SatireKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/ap-politicscfbeed47-72bf-4ab9-8b46-08c3d191350b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/ap-politicscfbeed47-72bf-4ab9-8b46-08c3d191350b-415x250-IndiaHerald.jpgవైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గా పదవి బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర పూర్తి అయ్యింది. ఆరు నెలలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని ప్రమాణ స్వీకారం రోజున నొక్కి చెప్పిన జగనోరు.. ఆ దిశగా ఏ ప్రయత్నాలు చేయలేదనే చెప్పాలి. అధికారంలోకి వచ్చిన మొదటి నుండి కూడా పలు పథకాల పేరుతో ప్రజలకు విచ్చలవిడిగా డబ్బు పంచడం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా ఏ ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని రాజకీయ విశ్లేషకులు జగన్ పై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.. ap politics;jagan;andhra pradesh;court;local language;ycp;reddy;mantraజగనోరూ.. పంతం కాదు అభివృద్ధి కావాలి..!!జగనోరూ.. పంతం కాదు అభివృద్ధి కావాలి..!!ap politics;jagan;andhra pradesh;court;local language;ycp;reddy;mantraThu, 21 Jan 2021 20:00:00 GMTరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గా పదవి బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర పూర్తి అయ్యింది. ఆరు నెలలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని ప్రమాణ స్వీకారం రోజున నొక్కి చెప్పిన జగనోరు.. ఆ దిశగా ఏ ప్రయత్నాలు చేయలేదనే చెప్పాలి. అధికారంలోకి వచ్చిన మొదటి నుండి కూడా పలు పథకాల పేరుతో ప్రజలకు విచ్చలవిడిగా డబ్బు పంచడం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా ఏ ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని రాజకీయ విశ్లేషకులు జగన్ పై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు..

పథకాల పేరుతో ప్రజల ఖాతాలలో డబ్బు జమ చేస్తే అభివృద్ధి జరుగుతుందా.. అంటూ నిలదీస్తున్నారు. ఒక సీఎం గా బాధ్యతాయుత పదవిలో ఉంటూ కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఇప్పటికే ఎన్నో విమర్శలు మూటగట్టుకున్నారు. ఏడాదిన్నర లోపే హామీ ఇచ్చిన 90 శాతం పథకాలను నెరవేర్చమంటూ వైసీపీ నేతలు, మంత్రులు సొంత డబ్బా కొట్టుకుంటున్న ప్పటికీ ప్రజలు ఏ మాత్రం అంగీకరించడం లేదు. నిజానికి ఇప్పటివరకు ప్రవేశపెట్టిన పథకాలన్నీ చూస్తే ఒక్క డబ్బు పంచడం తప్ప నిజమైన అభివృద్ధి ఆ పథకాలలో కానరాదని రాజకీయ విశ్లేషకుల వాదన. అదేవిధంగా స్థానిక ఎన్నికలపై జగనోరు.. వైఖరి ఏంటో తెలుగు ప్రజానీకానికి స్పష్టంగా అర్థమవుతుంది.

అన్ని రాష్ట్రాలలో ఎన్నికల నిర్వహిస్తున్నప్పటికీ ఏపీ రాష్ట్రంలో కరోనా సాకుతో జగనోరు ప్రవర్తిస్తున్న మొండివైఖరికి తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టులా మారింది. ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఏమాత్రం ఉండబోదనే రాజ్యాంగ జ్ఞానం కూడా లేకుండా అనవసరపు పంతానికి పోయి ప్రజల ఎదుట నవ్వులపాలు అవుతున్నారని పలువురి అభిప్రాయం. తాజాగా స్థానిక ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తానంటున్న జగనోరు.. రాజ్యాంగాన్ని మర్చిపోయి వ్యవహరిస్తున్నారని రాజ్యాంగ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక సుప్రీంకోర్టులో వచ్చే తీర్పు స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా వస్తే దేశ ప్రజలు జగనోరు ని చూసి నవ్వడం ఖాయమని పలువురి అంచనా.. ఇవన్నీ గమనిస్తున్నా ఏపీ ప్రజలు జగనోరూ.. పంతం కాదు అభివృద్ధి కావాలంటూ తమ అభిప్రాయాన్ని వెళ్లబుచ్చుతున్నాడు.


ట్రంప్ కోసం వేచి చూస్తున్న అందాల ప్రదేశం..?

కేసీఆర్ స్థానంలో ఈటెల, పద్మారావు కాకుండా 'కేటీఆర్' ఎందుకు సీఎం కావాలి?

కష్టాల్లో బాలీవుడ్.. టాలీవుడ్ ఆపన్నహస్తం కోసం..!

జగన్ గెలిచేందుకు 24 గంటల గడువే!

తమన్నా ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లు ఇంటరెస్టింగ్ ?

'ఆర్ఆర్ఆర్' లో కనిపించని మెగా హీరో ఆయనే ... ఎవరో తెలిస్తే షాక్ అవుతారు ....??

బాలయ్యని నందమూరి హీరోలు కూడా ఇలా వాడుకోలేదు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>