MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresh84456f03-2004-45de-bd1c-05ff7e839710-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresh84456f03-2004-45de-bd1c-05ff7e839710-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో కామెడీ హీరోగా అల్లరి నరేష్ కు మంచి పేరుంది. ఐతే, కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి అనుకున్నంతగా సక్సెస్ అవకపోవడంతో అల్లరి నరేష్ కెరీర్ అనేది కొంచెం డైలమాలో పడిందన్న విషయం వాస్తవమే. కెరీర్ ను మళ్ళీ ట్రాక్ లోకి తేవడానికి అల్లరి నరేష్ చేయని ప్రయత్నం లేనే లేదు. allari naresh;mahesh;naresh;allari naresh;maharshi;tiru;tollywood;cinema;rajani kanth;january;maharshi 1;comedy;success;allariకొత్త లోన్లు తీసుకునేవారే కానీ, పాత లోన్లు కట్టేవారు ఒక్కరు కూడా ఉండరుకొత్త లోన్లు తీసుకునేవారే కానీ, పాత లోన్లు కట్టేవారు ఒక్కరు కూడా ఉండరుallari naresh;mahesh;naresh;allari naresh;maharshi;tiru;tollywood;cinema;rajani kanth;january;maharshi 1;comedy;success;allariWed, 20 Jan 2021 15:00:00 GMTటాలీవుడ్ లో కామెడీ హీరోగా అల్లరి నరేష్ కు మంచి పేరుంది. ఐతే, కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి అనుకున్నంతగా సక్సెస్ అవకపోవడంతో అల్లరి నరేష్ కెరీర్ అనేది కొంచెం డైలమాలో పడిందన్న విషయం వాస్తవమే. కెరీర్ ను మళ్ళీ ట్రాక్ లోకి తేవడానికి అల్లరి నరేష్ చేయని ప్రయత్నం లేనే లేదు.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన "మహర్షి" మూవీలో అల్లరి నరేష్ సపోర్టింగ్ రోల్ లో నటించి అందరి ప్రశంసలూ పొందాడు. మొత్తానికి, హీరోగా తన లక్ ను మళ్ళీ టెస్ట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. "బంగారు బుల్లోడు"గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. కామెడీ మూవీస్ కు పెట్టింది పేరు అల్లరి నరేష్ అన్న పేరును మళ్ళీ దక్కించుకోవడం కోసం ఈ సినిమాలో ప్రాణం పెట్టి నటించాడు నరేష్. ఈ సినిమా జనవరి 23న విడుదలకు సిద్ధమవుతోంది.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ థియాట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ బాగానే ఉంది. సినిమా కూడా బాగుండాలని కోరుకుంటున్నామని అంటున్నారు ఆడియెన్స్. నరేష్ కు హిట్ వచ్చి చాలా కాలమైంది. ఈ సినిమా హిట్టవ్వాలని కోరుకుంటున్నామని అభిమానులు అంటున్నారు.

ఈ ట్రైలర్ లో "కొత్త లోన్లు తీసుకునేవారే కానీ, పాత లోన్లు కట్టేవారు ఒక్కరు కూడా ఉండరు" అన్న డైలాగ్ హైలైట్ గా నిలిచింది. బంగారు నగల చుట్టూ ఈ స్టోరీ తిరుగుతోందని తెలుస్తోంది. కన్ఫ్యూజన్ కామెడీతో ప్రేక్షకులను అలరించేందుకు అల్లరి నరేష్ మంచి సబ్జెక్ట్ తో ముందుకు వచ్చినట్టు ట్రైలర్ హింట్ ఇస్తోంది.

అల్లరి నరేష్ మూవీస్ ను సకుటుంబ సపరివార సమేతంగా చూసే అవకాశం ఉంటుందని ఆడియెన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. అటువంటి మూవీస్ ఈ మధ్యకాలంలో రావట్లేదు కాబట్టి ఈ మూవీ ఆ లోటు తీరుస్తుందని అభిమానుల ఉద్దేశ్యం. 


ఉగాది తర్వాత ప్రజల్లోకి కేసీఆర్...?

డయాబెటిస్ రోగులు రోజుకు ఎన్నిసార్లు తినాలి.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..?

జగన్ ఇంత పెద్ద తప్పు చేస్తున్నారా...?

ఎన్టీఆర్, బాలయ్యకు దగ్గర ఉండి వైద్యం చేసిన హీరో తల్లి ఎవరు..?

ప్రెస్ మీట్ పెట్టి మరి భార్య గుట్టు రట్టు చేసిన భర్త.. చివరికి..

పోలీసులు వైసీపీని ఇబ్బంది పెట్టడం ఖాయమా...?

ఎస్బిఐ కీలక నిర్ణయం.. ఇలా చేస్తే అదిరిపోయే ప్రయోజనాలు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>