MoviesSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actress-hari-teja-latest-photos-goes-on-virale19767ab-aecc-441c-8af4-50a96de79f1a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actress-hari-teja-latest-photos-goes-on-virale19767ab-aecc-441c-8af4-50a96de79f1a-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ ఫేమ్ హరితేజ అందరికీ సుపరిచితమే... బిగ్ బాస్ షోకి ముందు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అ..ఆ’ సినిమాతో ఒక్కసారిగా మంచి పాపులారిటీని సంపాదించుకుంది హరితేజ. ఈ సినిమాకు ముందు పలు సీరియల్స్‌ తో బుల్లితెర నటిగా మనసు మమత, రక్త సంబంధం, అభిషేకం, కన్యాదానం, చిన్నారి, శివరంజిని వంటి సీరియల్స్‌ లో ఎనిమిదేళ్లుగా నటించి మెప్పించింది.‘త్రివిక్రమ్ అంటే మహావృక్షం.. ఆయన నీడలో బతుకుతున్నవాళ్లం మేమంతా. ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టిన తరువాత చాలా విషయాలు నేర్చుకున్నాను.hariteja;health;mamata benerjee;mamatha;srinivas;tiru;trivikram srinivas;tollywood;cinema;hari teja1;telugu;bigboss;marriage;interview;director;heart;girl;attharintiki darediత్రివిక్రమ్ అంటే మహావృక్షం... ఆయన నీడలో బతుకుతున్నవాళ్ళం మేమంతా - హరితేజత్రివిక్రమ్ అంటే మహావృక్షం... ఆయన నీడలో బతుకుతున్నవాళ్ళం మేమంతా - హరితేజhariteja;health;mamata benerjee;mamatha;srinivas;tiru;trivikram srinivas;tollywood;cinema;hari teja1;telugu;bigboss;marriage;interview;director;heart;girl;attharintiki darediWed, 20 Jan 2021 17:45:00 GMTబిగ్ బాస్ ఫేమ్ హరితేజ అందరికీ సుపరిచితమే... బిగ్ బాస్ షోకి ముందు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అ..ఆ’ సినిమాతో ఒక్కసారిగా మంచి పాపులారిటీని సంపాదించుకుంది హరితేజ. ఈ సినిమాకు ముందు పలు సీరియల్స్‌ తో బుల్లితెర నటిగా మనసు మమత, రక్త సంబంధం, అభిషేకం, కన్యాదానం, చిన్నారి, శివరంజిని వంటి సీరియల్స్‌ లో ఎనిమిదేళ్లుగా నటించి మెప్పించింది. ఇక ఆ తరువాత అత్తారింటికి దారేది, దమ్ము, అత్తారింటికి దారేది, నేనొక్కడినే వంటి చిత్రాల్లో నటించింది. అయితే 2016లో వచ్చిన ‘అ..ఆ’ సినిమాతో మంచి బ్రేక్ తెచ్చుకుంది హరితేజ. ఇక ఆ సినిమా తర్వాత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హరితేజ.. గతంలో తనపై వచ్చిన రూమర్స్ వల్ల తను బాధపడ్డ సందర్భాలు.. రియలైజేషన్ అయిన విషయాలపై కూలంకషంగా మాట్లాడింది. యాంకర్ నవీనకి ఇచ్చిన గత ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘ఈ గాసిప్ అనేది నా వరకూ వచ్చి.. నీ గురించి ఇట్లా అనుకుంటున్నారు.. ఇలా అంటకదా అని ఎవరైనా అంటే.. చెప్పే వాళ్లు నా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యే ఉంటారు కాబట్టి ‘వాళ్లకెందుకే నా గురించి.. వేరే పనిపాటా లేదా? ఛీ.. వాళ్లు ఏమైనా అనుకోనియ్యి’ అని అక్కడితో కట్ చేసేస్తా. బుర్రలో పెట్టుకోను. నెక్స్ట్ వాళ్లు మళ్లీ నాకు కనిపించినప్పుడు మాత్రం.. ఓ ఫేక్ నవ్వు నవ్వి ఊరుకుంటా. నా గురించి తెలియని వాళ్లు మాట్లాడుకుంటే పట్టించుకోను.. కానీ నేను నమ్మిన వాళ్లు నా గురించి చెడుగా మాట్లాడితే మాత్రం తట్టుకోలేను. వెంటనే వాళ్లని అడిగి తెలుసుకుంటాను.



