Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/pooja-hegde-to-act-with-tamil-suer-star-vijay-directed-by-dileep-nelson36ebf155-a89c-46b3-9447-daaa53dcf806-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/pooja-hegde-to-act-with-tamil-suer-star-vijay-directed-by-dileep-nelson36ebf155-a89c-46b3-9447-daaa53dcf806-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతోంది స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే. అక్కినేని యువ హీరో నాగచైతన్యతో‘ఒకలైలా కోసం’ సినిమాతో తెలుగు తెరకు తెరం గేట్రం చేసి మంచి హిట్ ను తనఖాతాలో వేసుకుంది ఈ సుందరి. ఆ తర్వాత మెగా హీరో వరున్ తేజ్ కు జోడీగా‘ముకుంద’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది ఈ చిన్నది. కాగా ఈ రెండు సినిమాల తర్వాత ఈ బ్యూటీకి వరుసగా సినిమాల్లో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. చిన్న హీరోల నుంచి టాప్ స్టార్స్ వరకు అందరి సరసన నటిస్తూ పూజా మంచి పేరును తెచ్చుకుంటోందpooja hegde;beauty;mahesh;ntr;prabhas;pooja hegde;akhil akkineni;maharshi;nageshwara rao akkineni;prince;vijay;india;tollywood;cinema;tamil;maharshi 1;blockbuster hit;hero;joseph vijay;yuva;nandamuri taraka rama rao;dalapathi;aravinda sametha veera raghava;mukundaపూజా హెగ్డేకు అప్పడు కలిసిరాకే టాలీవుడ్ లోకి వచ్చింది.. మరి ఇప్పుడన్నా కొలిసొస్తుందో లేదో?పూజా హెగ్డేకు అప్పడు కలిసిరాకే టాలీవుడ్ లోకి వచ్చింది.. మరి ఇప్పుడన్నా కొలిసొస్తుందో లేదో?pooja hegde;beauty;mahesh;ntr;prabhas;pooja hegde;akhil akkineni;maharshi;nageshwara rao akkineni;prince;vijay;india;tollywood;cinema;tamil;maharshi 1;blockbuster hit;hero;joseph vijay;yuva;nandamuri taraka rama rao;dalapathi;aravinda sametha veera raghava;mukundaWed, 20 Jan 2021 11:10:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతోంది స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే. అక్కినేని యువ హీరో నాగచైతన్యతో‘ఒకలైలా కోసం’ సినిమాతో తెలుగు తెరకు తెరం గేట్రం చేసి మంచి హిట్ ను తనఖాతాలో వేసుకుంది ఈ సుందరి. ఆ తర్వాత మెగా హీరో వరున్ తేజ్ కు జోడీగా‘ముకుంద’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది ఈ చిన్నది. కాగా ఈ రెండు సినిమాల తర్వాత ఈ బ్యూటీకి వరుసగా సినిమాల్లో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. చిన్న హీరోల నుంచి టాప్ స్టార్స్ వరకు అందరి సరసన నటిస్తూ పూజా మంచి పేరును తెచ్చుకుంటోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ బిజీగా ఉండే హీరోయిన్లలో ఒకరుగా ముందుకు సాగుతోంది. కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన‘అరవింద సమేత’, ప్రిన్స్ మహేశ్ బాబు‘మహర్షి’ సినిమాల ద్వారా మంచి హిట్ ను అందుకుంది ఈ చిన్నది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి టాలీవుడ్ లో చేతినిండా సినిమాలున్నాయి.
అక్కినేని హీరో అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటించింది ఈ కుర్రది. ఈ సినిమా షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసుకుని వేసవికి రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. దీనితో పాటుగా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలో కూడా పూజా నటిస్తున్న సంగతి తెలిసిందే.  తెలుగు సినిమాల్లో అదరగొడుతున్న ఈ బుట్టబొమ్మ కు మరో బంపర్ ఆఫర్ తలుపుతట్టిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు పరిశ్రమలో హిట్ల బాటపట్టిన ఈ చిన్నదానికి తమిళ్ లో నటించే అవకాశం కొట్టేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంతకు మునుపే పూజ ‘ముగమూడి’ అనే తమిళ్ సినిమాలో నటించింది. ఇది 2012 లో రిలీజ్ అయ్యింది. కానీ ఈ సినిమా ఈ బుట్టబొమ్మకు అంతగా గుర్తింపు తీసుకురాలేకపోయింది.

అప్పటి నుంచి ఈ చిన్నది తమిళ సినిమాల వైపు చూడలేదు. దాదాపుగా 8 ఏండ్ల తర్వాత మళ్లీ తమిళ్ లో నటించే అవకాశాన్ని అందుకుంది. అదికూడా తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి సరసన నటించే బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తమిళ తెరకు ‘ముగమూడి’ సినిమాతో తెరంగేట్రం చేసినా అది ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో ఈ బుట్టబొమ్మ టాలీవుడ్ లోకి వచ్చేసింది.  మళ్లీ ఇప్పుడు మరో అవకాశం రావడంతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమానన్నా ఈ చిన్నదానికి మంచి పేరు తీసుకొస్తుందో లేదో చూడాలి మరి.  


ఆ టీడీపీ సీనియ‌ర్ బ్యాక్‌టు పెవెలియ‌న్‌... స‌త్తా చాటేనా..?

దేవినేని ఉమా ఒంట‌రి పోరు.. ఇప్పుడు బాధ తెలిసొస్తోందా...!

డెసిషన్ తీసుకోవడంలో ఏమాత్రం లేటు చేసిన అది జరిగిపోతుంది: చమ్మక్ చంద్ర

ఏపీలో విమర్శల దెబ్బకు వెయ్యి కోట్లు ఇచ్చిన జగన్

మేజ‌ర్ డెసిష‌న్‌: బీజేపీ వైపు... వివేకా కుటుంబం చూపు

పెళ్లాం చెబితే వినాలి.. టాలీవుడ్‌లో స్టార్స్ భార్యల పెత్తనం..ఇది మామూలు స్ట్రోక్ కాదు

బ్రేకింగ్: ఏపీలో భారీ బహిరంగ సభ... వస్తున్న కేంద్ర మంత్రులు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>