MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-samantha-in-gunasekhar-shankutala-race3e01ebe0-fc23-4d6b-be0b-234232451eb8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-samantha-in-gunasekhar-shankutala-race3e01ebe0-fc23-4d6b-be0b-234232451eb8-415x250-IndiaHerald.jpgదాదాపుగా ఆరేళ్ల క్రితం రుద్రమ దేవి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన గుణశేఖర్ ఆ తర్వాత మరే సినిమా చేయలేదు. రానా హీరోగా హిరణ్యకశిప అనే ఒక సినిమా చేస్తున్నానని ఆయన గతంలో ప్రకటించాడు. అయితే ఏమైందో తెలియదు గానీ ఆ సినిమా అటకెక్కింది. ఇప్పుడు ఆయన శాకుంతలం అనే సినిమా అనౌన్స్ చేశాడు. శకుంతల, దుష్యంతుల ప్రేమ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ కథను ఆధారంగా చేసుకుని ఆయన ఇప్పుడు సినిమా తీస్తున్నారు. శకుంతల పాత్రకు సమంతను ఎలాగోలా ఒప్పించి గలిగాడు కానీ ఇప్పుడు దుశ్యంతుడుగా నటించేది ఎవరు అనేది ఆసక్తికరంగా shakunthalam;rana;editor mohan;gunasekhar;prema;tollywood;cinema;love;heroఅమ్మో ఆ సినిమానా ? అంటూ బెంబేలెత్తుతున్న టాలీవుడ్ హీరోలుఅమ్మో ఆ సినిమానా ? అంటూ బెంబేలెత్తుతున్న టాలీవుడ్ హీరోలుshakunthalam;rana;editor mohan;gunasekhar;prema;tollywood;cinema;love;heroWed, 20 Jan 2021 14:00:00 GMTదాదాపుగా ఆరేళ్ల క్రితం రుద్రమ దేవి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన గుణశేఖర్ ఆ తర్వాత మరే సినిమా చేయలేదు. రానా హీరోగా హిరణ్యకశిప అనే ఒక సినిమా చేస్తున్నానని ఆయన గతంలో ప్రకటించాడు. అయితే ఏమైందో తెలియదు గానీ ఆ సినిమా అటకెక్కింది. ఇప్పుడు ఆయన శాకుంతలం అనే సినిమా అనౌన్స్ చేశాడు. శకుంతల, దుష్యంతుల ప్రేమ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ కథను ఆధారంగా చేసుకుని ఆయన ఇప్పుడు సినిమా తీస్తున్నారు. శకుంతల పాత్రకు సమంతను ఎలాగోలా ఒప్పించి గలిగాడు కానీ ఇప్పుడు దుశ్యంతుడుగా నటించేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. 


ఆయన టాలీవుడ్ లో ఉన్న ఎవరో ఒక స్టార్ హీరో ని దుశ్యంతుడుగా తీసుకోవాలని తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఎందుకో టాలీవుడ్ హీరోలు ఎవరూ ఈ సినిమా మీద ఆసక్తి చూపించడం లేదు. కొందరు హీరోలు అయితే అమ్మో ఆ సినిమానా అస్సలు చేయలేమంటూ మొహం మీదనే చెప్పెసినట్టు తెలుస్తోంది. ఇలా చాలా మంది టాలీవుడ్ హీరోలను సంప్రదించిన మీదట ఇక్కడ ఎవరూ వర్కౌట్ కాక పోవడంతో గుణశేఖర్ మలయాళం యాక్టర్ ని ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు.


మలయాళం యాక్టర్ దేవ్ మోహన్ చేత దుష్యంతుడి పాత్ర చేస్తే బాగుంటుందని ఆయన ఫిక్స్ అయ్యాడట. గత ఏడాది రిలీజ్ అయిన సూఫియం సుజాతీయం అనే సినిమాతో ఆయన హీరోగా పరిచయమయ్యాడు. గుణశేఖర్ చెప్పిన కథ నచ్చడంతో నటిస్తానని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు సమాచారం. మరో భాషకు చెందిన నటుడిని తీసుకుంటే ఆ భాషలో కూడా ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశం ఏర్పడుతుందని గుణశేఖర్ భావిస్తున్నాడు. దీనికి సంబంధించి వీలైనంత త్వరగా అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం కనిపిస్తోంది.


పోలీసులు వైసీపీని ఇబ్బంది పెట్టడం ఖాయమా...?

ఎస్బిఐ కీలక నిర్ణయం.. ఇలా చేస్తే అదిరిపోయే ప్రయోజనాలు..?

మంత్రులే జగన్ ని నాశనం చేస్తున్నారా...?

ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్.. ఇక ఈ ఏటీఎంలలో డబ్బులు తీసుకోలేరు..?

నా ఇమేజ్ కు సరిపోదని ఆ సినిమాను రిజెక్ట్ చేశా. : జూనియర్ ఎన్టీఆర్.

దేవినేని దూకుడుతో బాబుకు దెబ్బ‌డిపోయిందే...!

ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే.. స్థానిక ఎన్నికలు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>