం పెట్టి రాజకీయాల్లో మంచి నాయకుడిగా పేరు తెచ్చుకోవాలని చిరంజీవి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ సమయంలో స్నేహితుడికి అండగా ఉండాల్సింది పోయి రాజశేఖర్ కొన్ని బ్యాడ్ కామెంట్స్ చేశారు. చిరంజీవి కి రాజకీయాల్లో అనుభవమే లేదు, ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టినా కూడా సక్సెస్ కాలేరు అని బహిరంగంగా రాజశేఖర్ వ్యాఖ్యలు చేశారు. దీంతో చిరంజీవి బాగా నోచ్చుకున్నారు. అంతేకాదు సత్యమేవ జయతే అనే సినిమా తీసి చిరంజీవిని టార్గెట్ చేశారు. మా అసోసియేషన్ డైరీ లాంచ్ వేడుకల్లో కూడా చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షుడు పదవికి కూడా రాజీనామా చేసి చిరంజీవి పట్ల తన ద్వేషాన్ని వ్యక్తపరిచారు.దీనితో వీళ్లిద్దరి మధ్య దూరం పెరిగిపోయింది.

మెగా అభిమానులు కూడా చిరంజీవి ని టార్గెట్ చేస్తున్నాం రాజశేఖర్ ని ఏకిపారేశారు. దీంతో రాజశేఖర్ చిరు ఇంటికి వెళ్లి తనకు చిరంజీవికి మధ్య ఎటువంటి శత్రుత్వం లేదని.. తాము మంచి స్నేహితులు గానే ఉన్నామని చెప్పి చిరు అభిమానులను శాంతపరిచే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు కాల గర్భంలో కలిసిపోయాయి. చిరంజీవి తనకు ఇప్పటికీ ఒక మంచి స్నేహితుడు అని రాజశేఖర్ చెబుతున్నారు కానీ రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు చిరంజీవి ని బాగా గాయపరిచాయి. దీనితో ఆయన రాజశేఖర్ తో క్లోజ్ ఫ్రెండ్ గా ఉన్నట్టు నటిస్తుంటారు కానీ గతంలో లాగా రాజశేఖర్ తో సన్నిహితంగా మాట్లాడడం లేదు.

అయితే ఒకప్పుడు చిరంజీవి, రాజశేఖర్ చాలా మంచి స్నేహితులుగా ఉండేవారు. అప్పట్లో చిరంజీవి నటించిన ప్రతి సినిమా ఫంక్షన్ కి రాజశేఖర్ హాజరయ్యేవారు. ఎంత బిజీగా ఉన్నా సరే చిరంజీవి కూడా రాజశేఖర్ సినిమా ఫంక్షన్లకు వచ్చి తన వంతు గా ప్రమోట్ చేసే వారు. రాజశేఖర్ హీరోగా నటించిన అల్లరి ప్రియుడు సినిమా అప్పట్లో వంద రోజులు ఆడి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఐతే అల్లరి ప్రియుడు సక్సెస్ మీట్ ఈవెంట్ కి చిరంజీవి హాజరై రాజశేఖర్ ని సంతోష పెట్టారు. ఈ మూవీ సక్సెస్ మీట్ సందర్భంగా రాజశేఖర్, చిరంజీవి కలిసి దిగిన ఫోటోలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి. పైన కనిపిస్తున్న ఫోటో కూడా అల్లరి ప్రియుడు మూవీ సక్సెస్ మీట్ సందర్భంగా తీసినదే.


ప్రొఫెషనల్ బాక్సర్ ను పెళ్లాడిన నటి!

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఏపీ అసెంబ్లీలో బ్రాహ‌ణ గొంతు వినిపించ‌దా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: ఐదువేల పింఛ‌న్‌తో అయ్య‌వారికి శ‌ఠ‌గోపం.. జ‌గ‌న‌న్న మార్కు రాజ‌కీయం..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌.. నాడు-నేడు.. నిర్వీర్యం దిశ‌గా అడుగులు..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: డిప్యూటీ స్పీక‌ర్ సార్ మౌనం.. ఇంత జ‌రిగినా.. నోరు మెద‌ప‌రా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైసీపీలో బ్రాహ్మ‌ణుల‌కు కీల‌క ప‌ద‌వులేవి... సెగ మొద‌లైంది...!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పొరుగు రాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌కు పెద్ద‌పీట‌.. మ‌రి జ‌గ‌న్ పాల‌న‌లో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>