MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-babu-class8c000b8e-ebd0-446e-9e30-1c8ca960a9d3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-babu-class8c000b8e-ebd0-446e-9e30-1c8ca960a9d3-415x250-IndiaHerald.jpgరవిబాబు కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడు, ప్రొడ్యూసర్ కూడా. విభిన్నమైన కథలతో, సరికొత్త టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. రవిబాబు దర్శకత్వం వహించే ఏ సినిమాలోనైనా త్రిల్లింగ్, యాక్షన్ తో పాటు భయం కూడా నెలకొంటుంది. అమరావతి సినిమాకు దర్శకత్వం వహించి, ఆ సినిమాలో నిజంగా ఒక మనిషిని హిప్నటైజ్ చేస్తే ఎలా ప్రవర్తిస్తారో? అని స్పష్టంగా చూపించగలిగాడు. ఆ తర్వాత అవును, అవును 2 లాంటి సినిమాలను చిత్రించి, ప్రేక్షకులలో భయాన్ని పుట్టించాడు. అంతేకాకుండా ravi babu class;suresh;kiran;ravi anchor;tarun;uday kiran;mumbai;amaravati;cinema;producer;interview;blockbuster hit;producer1;hero;suresh productions;nijam;avunu 2;tarun kumar;manasantha nuvveనా ఈగో కారణంగానే ఆ హీరో తో క్లాష్ అయ్యింది : రవిబాబునా ఈగో కారణంగానే ఆ హీరో తో క్లాష్ అయ్యింది : రవిబాబుravi babu class;suresh;kiran;ravi anchor;tarun;uday kiran;mumbai;amaravati;cinema;producer;interview;blockbuster hit;producer1;hero;suresh productions;nijam;avunu 2;tarun kumar;manasantha nuvveWed, 20 Jan 2021 12:18:44 GMTరవిబాబు కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడు, ప్రొడ్యూసర్ కూడా. విభిన్నమైన కథలతో, సరికొత్త టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. రవిబాబు దర్శకత్వం వహించే ఏ సినిమాలోనైనా త్రిల్లింగ్, యాక్షన్ తో పాటు భయం కూడా నెలకొంటుంది. అమరావతి సినిమాకు దర్శకత్వం వహించి, ఆ సినిమాలో నిజంగా ఒక మనిషిని హిప్నటైజ్ చేస్తే ఎలా ప్రవర్తిస్తారో? అని స్పష్టంగా చూపించగలిగాడు.  ఆ తర్వాత అవును, అవును 2 లాంటి సినిమాలను చిత్రించి, ప్రేక్షకులలో భయాన్ని పుట్టించాడు. అంతేకాకుండా సరికొత్తగా ఆవిర్భవించిన టెక్నాలజీని  ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అప్పట్లో యంగ్ హీరోలైన ఉదయ్ కిరణ్ తోపాటు తరుణ్ తో కలిసి సినిమాలు తీయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు రవిబాబు. అయితే కొన్ని కారణాల చేత వారిద్దరితో కలిసి సినిమాలు చేయలేకపోయాడు. అయితే వీరిద్దరి మధ్య ఏవో కారణాల వల్ల  గొడవ జరిగిందని అప్పట్లో టాక్ కూడా నడిచింది. అందుకు గల కారణాలు ఏమిటో? ఇప్పుడు చూద్దాం.

చిత్రం లాంటి సెన్సేషనల్ మూవీతో పరిచయమైన ఉదయ్ కిరణ్, ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ను  తన అకౌంట్లో వేసుకున్నాడు. చాలా చిన్న వయసులోనే విషాద పరిస్థితిలో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయినప్పటికీ అతనిని తలచుకునే  అభిమానులు ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు. ఇదిలా ఉండగా ఉదయ్ కిరణ్ తో ఈగో కి  వెళ్లి,భారీగా నష్టపోయాడు దర్శకుడు రవిబాబు.

2005లో తరుణ్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రవిబాబు దర్శకత్వంలో సోగ్గాడు సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని రవిబాబు ముందుగా ఇద్దరు హీరోల కథగా రాసుకున్నారు. ఒకరు ఉదయ్ కిరణ్, మరొకరు తరుణ్. ముందు రవిబాబు వీరిద్దరికీ కథ వివరించినప్పుడు ఉదయ్ కిరణ్  తన అభిప్రాయాన్ని వెంటనే చెప్పలేకపోయాడు. అలా కొంత కాలం గడిచిపోయింది. ఉదయ్ కిరణ్ రెస్పాండ్ కోసం రవిబాబు ఎదురుచూస్తున్న సమయంలో అనుకోకుండా ఒకసారి చెన్నైలో వీరిద్దరూ కలిశారు. రవి బాబు మరొకసారి అడగడంతో ఉదయ్ కిరణ్ ఓకే చెప్పాడు.

సినిమా షూటింగ్ చేద్దామనుకుని వీరిద్దరూ సురేష్ బాబు తో సమావేశం అయ్యారు. అప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఉదయ్ కిరణ్ తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ,ఈ సినిమాను నేను చేయలేను అని చెప్పాడు. దీంతో రవిబాబు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. నువ్వు కాకపోతే ఇంకెవరితోనైనా చేయించుకుంటాను అంటూ  ఆవేశంగా  అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక తన ఈగో ని ఏ మాత్రం తగ్గించుకోకుండా ముంబై నుంచి జుగల్ హన్స్రాజ్  ని తీసుకొచ్చారు.  ఇమేజ్ పరంగా తెలుగు ఇండస్ట్రీలో అతని గురించి ఎవరికీ తెలియకపోవడంతో ఆ సినిమా పెద్దగా ఆడలేదు. తన తొందరపాటు వల్లే, ఈగోకి వెళ్లి, భారీ  నష్టాన్ని చవి చూశాను అని రవి బాబు చాలా సార్లు  ఇంటర్వ్యూలలో వెల్లడించారు.




ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్.. ఇక ఈ ఏటీఎంలలో డబ్బులు తీసుకోలేరు..?

నా ఇమేజ్ కు సరిపోదని ఆ సినిమాను రిజెక్ట్ చేశా. : జూనియర్ ఎన్టీఆర్.

దేవినేని దూకుడుతో బాబుకు దెబ్బ‌డిపోయిందే...!

ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే.. స్థానిక ఎన్నికలు..?

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల వెన‌క ఇంత లోగుట్టు ఉందా... క‌థ మామూలుగా లేదుగా..!

ప‌థ‌కాల‌తో ప్ర‌యోజ‌నం వ‌స్తుందా..? వైసీపీలో అంత‌ర్గ‌త చ‌ర్చ‌

చక్రవ్యూహం: చైనాకు ఊపిరి సలపనివ్వని డొనాల్డ్ ట్రంప్ చక్రవ్యూహంలో జో బైడెన్ బంధి అయ్యారా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>