MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan89456f48-c30f-4b16-b83d-579858b28bee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan89456f48-c30f-4b16-b83d-579858b28bee-415x250-IndiaHerald.jpg సాయి పల్లవితో నటించాలి అంటే చాలామంది హీరోలు హౌమ్ వర్క్ చేయవలసిన పరిస్థితి. ఈవిషయాన్ని నాని శర్వానంద్ గతంలో ఓపెన్ గానే చెప్పారు. సాయి పల్లవితో నటించేముందు క్రితంరోజు రాత్రి తమ డైలాగ్స్ ను ఒకటికి పదిసార్లు చదువుకుంటూ ఉంటామని లేకుంటే సింగిల్ షాట్ లో సీన్ ను ఒకే చేసే సాయి పల్లవి ముందు నిలబడటం కష్టం అంటూ అనేకమంది హీరోలు ఓపెన్ గా చెప్పిన విషయాలను బట్టి ఆమె టాలెంట్ ఏమిటో అర్ధం అవుతుంది.ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్ భార్యగా ‘అయ్యప్పన్ కొషియమ్’ తెలుగు రీమేక్ లో నటిస్తున్న పరిస్థితులలో వీరిద్దరి కాంబినేషpavankalyan;pawan;nani;rana;sharwanand;aishwarya;aishwarya rajesh;kalyan;krish;suma;suma kanakala;cinema;remake;sai pallaviపవన్ కు మొదలైన సాయి పల్లవి సమస్యలు !పవన్ కు మొదలైన సాయి పల్లవి సమస్యలు !pavankalyan;pawan;nani;rana;sharwanand;aishwarya;aishwarya rajesh;kalyan;krish;suma;suma kanakala;cinema;remake;sai pallaviWed, 20 Jan 2021 09:00:00 GMTసాయి పల్లవితో నటించాలి అంటే చాలామంది హీరోలు హౌమ్ వర్క్ చేయవలసిన పరిస్థితి. ఈవిషయాన్ని నాని శర్వానంద్ గతంలో ఓపెన్ గానే చెప్పారు. సాయి పల్లవితో నటించేముందు క్రితంరోజు రాత్రి తమ డైలాగ్స్ ను ఒకటికి పదిసార్లు చదువుకుంటూ ఉంటామని లేకుంటే సింగిల్ షాట్ లో సీన్ ను ఒకే చేసే సాయి పల్లవి ముందు నిలబడటం కష్టం అంటూ అనేకమంది హీరోలు ఓపెన్ గా చెప్పిన విషయాలను బట్టి ఆమె టాలెంట్ ఏమిటో అర్ధం అవుతుంది.


ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్ భార్యగా ‘అయ్యప్పన్ కొషియమ్’ తెలుగు రీమేక్ లో నటిస్తున్న పరిస్థితులలో వీరిద్దరి కాంబినేషన్ పై అంచనాలు పెరిగి పోతున్నాయి. ఈమూవీలో రానా పక్కన ఐశ్వర్య రాజేష్ నటిస్తూ ఉంటే సుముద్రఖని మరొక కీలక పాత్రలో నటిస్తున్నాడు.


మూవీ షూటింగ్ కు రంగం అంతా సిద్ధం అయినా సాయి పల్లవితోనే అసలు సమస్య అని అంటున్నారు. ఈమూవీకి సంబంధించి పవన్ డేట్స్ దొరుకుతున్నప్పటికీ సాయి పల్లవి బిజీ వల్ల ఆమె డేట్స్ దొరకడంలేదు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె అనేక సినిమాలలో నటిస్తున్న పరిస్థితులలో ఈ డేట్స్ సమస్య ఏర్పడింది అని అంటున్నారు.


ఆమె డేట్స్ విషయంలో క్లారిటీ వస్తేకాని ఈమూవీ షూటింగ్ ముందుకు సాగదని అందువల్ల ఆమె డేట్స్ గురించి ఏకంగా పవన్ కూడ వేచి చూడవలసిన పరిస్థితి అని టాక్. దీనితో ఆమె డేట్స్ వచ్చే వరకు పవన్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీకి సంబంధించి ఇప్పటికే సిద్ధమైన ఒక భారీ సెట్ లో ఆమూవీ షూటింగ్ ను కొనసాగించి ఆతరువాత సాయి పల్లవి డేట్స్ ఎడ్జెస్ట్ అయిన తరువాత ఈమూవీ షూటింగ్ వైపు వస్తాడని అంటున్నారు. ఆమె డేట్స్ దొరికితే చాలు ఒక పెద్ద షెడ్యూల్ పోలాచీలో ప్లాన్ చేసి ఈమూవీని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ లోపుగా ఈమూవీకి సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి..





జగన్ కు రైతులంటే అంత చిన్న చూపు ఎందుకు..??

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు స్క్రిప్ట్ ను ఫాలోఅయితే అంతే సంగతులా ?

తిరుపతి గెలుపుపై జనసేన-బీజేపీ ధీమా..

కన్నడ ప్రేక్షకులు టీవీలో ఎక్కువగా చూసిన తెలుగు సినిమాలు ఇవే..!

తప్పులు చేయడంలో జగన్‌.. శిశుపాలుడిని మించిపోయాడా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎన్టీయార్ కు భారతరత్న పై ఇంకా డ్రామాలా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: బొత్స తమ్ముడుకు ప్లస్ అవుతున్న టీడీపీ...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>