MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/deepika-padukonec5ba9252-5fc2-4636-b834-7901feb234d7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/deepika-padukonec5ba9252-5fc2-4636-b834-7901feb234d7-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోన్ పెళ్లితరువాత కూడా వరుస అవకాశాలతో బిజీగా ఉంటోంది. తన మనసుకు దగ్గరైన రణ్వీర్ సింగ్ ను వివాహమాడిన దీపిక తన కెరీర్ పై కూడా దృష్టిపెట్టింది. ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో ముందుకు సాగుతోంది. దీపికాకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఆడియెన్స్ ను కంగారు పెడుతోంది. దీపికా భారత ఇతిహాసమైన "మహాభారతం"లోని ఓ ముఖ్యమైన గాధతో అభిమానుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్టు ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. "ద్రౌపది" పాత్రలో అలరిస్తానని ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చింది. ఈ సినిమా అనేది ద్deepika padukone;beauty;ranveer singh;deepika;bollywood;cinema;media;mahabharatham;interview;director;vegetable marketఅటకెక్కిన దీపికా "ద్రౌపది"అటకెక్కిన దీపికా "ద్రౌపది"deepika padukone;beauty;ranveer singh;deepika;bollywood;cinema;media;mahabharatham;interview;director;vegetable marketThu, 21 Jan 2021 16:00:00 GMT బ్యూటీ దీపికా పడుకోన్ పెళ్లితరువాత కూడా వరుస అవకాశాలతో బిజీగా ఉంటోంది. తన మనసుకు దగ్గరైన రణ్వీర్ సింగ్ ను వివాహమాడిన దీపిక తన కెరీర్ పై కూడా దృష్టిపెట్టింది. ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో ముందుకు సాగుతోంది.

దీపికాకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఆడియెన్స్ ను కంగారు పెడుతోంది. దీపికా భారత ఇతిహాసమైన "మహాభారతం"లోని ఓ ముఖ్యమైన గాధతో అభిమానుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్టు ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. "ద్రౌపది" పాత్రలో అలరిస్తానని ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చింది. ఈ సినిమా అనేది ద్రౌపది పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తెరకెక్కుతోందని ఆడియెన్స్ భావిస్తున్నారు.

మార్కెట్ లోని లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన పనులు ప్రస్తుతం అటకెక్కినట్టు తెలుస్తోంది. ఈ సినిమా అనేది మహాభారతంలోని ముఖ్యఘట్టాలను ఇంట్రస్టింగ్ విధానంలో ఆడియెన్స్ ముందుకు తీసుకువస్తుందని అందరూ ఆశిస్తున్నారు. కానీ, గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమాకు డైరెక్టర్ దొరకడం లేదట.

అనేక పెద్ద పెద్ద దర్శకుల పేర్లు ఈ సినిమా విషయంలో ప్రస్తావనకు వచ్చాయి. కానీ, ముందుకు వెళ్లడం లేదు. అందుకే, ఇన్ని సంవత్సరాలుగా బజ్ లో ఉన్న ఈ సినిమాను ప్రస్తుతం హోల్డ్ లో ఉంచాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

దీపికా తన ఫోకస్ ను మహాభారతం నుంచి మళ్లించి ప్రస్తుతం వేరే చిన్న సినిమాలపై దృష్టి పెట్టింది. దీపికా చేతిలో ప్రస్తుతం బోలెడన్ని ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం "ద్రౌపది"ని ముందుకు తీసుకెళ్లలేకపోవడాన్ని దీపికా గుర్తించింది. కానీ, అన్నీ అనుకున్నట్టు జరిగితే ఒక శుభసందర్భంలో ఈ సినిమా మళ్ళీ పట్టాలెక్కే అవకాశం కచ్చితంగా ఉందంటున్నారు విశ్లేషకులు.

ఈ సినిమాను తెరకెక్కించడం అతిపెద్ద బాధ్యతని అంటున్నారు మేకర్స్. దీపికా తన ప్రాజెక్ట్స్ నుంచి ఫ్రీ అయ్యాక ఆమెకంటూ కొంత బ్రీతింగ్ స్పేస్ లభించాక ఈ సినిమాపై దృష్టిపెట్టే అవకాశం ఉంటుందంటోంది బాలీవుడ్ మీడియా.


మొత్తానికి రెడ్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసిన రామ్....

బాలయ్యని నందమూరి హీరోలు కూడా ఇలా వాడుకోలేదు..!

బుల్లి తెర మెగాస్టార్ “ప్రభాకర్” కూతురు గురించి ఈ విషయాలు తెలుసా.?

ఎడిటోరియల్ : అందరి నిందలూ బాబు మీదే ? 'కమ్మ 'టి దెబ్బ ?

మెగాస్టార్ చిరంజీవి ప్లానింగ్ మామూలుగా లేదుగా..

ప్రభాస్ పెళ్లి జరిగేది అప్పుడే: సంచలన విషయాలు వెల్లడించిన కృషంరాజు ....??

అనుష్క చేయబోయేది బోల్డ్ మూవీనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>