చిన్నారి సీరియల్ తరువాత లోగిలి అనే సీరియల్ చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్‌తో నాకు సంబంధం ఉందని.. మా ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని కొన్ని లక్షల గాసిప్స్ వచ్చాయి. అప్పుడే నేను ఇండస్ట్రీకి రావడం వల్ల.. ఇలాంటివి నాకు కొత్త కావడం వల్ల ఆ గాసిప్ నాకు చాలా హార్ట్ బ్రేకింగ్‌గా అనిపించింది. ఎంతలా బాధపడ్డానంటే.. తిరిగి బెంగుళూరుకో.. తిరుపతికో వెళ్లిపోదాం.. ఇక ఇండస్ట్రీలో ఉండకూడదని డిసైడ్ అయ్యా. మా ఇంట్లో వాళ్లైతే.. తిరిగి వెళ్లిపోవడానికి డిసైడ్ అయిపోయారు. అలాంటి సందర్భంలో నాకు మూడు నెలలు గ్యాప్ వచ్చింది. ఎలాంటి ప్రాజెక్ట్‌లు చేయలేదు. మా అమ్మమ్మకి హెల్త్ బాలేకపోవడంలో అటూ ఇటూ తిరిగడం వల్ల.. సీరియల్స్ గ్యాప్ వచ్చింది. ఆ టైంలోనే మనసు మమత సీరియల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు చాలామంది అనుకున్నారు.. నేనూ ఆ దర్శకుడు లేచిపోయి పెళ్లి చేసేసుకున్నాం అని అనుకున్నారు. ఆ మూడు నెలల గ్యాప్‌లో మా పెళ్లైపోయిందని గాసిప్ పుట్టించారు. ఆ మూడు నెలలు అయిన తరువాత వెనక్కి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ నా దగ్గరకు వచ్చి.. నీకు ఆ డైరెక్టర్‌తో పెళ్లైపోయిందంట కదా.. ఎందుకు అలా చేశావ్.. అనేవారు. స్నేహితులు, నాతో పనిచేసేవాళ్లు కూడా అడిగారు. ఆ టైంలో నేను ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఎందుకంటే నేను ఆ గాసిప్ వల్ల చాలా బాధపడుతూ ఉన్నాను. మా అమ్మమ్మ చనిపోయిన బాధలో ఉంటే.. నా దగ్గరకు వచ్చి ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటే చాలా భరించాను. ఆ తరువాత బాగా ఆలోచించుకుని వాటి నుంచి రియలైజ్ అయ్యాను. ఎవరు ఎంత గట్టిగా కొట్టడానికి ప్రయత్నించినా పిల్లర్‌లా నిలబడాలని స్ట్రాంగ్ అయ్యా. అప్పటి నుంచి ఐతే ఏంటి ఇప్పుడు.. నీకెందుకు అని అడగడం మొదలుపెట్టా. అప్పటి నుంచే నాకు తలపొగరు అని అనడం మొదలుపెట్టారు. ఆ తరువాత నుంచి నా ముందు ఎవరూ ఇలాంటివి అడగరు. వెనక మాట్లాడుకుంటారు తప్ప.. నా ముందు మాట్లాడారా?? ఇక అయిపోతారు. నా గురించి మాట్లాడితే.. వాళ్ల గోతులు తవ్వి అందులో కూర్చోబెడతా. గుచ్చి గుచ్చి అడిగేవాళ్లపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతా’ అంటూ చెప్పుకొచ్చింది హరితేజ.

 


ఇక దర్శకుడు త్రివిక్రమ్ ఇలాంటి గాసిప్‌లపై ఎలా స్పందిస్తారో కూడా చెప్పింది హరితేజ.. ‘త్రివిక్రమ్ అంటే మహావృక్షం.. ఆయన నీడలో బతుకుతున్నవాళ్లం మేమంతా. ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టిన తరువాత చాలా విషయాలు నేర్చుకున్నా.. పుస్తకాలు చదవడం మొదలుపెట్టా. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం.. గాసిప్‌లు కాకుండా జీవితానికి ఉపయోగపడే విషయాలు.. మంచి విషయాలు నేర్చుకున్నా. పొరపాటున త్రివిక్రమ్ గారి దగ్గర గాసిప్ మాట్లాడితే.. ఆ అమ్మాయి ఇలా అంట తెలుసా అని అంటే.. నా వైపు చాలా చీప్‌గా చూస్తారు. నువ్ ఇలాంటివి చెప్పి నా టైం పాడు చేసుకుని.. ఆ అమ్మాయి గురించి నాతో చెప్తున్నావా?? ఇది నాకు అవసరమా? నాకు ఎందుకు ఈ సోది.. వేరేది మాట్లాడు.. అని అంటారు. ఆయన అసలు గాసిప్స్ వినరు. ఆ పాత కాలంలో కొప్పుల బ్యాచ్ మాట్లాడినట్టు ఈ సోది మానెయ్.. మంచి పుస్తకం చదువు అని చెప్తారు. ఆయన మాటలకి నేను చాలా మారాను’ అంటూ గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.


నాకో న్యాయం... నా బామ్మర్దికో న్యాయమా...? జేసి ఫైర్

కేటీఆర్ ముఖ్యమంత్రి పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు..పెరుగుతున్న నేతల మద్దతు..?

వైసీపీ నేత‌ల ప‌నితో జ‌గ‌న్‌కు మొద‌టికే మోసం వ‌స్తోందా...!

ఏపీలో ఆ పార్టీ చంద్ర‌బాబుతో చేతులు క‌లిపిందా... సీన్ రివ‌ర్స్‌...!

గల్లా-రామ్మోహన్-కేశినేనిలు ఫిక్స్ అయిపోయారా ?

కేటిఆర్ సీఎం అవ్వాలి... మంత్రి, ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కాపీ ఆరోపణలపై విరుచుకుపడ్డ తమన్...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>